5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం | 60,000 Maggi kits sold out in 5 mins on Snapdeal | Sakshi
Sakshi News home page

5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం

Published Thu, Nov 12 2015 3:24 PM | Last Updated on Mon, Oct 8 2018 4:21 PM

5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం - Sakshi

5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్‌లైన్‌లోని స్నాప్ డీల్ లో పెట్టిన ఐదునిమిషాల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. 5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్ను ఆన్ లైన్ లో కొనుగోలు చేశారు. మ్యాగీ వెల్కమ్ బ్యాక్ కిట్స్లో 12 మ్యాగీ ప్యాకెట్లు, 2016 మ్యాగీ క్యాలెండర్, మ్యాగీ ఫ్రీజ్పై వాడే అయస్కాంతం, మ్యాగీ పోస్ట్ కార్డు, ఒక వెల్కమ్ బ్యాక్ లెటర్ ఉంటాయి.  

నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో... దాదాపు అయిదు నెలల తర్వాత మ్యాగీ నూడుల్స్ అమ్మకాలు పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. సుమారు 100 పట్టణాల్లో దాదాపు 300 మంది పంపిణీదారుల ద్వారా వీటి విక్రయాలు మొదలయ్యాయి. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక సీసం నిర్దేశిత స్థాయికి మించి ఉందన్న ఆరోపణలపై భారత ఆహార ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ ఏడాది జూన్‌లో వీటి అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement