నెస్లేకు వందకోట్లు గోవిందా
నెస్లేకు వందకోట్లు గోవిందా
Published Tue, Feb 21 2017 12:23 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
న్యూఢిల్లీ : కన్జూమర్ గూడ్స్ దిగ్గజం నెస్లే ఇండియాకు వందకోట్లు గుల్లయ్యాయి. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్తో మార్కెట్లో సేల్స్ రెవెన్యూలు భారీగా పడిపోయాయి. మ్యాగీ ఎఫెక్ట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లో మళ్లీ పునరుద్ధరించుకుంటున్న క్రమంలో నెస్లేకు నోట్ల బందీ భారీగా దెబ్బకొట్టింది. నవంబర్ నెలలో కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, గత క్వార్టర్లో కంపెనీ విక్రయాలపై రూ.100 కోట్లు నష్టపోయినట్టు నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారయణ్ చెప్పారు.
ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి సెక్టార్ కోలుకోవాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తున్న నెస్లే, తమ నాలుగో త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభాలు 8.66 క్షీణించి, రూ.167.31 కోట్ల నమోదు అయ్యాయని ప్రకటించింది. అదేవిధంగా నికర విక్రయాలు 16.17 శాతం పెరిగి రూ.2,261.18 కోట్లగా నమోదయ్యాయని నెస్లే తెలిపింది. ప్రీమియం కాఫీ బిజినెస్, పెట్ కేర్, స్కిన్ హెల్త్, సిరీల్స్(తృణధాన్యాలు) లాంటి కొత్త సెగ్మెంట్లపై కంపెనీ తమ ప్రొడక్ట్ లను విస్తరించాలని యోచిస్తోంది.
Advertisement
Advertisement