Suresh Narayanan
-
మనోళ్లు ‘మ్యాగీ’ లాగించేస్తున్నారు!
న్యూఢిల్లీ: మ్యాగీ.. బహుశా భారత్‌లో ఈ పేరు తెలియనివారు ఉండరేమో. నూడుల్స్‌కు మారుపేరుగా స్థానం సంపాదించిందంటే ఎంతలా మార్కెట్లోకి చొచ్చుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. నూడుల్స్, సూప్స్ ఉత్పత్తులను ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే మ్యాగీ బ్రాండ్ కింద విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా మ్యాగీ ఉత్పత్తుల అమ్మకాల్లో భారత్ తొలి స్థానంలో నిలవడం విశేషం. 2023–24లో ఏకంగా 600 కోట్లకుపైగా సర్వింగ్స్ (ఒకరు తినగలిగే పరిమాణాన్ని ఒక సర్వింగ్‌గా పరిగణిస్తారు) స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వెల్లడించింది.అంతేకాదు నెస్లే కిట్‌క్యాట్ బ్రాండ్‌కు టాప్–2 మార్కెట్‌గా భారత్ స్థానం సంపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో 420 కోట్ల కిట్‌క్యాట్ ఫింగర్స్ అమ్ముడయ్యాయి. ఈ విషయాలను నెస్లే ఇండియా తన 2023–24 వార్షిక నివేదికలో వెల్లడించింది. రెండంకెల వృద్ధితో నెస్లే ఇండియా వేగంగా దూసుకెళ్తున్న మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. భారత్‌లో 10వ ప్లాంటును నెస్లే ఒడిశాలో ఏర్పాటు చేస్తోంది. ప్లాంట్ల విస్తరణ, సామర్థ్యం పెంపునకు 2020–25 మధ్య రూ.7,500 కోట్లు వెచి్చస్తున్నట్టు నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ వెల్లడించారు. గడిచిన ఎనిమిదేళ్లలో కంపెనీ భారత్‌లో 140కిపైగా ఉత్పత్తులను పరిచయం చేసింది. -
ఆహార ధరలే ఆందోళనకరం
న్యూఢిల్లీ: ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్ర భుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోందని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాల ను ఎదుర్కొనడానికి నిత్యావసర వస్తువుల ధరల కదలికను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఇక్కడ జరిగిన ఒక మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ► బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే.. రుతుపవనంలో 30 శాతం లోటు ఉన్నప్పటికీ ఖరీఫ్ పంటపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ► ఎల్‌నినో ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో ఆహార ద్రవ్యోల్బణం అంశాన్ని మనం ఇంకా జాగరూకతతో పరిశీలించాల్సి ఉంటుంది. ► ఇక ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. ఖరీఫ్, రబీ పంటలు ఎలా ఉంటాయన్న అంశంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఆయా అంశాలపై ఇప్పటికీ అనిశ్చితి నెలకొంది. ► గ్రామీణ డిమాండ్ భవిష్యత్ ఇప్పటికీ ఊహాజనితమైన అంశమే. అయితే వర్షాభావం వల్ల గ్రామీణ రంగం తీవ్రంగా ప్రభావితమైతే, అది డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► ప్రముఖ మ్యాగీ ఇన్స్టంట్ నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్లు, నెస్కేఫ్ల ఉత్పత్తి దారైన నెస్లే ఇండియా... భారీ ఆఫర్లతో తన గ్రామీణ మార్కెట్‌ను విస్తరించుకోడానికి ప్రయతి్నస్తోంది. గ్రామీణ మార్కెట్ మొత్తం విక్రయాల్లో ఐదవ వంతు స్థానాన్ని సాధించింది. ఇది చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ, గణనీయమైన సానుకూల అంశం. స్థిర పురోగతిని సంస్థ సాధిస్తుందని భావిస్తున్నాం. జూన్ త్రైమాసికంలో సంస్థ మంచి గ్రామీణ డిమాండ్‌ను సంపాదించింది. ► అయితే పరిస్థితులు క్లిష్టంగా మారితే మా గ్రామీ ణ డిమాండ్‌పై సైతం ప్రతికూల ప్రభావం పడుతుంది. ► 2 నుంచి 6వ అంచె పట్టణాల్లో డిమాండ్ ఇప్పటికి సానుకూలంగా ఉంది. తీవ్ర ప్రతికూల పరిస్థితులు కనబడ్డం లేదు. ► సమస్యకు సంబంధించి చూస్తూ కూర్చోవడం ఎంతమాత్రం సమంజసం కాదు. సవాళ్లను ఎదుర్కొనడానికి నిరంతర చర్యలు కొనసాగాలి. డెయిరీపై దీర్ఘకాలిక ప్రభావం... డెయిరీ రంగంలో ధరల విషయాన్ని తీసుకుంటే.. తక్షణం ఏదో జరిగిపోతోందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయాన్ని, ప్రభావాలను పరిశీలించాలి. భవిష్యత్ ప్రభావాలు, పరిణామాల గురించి అధ్యయనం చేయాలి. సవాళ్లు ఇదే విధంగా కొనసాగితే, తక్షణ ప్రభావం చూపకపోయినా, 2024 నాటికి నిజంగా ఈ రంగంలో తీవ్ర సవాళ్లు ఉంటాయి. డెయిరీ రంగానికి సంబంధించి కోవిడ్ అనంతర ప్రభావాలపై మాట్లాడాలి. చర్మ వ్యాధులుసహా అనేక ఇతర సవాళ్లు ఉన్నాయి. ఈ సమస్యలకు ఇంకా పరిష్కారం కనుగొనాలి. అలాగే ఉత్పత్తి వ్యయం బాగా పెరిగింది. దాణా ధరలో 40 శాతం పెరుగుదల కనబడుతోంది. పరిశ్రమ ఇంతటి క్లిష్ట స్థితిని భవిష్యత్తులో ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాల విషయంలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి నిల్వలు భారీగా అందుబాటులో ఉంటాయి. మరోసారి తగ్గిపోతాయి. ఆయా అంశాలన్నింటిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. -
2023లోనూ ఆహార ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: ఆహార ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో మాంద్యం ఘంటికలు 2023లోనూ కొనసాగుతాయని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ అంచనా వేశారు. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు నెస్లే ఇండియా పలు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. వాటాదారులకు పంపిన తాజా వార్షిక నివేదికలో నారాయణన్ ఈ అంశాలను ప్రస్తావించారు. (ఇదీ చదవండి: జియో కస్టమర్లకు ట్విస్ట్: ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు) అటువంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఆశాజనకంగా ఉండడం కంటే, బోరింగ్‌గా స్థిరత్వంతో కొనసాగం మెరుగైన విధానంగా పేర్కొన్నారు. కంపెనీ అమ్మకాల పరిమాణంపై దృష్టి పెట్టిందని, ‘రూర్బాన్’ వ్యూహం కింద చిన్న పట్టణాలు, గ్రామాలకూ విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలనూ చేపడుతున్నట్టు తెలిపారు. అదే సమయంలో ప్రీమియం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డిమాండ్ ఉంటున్నట్టు వివరించారు. నెస్లేకి వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని నారాయణన్ తెలిపారు. (ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) 2022లో ఎన్నో సవాళ్లు.. 2022ను అసాధారణ సంవత్సరంగా పేర్కొన్నారు. సంవత్సరం ఆరంభంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్, వాతావరణ సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం పరిమాణాలను ప్రస్తావించారు. ఎఫ్ఎంసీజీ రంగానికి గతేడాది సమస్యాత్మకంగా ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, సరఫరా వ్యవస్థలో సమస్యలు, ఇంధన ధరల పెరుగుదల, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలపై ద్రవ్యోల్బణం ప్రభావం అధికంగా ఉన్నట్టు వివరించారు. (హిండెన్‌బర్గ్ లేటెస్ట్ రిపోర్ట్: భారత సంతతి ఎగ్జిక్యూటివ్ అమృత ఆహూజా పాత్ర ఏంటి?) ఈ సమస్యలను అధిగమించే సామర్థ్యాలు భారత్‌కు ఉండడం, ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యం పాటించడాన్ని అంతర్జాతీయంగా గుర్తింపునకు నోచుకున్నట్టు నారాయణన్ చెప్పారు. బలమైన కార్యాచరణ అమల్లో పెట్టామని, నిరంతరం పర్యవేక్షణతోపాటు అసాధారణ సవాళ్లను గుర్తించడం, పరిష్కరించడం ఇందులో భాగమని వివరించారు. నెస్లే ఉత్పత్తుల లేబుళ్లపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఇతర సమాచార వ్యాప్తి ద్వారా కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు పనిచేస్తున్నట్టు వాటాదారులకు తెలిపారు. -
నెస్లేకు వందకోట్లు గోవిందా
న్యూఢిల్లీ : కన్జూమర్ గూడ్స్ దిగ్గజం నెస్లే ఇండియాకు వందకోట్లు గుల్లయ్యాయి. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మార్కెట్లో సేల్స్ రెవెన్యూలు భారీగా పడిపోయాయి. మ్యాగీ ఎఫెక్ట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లో మళ్లీ పునరుద్ధరించుకుంటున్న క్రమంలో నెస్లేకు నోట్ల బందీ భారీగా దెబ్బకొట్టింది. నవంబర్ నెలలో కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, గత క్వార్టర్లో కంపెనీ విక్రయాలపై రూ.100 కోట్లు నష్టపోయినట్టు నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారయణ్ చెప్పారు. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి సెక్టార్ కోలుకోవాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తున్న నెస్లే, తమ నాలుగో త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభాలు 8.66 క్షీణించి, రూ.167.31 కోట్ల నమోదు అయ్యాయని ప్రకటించింది. అదేవిధంగా నికర విక్రయాలు 16.17 శాతం పెరిగి రూ.2,261.18 కోట్లగా నమోదయ్యాయని నెస్లే తెలిపింది. ప్రీమియం కాఫీ బిజినెస్, పెట్ కేర్, స్కిన్ హెల్త్, సిరీల్స్(తృణధాన్యాలు) లాంటి కొత్త సెగ్మెంట్లపై కంపెనీ తమ ప్రొడక్ట్ లను విస్తరించాలని యోచిస్తోంది. -
నెస్లే ఇండియా చీఫ్‌గా 16 ఏళ్ల తర్వాత భారతీయుడు
న్యూఢిల్లీ : మ్యాగీ ఉదంతంతో స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే కంపెనీ తన ఇండియా విభాగపు అధిపతిని తొలగించింది. ప్రస్తుతం నెస్లే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఇటిన్నె బెనెట్‌ను తొలగించి సురేశ్ నారాయణన్ నియమించింది. ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడిని ఈ ఉన్నత పదవిలో నెస్లే నియమించింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం కారణంగా మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే కంపెనీ స్టోర్స్ నుంచి ఉపసంహరించింది. 1999లో నెస్లేలో చేరిన నారాయణన్ ప్రస్తుతం నెస్లే ఫిలిప్పైన్స్ చైర్మన్, సీఈఓగా పనిచేస్తున్నారు.