భారత్‌లోనే అత్యధికంగా వినియోగం
కిట్‌క్యాట్‌కు టాప్–2 మార్కెట్‌గా స్థానం
న్యూఢిల్లీ: మ్యాగీ.. బహుశా భారత్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నూడుల్స్‌కు మారుపేరుగా స్థానం సంపాదించిందంటే ఎంతలా మార్కెట్లోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్ ఉత్పత్తులను ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే మ్యాగీ బ్రాండ్ కింద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023–24లో ఏకంగా 600 కోట్లకుపైగా సర్వింగ్స్ (ఒకరు తినగలిగే పరిమాణాన్ని ఒక సర్వింగ్‌గా పరిగణిస్తారు) స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది.
అంతేకాదు నెస్లే కిట్‌క్యాట్ బ్రాండ్‌కు టాప్–2 మార్కెట్‌గా భారత్ స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల కిట్‌క్యాట్ ఫింగర్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాలను నెస్లే ఇండియా తన 2023–24 వార్షిక నివేదికలో వెల్లడించింది. రెండంకెల వృద్ధితో నెస్లే ఇండియా వేగంగా దూసుకెళ్తున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. భారత్‌లో 10వ ప్లాంటును నెస్లే ఒడిశాలో ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ల విస్తరణ, సామర్థ్యం పెంపునకు 2020–25 మధ్య రూ.7,500 కోట్లు వెచి్చస్తున్నట్టు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ భారత్‌లో 140కిపైగా ఉత్పత్తులను పరిచయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment