
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్, జేడీ వాన్స్‌ల ఆవేశపూరిత సంభాషణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్ అనుకూల నిరసనలు జరిగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్‌లలో వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ‘అమెరికా స్టాండ్స్ విత్ ఉక్రెయిన్’, ‘బి స్ట్రాంగ్ ఉక్రెయిన్’ ప్లకార్డులను ప్రదర్శించారు.
హాలిడే కోసం వెర్మోంట్‌లోని వెయిట్స్‌ఫీల్డ్‌కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. మరోవైపు వీరికి వ్యతిరేకంగా, ట్రంప్, వాన్స్‌లకు అనుకూలంగా వెయిట్స్‌ఫీల్డ్‌లో కౌంటర్ నిరసనలు కూడా జరిగాయి. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టోర్ల ముందు కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు.
Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv
— Bill Madden (@maddenifico) March 1, 2025
ట్రంప్‌పై నమ్మకం లేదు..
ఇదిలా ఉండగా.. అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు.
ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించలేదు.
Hundreds of protesters gathered in Waitsfield on Saturday morning to protest Vice President JD Vance, who is visiting Vermont with his family for a ski trip this weekend. pic.twitter.com/gICcSJBU2a
— Vermont Public (@vermontpublic) March 1, 2025
Comments
Please login to add a commentAdd a comment