Sold Out
-
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
కోట్ల ధర పలికిన జత ఎద్దులు
-
అమ్మింది.. పతకాన్నే కానీ దేశాన్ని కాదుగా అంటున్నాడ్సార్!
అమ్మింది.. పతకాన్నే కానీ దేశాన్ని కాదుగా అంటున్నాడ్సార్! -
మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటూ ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ను విడుదల చేయడం, నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్ బయోలో ఏకంగా పెర్ఫ్యూమ్ సేల్స్ మేన్ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. (TCS Work From Home: ఉద్యోగులకు కీలక ఆదేశాలు) దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్ చేసిన ఈ పెర్ఫ్యూమ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మస్క్ అందించిన సమాచారం ప్రకారం ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ‘బర్న్ట్ హెయిర్’ పెర్ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. అలాగే డిజిటర్ కరెన్సీ డీజీ కాయిన్ చెల్లింపుల ద్వారా కూడా దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెర్ప్యూమ్ బర్న్ట్ హెయిర్ ఓమ్నిజెండర్ ఉత్పత్తి అని, దీన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించ వచ్చని వెల్లడించారు. అంతేకాదు ఒక మిలియన్ బాటిల్స్ పెర్ఫ్యూమ్ అమ్ముడైతే వచ్చే వార్తా కథనాలకోసం ఆసక్తిగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్లో దాని లిస్టింగ్, “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని పేర్కొనడం విశేషం. అయితే మస్క్ బర్న్ట్ హెయిర్ ఫెర్ప్యూమ్ ప్రారంభించినట్లు ప్రకటించిన వెంటనే ట్విటర్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. చెత్తగా పేరు పెట్టిన ఫెర్ప్యూమ్ను 100 డాలర్లకు అమ్ముకుంటూ మనల్ని ఎగతాళి చేస్తున్నాడంటూ ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. The finest fragrance on Earth!https://t.co/ohjWxNX5ZC pic.twitter.com/0J1lmREOBS — Elon Musk (@elonmusk) October 11, 2022 10,000 bottles of Burnt Hair sold! — Elon Musk (@elonmusk) October 12, 2022 Can’t wait for media stories tomorrow about $1M of Burnt Hair sold 🤣 — Elon Musk (@elonmusk) October 12, 2022 Not my meme, found it here on Twitter 😂💗 pic.twitter.com/k6WLBUNYnl — 𝐤𝐞𝐧𝐳𝐢𝐞 𝐨𝐫 𝐣𝐮𝐬𝐭 "𝐤𝐞𝐧𝐳" (@lavandulakosmos) October 12, 2022 Burnt Hair🔥 pic.twitter.com/Ln1dIaAy8H — DogeDesigner (@cb_doge) October 12, 2022 -
హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్న ఎల్ఐసీ పాలసీలు..నిమిషానికి ఎంతంటే..?
ముంబై: ప్రభుత్వరంగ ఎల్ఐసీ పాలసీల విక్రయాల్లో దూసుకెళ్లింది. 2021–22 ఆర్థిక సంవత్సరం లో 2.17 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. 2020–21లో విక్రయించిన 2.10 కోట్ల పాలసీలతో పోలిస్తే 3.54 శాతం వృద్ధి కనిపించింది. ప్రతి నిమిషానికి 41 పాలసీలను విక్రయించినట్టు ఎల్ఐసీ తెలిపింది. మొత్తం గ్రూపు ఇన్సూరెన్స్ పాలసీల స్థూల ఆదాయం (జీఆర్పీ) 2021–22లో 12.66 శాతం పెరిగి రూ.1,43,938 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.1,27,768 కోట్లుగా ఉండడం గమనార్హం. ఇండివిడ్యువల్ (వ్యక్తులకు సంబంధించి విడిగా తీసుకునే) నాన్ సింగిల్ ప్రీమియం 8.82% వృద్ధి చెంది రూ.30,016 కోట్లుగా ఉంటే, ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం సైతం 61% వృద్ధితో రూ.4,018 కోట్లుగా ఉన్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. మొదటి ఏడాది ప్రీమియం మార్కెట్లో 63.25% వాటా సంస్థ చేతిలో ఉంది. చదవండి: మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..? -
మహీంద్రా సంచలన నిర్ణయం..! ఆ కంపెనీని పూర్తిగా అమ్మేసింది..!
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా గ్రూప్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. దక్షిణకొరియాకు చెందిన శాంగ్యాంగ్ మోటార్స్‌ను పూర్గిగా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీలో మహీంద్రా 75 శాతం మేర వాటాలను కల్గి ఉంది. దక్షిణకొరియాకు చెందిన శాంగ్యాంగ్ మోటార్స్‌ను 2010లో మహీంద్రా అండ్ మహీంద్రా వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా భారీ నష్టాలు రావడంతో కంపెనీని వదులకునేందుకు మహీంద్రా సిద్దమైంది. అంతేకాకుండా భారీ అప్పులు శాంగ్‌యాంగ్‌ను వెంటాడాయి.దీంతో మహీంద్రా కంపెనీ వీటిలో ఇన్వెస్ట్ చేయడం నిలిపివేసింది. శాంగ్‌యాంగ్‌ను కొనుగోలుచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మహీంద్రా కొత్త కొనుగోలుదారుని కనుగొనడంలో విఫలమైనందున శాంగ్యాంగ్ మోటార్ చాలా నెలలుగా దక్షిణ కొరియా కోర్టు రిసీవర్‌షిప్‌లో ఉంది. ఎడిసన్ చేతిలోకి..! దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ఎడిసన్ మోటార్స్ .కో నేతృత్వంలోని కన్సార్టియం అప్పుల ఊబిలో కూరుకుపోయిన శాంగ్యాంగ్ మోటార్ కో లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు అంగీకరించిందని శాంగ్యాంగ్ మోటార్ సోమవారం తెలిపింది. సుమారు 254.56 మిలియన్ డాలర్లకు స్థానిక దక్షిణకొరియా కన్సార్టియం కొనుగోలు చేసినట్లు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారీ దెబ్బ..! ఇటీవలి కాలంలో శాంగ్‌యాంగ్‌కు మోటార్స్‌కు భారీ నష్టాలు వెంటాడాయి. కోవిడ్-19 రాకతో అది మరింత తీవ్రంగా మారింది. వాహన విక్రయాలు 2021లో 84,000కు తగ్గాయి.ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 21 శాతం తగ్గింది. దీంతో కంపెనీను అమ్మకానికి ఉంచింది. చదవండి: అదానీ గ్రూప్స్ మరో రికార్డు..! ఏకంగా రూ. 10 లక్షల కోట్లు..! -
ఎలక్ట్రిక్ కార్లపై సబ్సీడీ, ఒక్క నెలలోనే హాట్ కేకుల్లా అమ్ముడైన కార్లు!
మారుతున్న కాలానికి అనుగుణంగా మన అభిరుచులు మారాలి. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి పోతాం. అందుకే వాహనదారులు ప్రస్తుతం వినియోగిస్తున్నఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు మొగ్గుచూపుతున్నారు.దీనికి తోడు ఆయా ప్రభుత్వాలు సబ్సీడీని అందిస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీస్థాయిలో జరుగుతున్నాయి. చైనా పాసింజర్ కార్ అసోషియేషన్ (సీపీసీఏ) ప్రకారం.. చైనాకు చెందిన ప్లగ్-ఇన్ కార్ల అమ్మకాలు ఈ ఏడాదిలో 5.5 మిలియన్లు దాటుతాయని సీపీసీఏ ప్రతినిధులు చెబుతున్నాయి. ఇదే సంస్థకు చెందిన కమర్షియల్ వెహికల్స్, బస్సుల అమ్ముకాలు ఇదే స్థాయిలో జరిగితే 6 మిలియన్లు దాటడం ఖాయమని అంటున్నారు. గతేడాది 11నెలల కాలంలో 14.3 శాతంతో ప్లగ్-ఇన్ ఎలక్ట్రిక్ కార్లు 2.7 మిలియన్ల అమ్ముడవ్వగా.. ఒక్క డిసెంబర్ నెలలో 3 మిలియన్లకు పైగా అమ్ముడవ్వడం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదిలో ప్లగ్-ఇన్ కారు అమ్మకాలు 6 మిలియన్లు దాటుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 30 శాతం రాయితీలు వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం..2021 నుంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై చైనాకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు 30 శాతం రాయితీలు ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణే టెస్లా కార్లేనని రిపోర్ట్లు పేర్కొన్నాయి. నాటి మార్కెట్ ధరలకు అనుగుణంగా టెస్లా కారు ధర రూ.1,85,334.61 ఉండగా 30శాతం రాయితీతో రూ.1,29,464.71 కే అందించినట్లు రిపోర్ట్లు ప్రధానంగా హైలెట్ చేస్తున్నాయి.రాయితీలు ఇస్తున్న సమయంలో మార్కెట్ గణనీయంగా దాదాపు రెండింతలు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సబ్సిడీ 2023 వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత రాయితీల్ని తీసివేస్తారని చైనా కార్ల అసోసియేషన్ తెలిపింది. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? -
సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గత వారం విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ దెబ్బకు 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు టెక్ బ్లాగ్లు పలు రిపోర్ట్‌లను వెలుగులోకి తెచ్చాయి. టెక్ బ్లాగ్ గిజ్మో చైనా కథనం ప్రకారం.. న్యు ఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ డిసెంబర్ 28న షావోమీ12 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఆఫ్‌లైన్, ఆన్లైన్ వేదికగా విడుదల చేసిన 5 నిమిషాల్లోనే సుమారు 1.8 బిలియన్ యువాన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.2108 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను అమ్మినట్లు గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది న్యు ఇయర్ సందర్భంగా షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్‌లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు షావోమీ 12, షావోమీ 12ప్రో ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండడం, అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు న్యుఇయర్ సెంటిమెంట్ షావోమీకి కలిసొచ్చింది. దీంతో నిమిషాల వ్యవధిలో భారీ సేల్స్ జరిగినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో హైలెట్ చేసింది. షావోమీ 12 స్పెసిఫికేషన్లు షావోమీ 12 స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూతో 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎక్స్ 766 సెన్సార్లు, 13ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 67వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాల్ట్‌ల వైర్‌లెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు షావోమీ 12 ప్రో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫంచ్ హోల్ కట్ అవుట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరాలు ఉన్నాయి. చదవండి: షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..! -
2 లక్షల కార్ల సేల్, ఎక్కువగా అమ్ముడైన కార్ ఇదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న దక్షిణ కొరియా కంపెనీ కియా భారత్‌లో రెండు లక్షల సెల్టోస్ కార్లను విక్రయించినట్టు ప్రకటించింది. కార్యకలాపాలు ప్రారంభించిన రెండేళ్లలో 1.5 లక్షల యూనిట్ల కనెక్టెడ్ కార్లను అమ్మినట్టు వివరించింది. ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల పైచిలుకు కార్లు దేశంలోని కస్టమర్లకు చేరాయని తెలిపింది. సెల్టోస్ ఎస్యూవీ అమ్మకాల్లో టాప్ వేరియంట్ల వాటా 58%, ఆటోమేటిక్ ఆప్షన్ 35% ఉంది. డీజిల్ పవర్‌ట్రెయిన్ 45% వాటా కైవసం చేసుకుంది. -
ఎస్బీఐ లైఫ్‌కు స్టోక్..కార్లయిల్ ఔట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ వైదొలగింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.9 శాతం వాటాను విక్రయించింది. షేరుకి రూ. 1,130 సగటు ధరలో ఎస్బీఐ లైఫ్లోగల 1.9 శాతం వాటాను అనుబంధ సంస్థ సీఏ ఎమరాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్ డీల్ గణాంకాల ప్రకారం ఈ వాటా విలువ రూ. 2,147 కోట్లు. 2021 జూన్‌కల్లా ఎస్బీఐ లైఫ్‌లో సీఏ ఎమరాల్డ్ 1.9 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. ఈ షేర్లను మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా సింగపూర్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలతోపాటు. పలు మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ షేరు 1.5 శాతం బలపడి రూ. 1,151 వద్ద ముగిసింది. -
అప్పు తీర్చలేక.. భార్యను అమ్మేశాడు
భోపాల్: భర్త అంటే జీవితాంతం తోడుగా ఉండే వాడంటారు. కానీ దీనికి భిన్నంగా ఓ భర్తే తన భార్యను అంగట్లో వస్తువులా భావించి అమ్మేసాడు. అందుకు నిరాకరించడంతో ఆమెను చంపాలని చూశాడు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. గున ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో అతను తన అవసరాల నిమిత్తం ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిళ్లు రావడం, ఇప్పట్లో అప్పు తీర్చే దారి లేక ఆ వ్యక్తి ఓ ఉపాయాన్ని ఆలోచించాడు. ఈ క్రమంలో తన భార్యను లక్ష రుపాయలకు అమ్ముతున్నట్లు వాళ్లకే బేరం కుదుర్చుకున్నాడు. ఇక ఈ విషయాన్ని చెప్పడానికి పొలంలో పనిచేసుకుంటున్న తన భార్య దగ్గరికి వాళ్లని తీసుకెళ్లాడు. తన భార్యతో.. నిన్ను అమ్మేశానని, వాళ్లతో వెళ్లిపొవాల్సిందిగా చెప్పాడు. ఒక్కసారిగా భర్త నోటి నుంచి ఊహించని మాట వినేసరికి ఆమె షాక్ లో ఉండిపోయింది. కాగా ఇందుకు ఆమె నిరాకరిస్తూ... భర్తతో గొడవపడింది. దీంతో ఆ రాత్రి కోపంతో ఆ వ్యక్తి నిద్రపోతున్న తన భార్యను తీసుకెళ్లి బావిలో పడేశారు. ప్రాణాలతో బయటపడ్డ మహిళ తండ్రితో కలిసి పోలీసులకు ఆమె భర్త, అత్తపై ఫిర్యాదు చేసింది. -
soldout: రూ.2.43 కోట్ల కారు.. క్షణాల్లో ఇయర్ స్టాక్ మొత్తం అమ్ముడైంది
ముంబై: కరోనా దెబ్బకు కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ, మందగిస్తున్న ఆర్థిక గమనం వంటి పరిణామాల నేపథ్యంలో ఓ ఖరీదైన అల్ట్రా లగ్జరీ కారు మార్కెట్లోకి వచ్చింది. ఆ కారు ఖరీదు ఎక్స్‌షోరూం ధరనే రూ. 2.43 కోట్ల రూపాయలు. అమ్మకాలు ఎలా అనే సందేహమే లేకుండా క్షణాల్లోనే ఏడాది స్టాక్ అంతా మనవాళ్లు కొనేశారు. మెర్సిడెజా మజాకా లగ్జరీ కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియాలో తాజాగా మైబెక్ జీఎల్ఎస్ 600 సిరీస్‌లో 4 మాటిక్ అల్ట్రామోడ్రన్ లగ్జరీ కారును రిలీజ్ చేసింది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 2.43 కోట్లుగా నిర్ణయించింది. ఇలా లాంఛ్ అయ్యిందో లేదో అలా మొత్తం స్టాక్ మొత్తం అమ్ముడైపోయి రికార్డు సృష్టించింది. 500 కార్లు సోల్డ్ అవుట్ ప్రీమియం కేటగిరి లగ్జరీ కారైన మైబెక్ జీఎల్ఎస్ 600 4 మాటిక్ లగ్జరీ కారును ఇండియా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఏడాదిలో 500 కార్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లాంఛింగ్‌కి ముందే మొత్తం కార్లన్నీ బుక్ అయిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే బుక్ చేసుకున్న వారికి ఈ కార్లు డెలివరీ చేస్తామని ఆ సంస్థ ఈసీవో మార్టిన్ ప్రకటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి : మార్కెట్ లో లంబోర్గిని కొత్త లగ్జరీ కారు -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ.. భర్త లబోదిబో
లక్నో: సొంత కుమారుడి భార్యను విక్రయించాడో మామ. అది కూడా రూ.80 వేలకు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే పరుగులు తీసి రైల్వే స్టేషన్లో ఆమెను ఆ ముఠా నుంచి రక్షించారు. కొంచెం ఆలస్యమై ఉంటే ఆమె అతడికి దక్కకుండాపోయేది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ మామకు ఇలా మహిళలను ముఠాకు విక్రయించడం ఓ వృత్తి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బారబంకి జిల్లాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రరామ్ వర్మ మహిళలతో వ్యాపారం చేస్తుంటాడు. వస్తువులను విక్రయించినట్టు మహిళలను ఓ ముఠాకు అమ్మేసుకోవడం ఈయన ప్రధాన వృత్తి. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 300 మంది మహిళలను విక్రయించాడు. తాజాగా అతడికి కుమారుడి భార్యపై కన్నుపడింది. కోడలిని విక్రయించాలని నిర్ణయించుకుని గుజరాత్‌కు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 5వ తేదీన కోడలిని ఆ ముఠాకు అప్పగించేశాడు. ఈ ఘటనతో షాకయిన కోడలు భర్తకు సమాచారం ఇచ్చింది. పోలీసుల సహాయంతో భర్త వెంటనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. గుజరాత్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి ఆమెను రక్షించి భర్తకు అప్పగించారు. అయితే ప్రధాన నిందితులు మామ చంద్రరామ్, మరొకరు రామ్‌గౌతమ్ తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రరామ్పై ఓ హత్య కేసు కూడా నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
జల్సాలకు అలవాటు పడి కన్నకొడుకునే!
సాక్షి, రాజేంద్రనగర్: జల్సాలకు అలవాటుపడి అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కన్నకుమారుడిని విక్రయించిన తండ్రితో పాటు సహకరించిన ఇద్దరు మధ్యవర్తులు, కొనుగోలు చేసిన భార్యాభర్తలను రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరివద్ద నుంచి రెండు నెలల చిన్నారి బాలుడిని సురక్షితంగా కాపాడి తల్లికి అప్పగించారు. ఐదు సెల్ఫోన్లతో పాటు రూ.2.40లక్షల స్వాదీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం ఎంఎంపహాడీ ప్రాంతానికి చెందిన హైదర్ఆలీ(24), షహానాబేగం(20) భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కిందట వివాహమయింది. వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ అయిన హైదర్ఆలీ జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. రెండు నెలల కిందట వీరికి పండంటి మగబిడ్డ పుట్టాడు. అప్పటి నుంచి హైదర్ఆలీ బాలుడిని విక్రయించి డబ్బుతో అప్పులను తీరుద్దామంటూ భార్య షహానాబేగంకు తెలుపుతున్నాడు. షహానాబేగం అంతగా పట్టించుకోలేదు. ఈ నెల 15న సాయంత్రం షహానాబేగం రంజాన్ ఉపవాస దీక్ష నేపథ్యంలో ప్రార్థన చేస్తున్న సమయంలో హైదర్ఆలీ కుమారుడిని ఆడిస్తున్నట్లు నటించి బయటకు తీసుకువెళ్లాడు. వట్టెపల్లికి చెందిన మ్యారేజ్ బ్యూరో బ్రోకర్ హజేరాబేగం(28), కిషన్‌బాగ్‌కు చెందిన రేష్మాబేగం(23)లను సంప్రదించి రూ.3.80లక్షలకు కుమారుడిని విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ముగ్గురు కలిసి టోలీచౌకిలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులైన భార్యాభర్తలు అబ్దుల్ రియాజ్(38), సహేదామహ్మద్(38)లకు పిల్లలు కాకపోవడంతో వారు చిన్నారిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలుడిని అమ్మిన హైదర్అలీ తల్లి షహానాబేగం వద్దకు వెళ్లాడు. ఆయన భార్య హైదర్ఆలీకి ఫోన్‌చేయగా తల్లి వద్ద ఉన్నానని, సోదరి వద్ద ఉన్నానంటూ తెలిపాడు. మరుసటి రోజు విషయాన్ని షహానాబేగం తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఫోన్లో సంప్రదించగా హైదర్ఆలీ బాలుడిని విక్రయించానని తెలపడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శంషాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి ఐదుగురిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తల్లికి అప్పగించారు. -
విడుదలైన నిమిషాల్లోనే..
లిమిటెడ్ ఎడిషన్‌గా లాంచ్ అయిన వోల్వో సరికొత్త సెడాన్ కారు నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడు పోయింది. ఈ కార్ల బుకింగ్ ప్రారంభమైన 39 నిమిషాల్లోనే మొత్తం యూనిట్లు అమ్ముడయ్యాయట. లిమిటెడ్‌గా తీసుకొచ్చిన మొత్తం 20 యూనిట్లు ప్రీ బుకింగ్‌లో బుక్ అయ్యాయనీ, అమెరికాలో ఈ రికార్డు విక్రయాలు నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. దీని ధర రూ. 45.04 లక్షలు(ఆన్ రోడ్, న్యూఢిల్లీ) . స్వీడన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఉత్పత్తుల సంస్థ వోల్వో ఇటీవల ఎస్60 మోడల్లో ప్రత్యేక ఎడిషన్ కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే . అయితే అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ కారు ను వోల్వో యాప్ ద్వారా శుక్రవారం విక్రయాలను ప్రారంభించారు. కారు ధర, లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రకటించిన తర్వాత 39 నిమిషాల్లోనే కార్లన్నీ బుక్ అయిపోయాయని వోల్వో తెలిపింది. 2019లో ఈ కారును కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు పేర్కొంది. పోలెస్టార్ ఇంజనీర్డ్ వెర్షన్ ఎస్ 60 సెడాన్ వోల్వో యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందని తెలిపింది. 415బీహెచ్ పవర్, 669ఎన్ఎం టార్క్, ఓహిలిన్స్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్, తదితర అధునాతన ఫీచర్స్ ఈ సెడాన్ సొంతం. -
ఇది కోల్‌కతా అభిమానం!
కోల్‌కతా: దేశంలో ఫుట్‌బాల్‌ను పిచ్చిగా ప్రేమించేవారిలో బెంగాలీలు ముందుం టారు. క్రికెట్ క్రేజ్ ఉన్న సమయంలో కూడా కోల్‌కతాలో ఫుట్‌బాల్ వినోదానికి కొదవుండదు. అది అండర్–17 స్థాయిదే అయి నా ఆటపై వారి అభిమానంలో తేడా ఉండదు. మన దేశంలో అక్టోబర్‌లో నిర్వహించే అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు టికెట్లు ఇలా ఆన్లైన్లో పెట్టారో లేదో.. అలా 12 గంటలు గడిచేలోపు ‘సోల్డ్ అవుట్’ బోర్డ్‌లు వేలాడుతున్నాయి. కోల్‌కతాలో జరిగే 10 మ్యాచ్‌లకు (ఫైనల్‌తో కలిపి) టికెట్లను అందుబాటులో ఉంచగా, వాటన్నిం టినీ ఒక్కపూటలోనే కొనేయడం విశేషం. -
ఐఫోన్7 అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్
మెరిసే గాడ్జెట్లపై ఎక్కువగా ఆసక్తిచూపే స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జెట్ బ్లాక్ కలర్ ఆప్షన్ ఐఫోన్7 స్టాక్ అప్పుడే అయిపోయిందట. ఐఫోన్ 7 ప్లస్, అన్నీ జెట్ బ్లాక్ ఐఫోన్7 ఫోన్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్టు యాపిల్ వెల్లడించింది. ముందస్తు రిజిస్ట్రేషన్లతో ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయినట్టు ప్రకటించిన యాపిల్, ఈ ఫోన్ కొనుకుందామని ఆశగా శుక్రవారం స్టోర్‌కు విచ్చేసే వినియోగదారులకు ఇవి పరిమితంగా మాత్రమే అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. రిజర్వేషన్ లేకుండా వచ్చే కస్టమర్లకు సప్లై చేయలేకవచ్చని వెల్లడించింది. పరిమిత పరిమాణంలో మాత్రమే ఈ సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ రంగుల్లో ఐఫోన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. శుక్రవారం నుంచి అన్ని రిటైల్ దుకాణాల్లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు. అయితే ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లతోనే అన్ని అమ్ముడుపోవడంతో, పరిమితంగా మాత్రమే ఈ ఫోన్లు వినియోగదారులకు లభించనున్నాయి. యాపిల్ జెట్ బ్లాక్ ఐఫోన్స్, ఐఫోన్7 ప్లస్ మోడల్స్ అన్నీ ముందస్తు ఆన్లైన్ ఆర్డర్‌తో పూర్తిగా అమ్మేసినట్టు, ప్రస్తుతం ఎలాంటి ఇన్వెంటరీ లేదని తెలిపింది. ఒకవేళ జెట్ బ్లాక్ రంగులో ఐఫోన్ కావాలనుకుంటే, ఆన్లైన్లో ఆర్డరు చేసి, కొన్ని రోజులు వేచిచూడాల్సి ఉందని యాపిల్ పేర్కొంది. స్టోర్లలో ఈ ఫోన్లను పొందలేరని వెల్లడించింది. అన్ని రంగుల అన్ని మోడల్స్ ఐఫోన్లు యాపిల్.కామ్‌లోనే ఆర్డరు చేయాల్సి ఉంటుందని కూడా తెలిపింది. కస్టమర్ల సహనాన్ని తాము అభినందిస్తున్నామని, త్వరలోనే ఈ ఫోన్లను వినియోగదారుల చేతులోకి తీసుకొస్తామని యాపిల్ వివరించింది. అంచనాలకు మించి డిమాండ్ వెల్లువెత్తుండడంతో, కంపెనీ స్టాక్స్ కూడా అంతర్జాతీయంగా ఈ వారంలో 8 శాతం ఎగిశాయి. -
5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్లైన్లోని స్నాప్ డీల్ లో పెట్టిన ఐదునిమిషాల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. 5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్‌ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్‌లో 12 మ్యాగీ ప్యాకెట్లు, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రీజ్‌పై వాడే అయస్కాంతం, మ్యాగీ పోస్ట్ కార్డు, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి. నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలయ్యాయి. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఈ ఏడాది జూన్‌లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.