Nestle
-
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
భారత్‌లో నెస్లే ఇండియా వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా 2025 నాటికి భారత్‌లో రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించింది. ఇందులో భా గంగా ఒడిశా రాష్ట్రంలో దేశంలోనే 10వ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ తెలిపారు. రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. 2023 మొదటి ఆరు నెలల్లో తాము రూ. 2,100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ మొత్తంలో ఒకటో వంతు ఆహారోత్పత్తుల కోసమే వెచ్చించినట్టు పేర్కొన్నారు. చాక్లెట్లు, కన్ఫెక్షనరీ తయారీ కోసం ఒక వంతు, మిగిలిన మొత్తాన్ని న్యూట్రిషన్, ఇతర ఉత్పత్తుల తయారీపై ఖర్చు చేసినట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్, కిట్‌క్యాట్ చాక్లెట్లు, నెస్‌కేఫే తదితర పాపులర్ ఉత్పత్తులను ఈ సంస్థ విక్రయిస్తుండడం తెలిసిందే. 2023 నుంచి 2025 మధ్య మరో రూ.4,200 కోట్లు ఖర్చు చేస్తామని చెబుతూ, ఇందులో రూ.900 కోట్లతో ఒడిశాలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్టు సురేష్ నారాయణన్ తెలిపారు. అలాగే, కాఫీ, బెవరేజెస్ కోసం నిధులు వెచి్చంచనున్నట్టు చెప్పారు. నెస్లే ఇండియా ఏర్పాటైన నాటి నుంచి గత 60 ఏళ్లలో భారత్‌లో రూ.7,000 కోట్లను ఖర్చు చేసినట్టు ప్రకటించారు. మహిళలకు మరింత ప్రాతినిధ్యం గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో నూడుల్స్‌తోపాటు కన్ఫెక్షనరీ తయారీ సామర్థ్యాలను నెస్లే విస్తరిస్తోంది. అలాగే పంజాబ్‌లోని మోగాలో, గోవాలోని పాండాలో ప్లాంట్లను విస్తరిస్తున్నట్టు నారాయణన్ తెలిపారు. మరింత మంది మహిళా ఉద్యోగులను చేర్చుకోనున్నట్టు చెప్పారు. కంపెనీ బోర్డులో మహిళలకు 50 శాతం ప్రాతినిధ్యం ఉండగా, క్షేత్ర స్థాయి ఉద్యోగుల్లో 20 శాతం మంది మహిళలు పనిచేస్తున్నట్టు వెల్లడించారు. తమ కార్మిక శక్తిలో 25 శాతం మహిళల లక్ష్యానికి చేరువ అవుతున్నట్టు తెలిపారు. తమ సనంద్ ప్లాంట్‌లో అయితే సగం మంది కార్మికులు మహిళలే ఉన్నట్టు చెప్పారు. నెస్లే ఇండియాలో సుమారు 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
గ్రామీణ ప్రాంతాలపై పడిన నెస్లే దృష్టి.. అమ్మకాల వృద్ధికి కొత్త వ్యూహాలు!
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లే ఈ ఏడాది రెండంకెల విక్రయాలపై దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం తగ్గుతుండడంతో ధరలపరమైన ఒత్తిళ్లు నిదానిస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో తమ నెట్వర్క్ విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కంపెనీకి 20 శాతం అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. వచ్చే 12 - 18 నెలల్లో 2,000కు పైగా జనాభా ఉన్న 1.2 లక్షల గ్రామాలను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం 90వేల గ్రామాల్లో విక్రయాల నెట్వర్క్ ఉంది. నెస్లే హెల్త్‌సైన్స్ కింద ఫార్మసీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.. ‘‘ఎల్‌నినో కారణంగా వర్షాలపై మరీ ప్రతికూల ప్రభావం లేకపోతే తప్ప డిమాండ్ పరిస్థితి స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నాం. రెండంకెల వృద్ధి దిశగా అడుగులు వేస్తాం. అమ్మకాల్లో తిరిగి వృద్ధిని చూస్తున్నాం. మొదటి త్రైమాసికంలో వృద్ధి 5 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగొస్తే అప్పుడు అమ్మకాల పరిమాణం, విలువ పరంగా మరింత సమతుల్యమైన వృద్ధిని నమోదు చేస్తాం’’అని నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. గడిచిన ఆరేడేళ్లుగా కంపెనీ కాంపౌండెడ్‌గా ఏటా 10 - 11 శాతం మేర వృద్ధిని చూస్తున్నట్టు చెప్పారు. ధరలు తగ్గిస్తారా..? ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దిగొస్తే ఉత్పత్తుల ధరలను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు.. సరైన చర్యలపై దృష్టి పెడతామని నారాయణన్ బదులిచ్చారు. ఇప్పటికైతే ధరలు తగ్గించేటంత సానుకూల స్థితికి చేరుకోలేదన్నారు. రానున్న రోజుల్లో తాము కొనుగోలు చేసే ముడి పదార్థాల ధరలు చెప్పుకోతగ్గంత తగ్గుముఖం పడితే అప్పుడు ఉత్పత్తుల ధరలు, బరువు పరంగా సర్దుబాటు చేస్తామని చెప్పారు. పాల ధరలు భగ్గుమంటున్నాయని చెబుతూ.. ఇదే పరిస్థితి కొనసాగితే పాల ఆధారిత ఉత్పత్తుల ధరల ను సవరించాల్సి రావచ్చన్నారు. గ్రామీణ ప్రాంతాల అమ్మకాలు 25 శాతానికి చేరుకుంటాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న ప్యాకెట్లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ కామర్స్ నుంచి 7 శాతం అమ్మకాలు వస్తున్నాయంటూ, ఇవి ఇంకా పెరగొచ్చన్నారు. -
నెస్లే ఇండియా భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే ఎస్ఏ దేశీయంగా భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. రానున్న మూడున్నరేళ్లలోగా అంటే 2025కల్లా రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో మార్క్ ష్నీడర్ వెల్లడించారు. తద్వారా దేశీ బిజినెస్‌కు జోష్‌నివ్వడంతోపాటు కొత్త వృద్ధి అవకాశాలను అందుకోనున్నట్లు తెలియజేశారు. నిధులను పెట్టుబడి వ్యయాలుగా వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త ప్లాంట్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, ప్రొడక్టు పోర్ట్‌ఫోలియో విస్తరణ తదితరాలను చేపట్టనున్నట్లు వివరించారు. కంపెనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9 ప్లాంట్లను నిర్వహిస్తోంది. కొత్తగా తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు తగిన ప్రాంతాలను అన్వేషిస్తున్నట్లు నెస్లే ఇండియా చైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ పేర్కొన్నారు. పెట్టుబడులకు అధికారిక సంస్థల నుంచి అనుమతులు లభించాల్సి ఉండగా.. మరింత మందికి ఉపాధి లభించే వీలుంది. ప్రస్తుతం 6,000 మంది సిబ్బంది ఉన్నారు. టాప్–10లో ఒకటి... నెస్లేకు ప్రాధాన్యతగల టాప్–10 మార్కెట్లలో ఒకటైన ఇండియాలో 2025కల్లా రూ. 5,000 కోట్లు వెచ్చించనున్నట్లు ష్నీడర్ తెలియజేశారు. కంపెనీ గత ఆరు దశాబ్దాలలో రూ. 8,000 కోట్లను వెచ్చించినట్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగా 110 ఏళ్ల క్రితమే కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ 1960 నుంచీ తయారీకి తెరతీసినట్లు వివరించారు. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
మంచి కాఫీలాంటి స్టోరీ.. కాఫీ తాగని దేశం..కాఫీ లవర్‌గా మారిందెలా?
ఉదయం నిద్ర లేవగానే మనలో చాలా మందికి టీ లేదా కాఫీ తాగడం అలవాటు. కొందరు టీ రుచిని ఆస్వాదిస్తే ఇంకొందరు కాఫీ ఘుమఘుమలను ఇష్టపడతారు. అయితే వేల సంవత్సరాలుగా టీని అభిమానించి.. దాన్నే తాగడానికి అలవాటుపడిన ఓ దేశాన్ని ఒక కంపెనీ కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే కాఫీ లవర్స్‌లా మార్చేసింది. అదెలా సాధ్యమైంది.. ఆ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందామా మరి. టీని ప్రేమించే దేశం... ప్రముఖ బహుళజాతి కంపెనీ నెస్లే గురించి తెలుసుగా... స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ సంస్థ ఆహార, పానియాల తయారీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. ప్రత్యేకించి ఇన్స్టంట్ కాఫీ ఉత్పత్తుల తయారీలో దిగ్గజం. కానీ ఈ సంస్థ 1970లలో జపాన్‌లో తమ ఇన్స్టంట్ కాఫీని విక్రయించేందుకు పడరాని పాట్లు పడింది. ఒక్క కప్పు కాఫీ కూడా అమ్మలేక చతికిలపడింది. ఇందుకు కారణం.. జపాన్ వేల సంవత్సరాలుగా టీని ఇష్టపడే దేశం కావడమే. ఇలాంటి మార్కెట్లో నెస్లే అడుగు ఎలా పెట్టింది? అక్కడి సంస్కృతిని అర్థం చేసుకొని.. ఇందుకోసం నెస్లే గట్టి కసరత్తే చేసింది. సంస్కృతిలో భాగంగా కొన్ని వస్తువులతో ప్రజలు ఏర్పరుచుకొనే ప్రత్యేక అనుబంధంపై పరిశోధనలు చేయడంలో పేరుగాంచిన సైకోఅనలిస్ట్, ఫ్రాన్స్ జాతీయుడైన క్లోయ్‌టెర్ రాపిల్లేను తన మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. జపాన్‌పై అధ్యయనం చేపట్టిన క్లోయ్‌టెర్... నెస్లే కాఫీ రుచులను ముందుగా జపాన్ పిల్లలకు అలవాటు చేయడానికి ఓ వ్యూహం సూచించాడు. క్లోయ్‌టెర్ చెప్పిందే తడవుగా మొదటి దశలో భాగంగా నెస్లే జపాన్ మార్కెట్‌ను కాఫీ రుచితో కూడిన స్వీట్లు, చాక్లెట్లతో ముంచెత్తింది. పిల్లలకు ఇవి తెగ నచ్చాయి. నెమ్మదిగా జపాన్‌కు కాఫీ రుచి తెలిసొచ్చింది. చదవండి👉అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ మాట కలిపిన ఇంజనీరింగ్ యువతి నేటి పిల్లలే రేపటి వినియోగదారులు కాఫీ రుచి కలిగిన క్యాండీలు ప్రవేశపెట్టిన పదేళ్ల తర్వాత నెస్లే కొత్త రకం కాఫీ ఉత్పత్తులతో తిరిగి ఆ దేశంలో అడుగుపెట్టింది. అప్పటికి నెస్లే ‘క్యాండీ వినియోగదారుల్లో’ చాలా మంది పెద్దవాళ్లయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు.. దీంతో వారంతా ఈ కాఫీ ఉత్పత్తులను తాగడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నెస్లే తెచ్చిన ఇన్స్టంట్ కాఫీ అనతికాలంలోనే మార్కెట్‌ను హస్తగతం చేసుకుంది. తర్వాత 2012లో నెస్లే సంస్థ వివిధ ఆఫీసులకు నెస్కెఫే తయారీ మెషీన్లను సరఫరా చేయడంతోపాటు తమ సహచరులకు కాఫీ తయారు చేసి ఇవ్వగల ‘నెస్కెఫే అంబాసిడర్’లను నియమించింది. పని ప్రదేశాల్లో రుచికరమైన కాఫీ లభించేందుకు ఈ ప్రచారం దోహదపడింది. అలాగే ప్రజలు సామాజికంగా దగ్గరై సరదాగా గడిపేలా చేసింది. కాఫీ మెషీన్లు విక్రయించేందుకు, కాఫీ కాచి వినియోగదారులకు అందించేందుకు నెస్లే 2014లో హ్యూమనాయిడ్ రోబో ‘పెప్పర్’ను రంగంలోకి దించింది. జపాన్ రాజధాని టోక్యోలో నెస్లే 2019లో ప్రత్యేకంగా ఒక స్లీప్ కేఫ్‌ను తెరిచింది. ఈ కేఫ్‌కు వచ్చే వారు మెత్తటి పరుపులపై చిన్నపాటి కునుకుతీసి కాఫీ తాగేలా ఏర్పాట్లు చేసింది. టీ టు కాఫీ ఫైనల్‌గా ఏం జరిగిందో తెలుసా? ఒకప్పుడు కనీసం కాఫీని తాగడానికి ఇష్టపడని జపాన్.. 2020 నాటికి ప్రపంచంలోకెల్లా 7వ అతిపెద్ద కాఫీ దిగుమతిదారుగా తయారైంది. ఈ దేశం ఏటా జపాన్ 43 లక్షల టన్నుల కాఫీని వినియోగిస్తోంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
సామాన్యులకు మరో షాక్..వీటి ధరలు భారీగా పెరిగాయ్!
పెట్రోలు, డీజిల్, గ్యాస్, వంట నూనెల ధరల పెంపుతో సతమతం అవుతున్న సామాన్యుడి నెత్తిన పడేందుకు మరో ధరల పిడుగు పడింది. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) రంగంలో దిగ్గజ కంపెనీలైన హిందుస్తాన్ యూనీలివర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్), నెస్లే ధరల పెంపును ప్రకటించాయి నేషనల్ మీడియా కథనం ప్రకారం..నెస్లే ఇండియా మ్యాగీ ధరల్ని 9 నుంచి 16 శాతం పెంచగా.. మిల్క్,కాఫీ ఫౌడర్ ధరలు పెరిగాయి. 70 గ్రాముల మ్యాగీ మసాలా నూడిల్స్ రూ.12 నుంచి రూ.14 పెరిగింది. ♦140 గ్రాముల మ్యాగీ మసాల నూడిల్స్ 12.5శాతంతో ధర రూ.3 పెరిగింది. ♦560 గ్రాముల ప్యాకెట్ ధర 9.4 శాతంతో రూ.96 నుంచి రూ.105కి పెరిగింది. ♦నెస్లే ఏప్లస్ ఒకలీటర్ కార్టన్ ధర 4శాతంతో రూ.75 నుంచి రూ.78కి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ కాఫీ ఫౌడర్ ధర 3 నుంచి 7శాతానికి పెరిగింది. ♦నెస్కెఫె క్లాసిక్ 25 గ్రాముల ప్యాకెట్ 2.5శాతంతో రూ.78 నుంచి రూ.80కి పెరిగింది. ♦నెస్ కెఫె క్లాసిక్ 50 గ్రాముల ప్యాకెట్ 3.4శాతంతో రూ.145 నుంచి రూ.150కి పెరిగింది. ♦హెచ్‌యూఎల్ సైతం టీ, కాఫీ ఫౌడర్ ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో బ్రూ కాఫీ ధర 3 నుంచి 7శాతం, తాజ్ మహల్ టీ 3.7 శాతం నుంచి 5.8శాతం పెరిగాయి. ♦ బ్రూక్ బ్రాండ్ 3 రోజెస్ వేరియంట్ ధర 1.5 నుంచి 14శాతానికి పెరిగింది. ఇక ఈ పెరిగిన ధర ఫ్రిబవరి నుంచి తయారువుతున్న ఉత్పత్తులపై పడనున్నాయి. చదవండి: వాహన వినియోగదారులకు కేంద్రం భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్! -
వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!
కరోనా వల్ల మొదలైన వర్క్‌ఫ్రమ్ కల్చర్‌కు ఎండ్‌కార్డ్ వేసేందుకు మెజార్టీ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ.. ఆలోపే ఆఫీసులను తెరిచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. బలవంతంగా అయినా సరే ఎంప్లాయిస్ను రప్పించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం రోస్టర్ విధానాన్ని పాటించాలని నిర్ణయించాయి. ఈ తరుణంలో కొన్ని స్వదేశీ కంపెనీలు ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యం నడుమే కంపెనీలు తెరిచేందుకు కంపెనీలు సిద్ధపడ్డాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాలా? లేదంటే వర్క్ఫ్రమ్లో కొనసాగాలా? అనే ఛాయిస్‌ను ఉద్యోగులకే వదిలేస్తున్నాయి. నెస్లే, కోకా-కోలా, గోద్రేజ్ కన్జూమర్, డాబర్, ఆమ్వే, టాటా కన్జూమర్.. మరికొన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో మూడు వంతుల ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. అయినా కూడా ఎంప్లాయిస్‌కే ‘వర్క్‌ఫ్రమ్’ ఆఫ్షన్‌ను వదిలేయడం. వర్క్ వాట్ వర్క్స్ పాలసీ కరోనా వల్ల కమర్షియల్‌గా జరిగిన నష్టానికి పూడ్చడం కోసం, అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం యాభై శాతం ఉద్యోగులతోనైనా ఆఫీసులను నడిపించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేయడం(ఆఫీసులకు రావాల్సిన అవసరంలేదని) తప్పనిసరేం కాదని ఉద్యోగులకు చెప్పేశాయి. ఈ క్రమంలోనే ‘వర్క్ వాట్ వర్క్స్’ పాలసీని అమలు చేయబోతున్నాయి. అంటే.. ఉద్యోగులకు ఎలా వీలుంటే అలా పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ‘ఎమర్జెన్సీ, తప్పనిసరి విభాగాల’ ఉద్యోగులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. కారణాలివే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎత్తేయడానికి ఈ కంపెనీలు తటపటాయించడానికి ప్రధాన కారణం.. మూడో వేవ్ హెచ్చరికలు, పైగా పండుగ సీజన్లు ముందు ఉండడం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోవట్లేదని ఈ స్వదేశీ కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం ఒక డోసు తీసుకుని ఉన్నారని, సగం శాతం ఉద్యోగులు రెండు డోసులు పూర్తి చేసుకున్నారని జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్ సర్వే చెబుతోంది. అయినప్పటికీ ఆఫీసులకు రావాలా? వద్దా? అనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాయి ఈ స్వదేశీ కంపెనీలు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! ఆఫీసులు 24 గంటలు తెరిచే ఉంటాయని, రావడం రాకపోవడం ఉద్యోగుల ఇష్టమని తేల్చేశాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందు ముందు పరిస్థితి ఏంటన్నది తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని చెప్తున్నారు నెస్లే చైర్మన్ సురేష్ నారాయణన్. ఇక టాటా స్టీల్, జీఈ ఇండియా, పెప్సికో కంపెనీలు చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగుతున్నారు. మారూతీ సుజుకీ, మెర్కెడెస్ బెంజ్ ఇండియా, ఐటీసీ లాంటి కంపెనీలు మాత్రం రోస్టర్ సిస్టమ్‌ను ఫాలో అవుతున్నాయి. టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్లతో పాటు టీసీఎస్, విప్రో లాంటి స్వదేశీ ఎమ్ఎన్సీలు జనవరి నుంచి ఆఫీసులను పూర్తిస్థాయిలో తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్!! -
ప్లాస్టిక్ వేస్ట్‌లో నంబర్‌వన్ ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ : ‘కోకాకోలా’ కూల్ డ్రింక్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణకు అత్యంత ప్రమాదకారిగా మారింది కూడా ఈ బ్రాండ్ ప్లాస్టిక్ సీసాలే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్లాస్టిక్ వేస్టేజ్‌ని సృష్టిస్తున్నది జార్జియా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కోకాకోలా కూల్ డ్రింక్స్ కంపెనీ అని ఓ అధ్యయనంలో తేలింది. ఆ తర్వాత స్థానాల్లో నెస్లే, పెప్సికో, మాండెలెజ్ ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు సృష్టిస్తున్న ప్లాస్టిక్ వేస్టేజ్‌కి సమానంగా ఒక్క కోకాకోలా కంపెనీయే సృష్టిస్తున్నట్లు ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్స్’ అంతర్జాతీయ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ ఇటీవల తన 72 వేల మంది కార్యకర్తలతో ప్రపంచవ్యాప్తంగా బీచ్‌ల వద్ద, కాల్వలు, చెరువుల వెంట, రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పులు, ర్యాపర్లు, బ్యాగ్స్, ఇతర ప్లాస్టిక్‌ను ఏరించింది. దొరికిన ఇతర ప్లాస్టిక్కులతో దొరికిన కోకాకోలా, ఇతర కూల్ డ్రింక్‌ల ప్లాస్టిక్ బాటిళ్లను లెక్కపెట్టిచ్చింది. సరాసరిన 4,75,000 ప్లాస్టిక్‌లను సేకరించగా, వాటిలో 11,732 కోకాకోలా ప్లాస్టిక్ బాటిల్లే ఉన్నాయి. వీటిలో ఎనిమిది వేల బ్రాండ్లకు చెందిన 50 రకాల ప్లాస్టిక్‌లను బయట పడ్డాయి. నెస్లే, పెప్సికో, మాండెలెజ్ల తర్వాత యూనిలివర్, మార్స్, పీఅండ్‌జీ, కాల్గేట్–పామోలివ్, ఫిలిప్ మోరీస్ బ్రాండ్లు ఉన్నాయి. ఆఫ్రికా, యూరప్‌లలో అత్యధిక వేస్టేజ్‌లో కోకాకోలా నెంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల్లో రెండో స్థానంలో ఉంది. నెస్టిల్ బ్రాండ్ ఉత్తర అమెరికాలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎరుపు రంగు కప్పులను తయారు చేసే సోలో కంపెనీ రెండో స్థానంలో ఉండగా, స్టార్ బక్స్ మూడో స్థానంలో ఉంది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌కు బదులు రీసైక్లింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్‌ను వాడడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, మొత్తంగానే ప్లాస్టిక్‌ను వదిలేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాలని ప్రపంచ కార్పొరేట్ సంస్థలకు ఈ సందర్భంగా ‘బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్’ సంస్థ పిలుపునిచ్చింది. (చదవండి: రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ) -
కోల్గేట్, ప్యాంటీన్, నెస్లేలకు బ్యాడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురు, ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి సహ-వ్యవస్థాపకుడు రాందేవ్ విదేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీలపై మరోసారి ధ్వజమెత్తారు. విదేశీ ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) దిగ్గజ కంపెనీల కథ త్వరలోనే ముగియనుందంటూ జోస్యం చెప్పారు. యునీలీవర్, కోల్గేట్, పాంటీన్, నెస్లే వంటి అగ్రగామి సంస్థలపై బహిరంగంగానే టార్గెట్ చేసిన రాందేవ్ భారతదేశంలో పోటీ తీవ్రంగా సాగుతోంది. ఇక కంపెనీల ఆట కట్టేనని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కంపెనీలు స్వర్గానికి పోవడం ఖాయమని పేర్కొన్నారు. దీనికోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని కేవలం కొద్ది సమయం మాత్రమే మిగిలివుందన్నారు. మనిషి 100 సంవత్సరాల్లో స్వర్గానికి చేరతాడు. ఈ కంపెనీలు కేవలం మరో రెండు రోజుల్లో సమసిపోనున్నాయని తెలిపారు. ఇప్పటికే తమ రాకతో ఈ కంపెనీలు శీర్షాసనం (తల్లకిందులు) వేశాయని, మరో రెండు రోజుల్లో ఇక మోక్షమేనంటూ తనదైన యోగా భాషలో చెప్పుకొచ్చారు. ‘‘ప్యాంటీన్ ప్యాంట్ తడిచిపోనుంది.. కోల్గేట్ గేటు మూతపడుతుంది.. నెస్లేలో పక్షులు ఎగిరిపోతాయి’’ అన్న 2016 నాటి రాందేవ్ వ్యాఖ్యలు గురించి అడిగినప్పుడు ఆయన ఇలా స్పందించారు. కాగా ఆయుర్వేద ఉత్తత్పులతో మార్కెట్లోకి దూసుకొచ్చిన 'పతంజలి' 2018 సంవత్సరానికి 20వేలకోట్ల రూపాయలసంస్థగా అవతరించనున్నామని ఇటీవల ప్రకటించింది. అంతేకాదు ఇప్పటివరకూ ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఏలిన ఐటీసీ, డాబర్, హిందూస్థాన్ యూనిలీవర్, కోల్గేట్ పామోలివ్, ప్రోక్టర్ అండ్ గాంబిల్ తదితర సంస్థలకు గట్టి సవాల్ విసిరింది. అంతేకాదు రెండంకెల వృద్ధిని నమోదు చేయడం కష్టంగా మారిన తరుణంలో పతంజలి ఏకంగా మూడంకెల వృద్ధిని సాధించడం విశేషం. -
ఆ పాలు విషపూరితం
► రిలయన్స్, నెస్లే పాల ఉత్పత్తులపై మంత్రి సంచలన ఆరోపణలు చెన్నై: రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో రసాయనాలు ఉన్నాయని తమిళనాడు పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ ఆరోపించారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు ఉన్నట్లుగా ఇటీవల మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం చర్చకు దారి తీసిన నేపథ్యంలో బుధవారం చెన్నైలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ పరిశోధనలో రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో గ్యాస్ట్రిక్ , బ్లీచింగ్ పౌడర్లు ఉన్నట్టు నిర్ధారించినట్లు మంత్రి వెల్లడించారు. ఈ రెండు సంస్థలు చెడిపోయిన పాలను పౌడర్లుగా మార్చే క్రమంలో పౌడర్లను కలుపుతున్నట్లు నిర్ధారించామన్నారు. అలాగే ప్రైవేటు పాలల్లోని రసాయనాల నిర్ధారణకు పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు. మిగిలిన సంస్థల పాల ఉత్పత్తుల నమూనాలు పరిశోధనలో ఉన్నాయని, వాటి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. -
నెస్లేకు వందకోట్లు గోవిందా
న్యూఢిల్లీ : కన్జూమర్ గూడ్స్ దిగ్గజం నెస్లే ఇండియాకు వందకోట్లు గుల్లయ్యాయి. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో మార్కెట్లో సేల్స్ రెవెన్యూలు భారీగా పడిపోయాయి. మ్యాగీ ఎఫెక్ట్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే మార్కెట్లో మళ్లీ పునరుద్ధరించుకుంటున్న క్రమంలో నెస్లేకు నోట్ల బందీ భారీగా దెబ్బకొట్టింది. నవంబర్ నెలలో కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, గత క్వార్టర్లో కంపెనీ విక్రయాలపై రూ.100 కోట్లు నష్టపోయినట్టు నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారయణ్ చెప్పారు. ప్రభుత్వం హఠాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి సెక్టార్ కోలుకోవాలంటే మరో ఆరు నెలల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. జనవరి-డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగిస్తున్న నెస్లే, తమ నాలుగో త్రైమాసికంలో స్వతంత్ర నికర లాభాలు 8.66 క్షీణించి, రూ.167.31 కోట్ల నమోదు అయ్యాయని ప్రకటించింది. అదేవిధంగా నికర విక్రయాలు 16.17 శాతం పెరిగి రూ.2,261.18 కోట్లగా నమోదయ్యాయని నెస్లే తెలిపింది. ప్రీమియం కాఫీ బిజినెస్, పెట్ కేర్, స్కిన్ హెల్త్, సిరీల్స్(తృణధాన్యాలు) లాంటి కొత్త సెగ్మెంట్లపై కంపెనీ తమ ప్రొడక్ట్ లను విస్తరించాలని యోచిస్తోంది. -
ఆలస్యం.. అమృతం..!
‘‘ఎప్పటికీ జరగకపోవడం కంటే.. ఆలస్యంగానైనా జరగడమే మేలు..’’ అని ఓ ఇంగ్లిష్ సామెత. ఎవరు మననం చేసుకున్నా చేసుకోకపోయినా.. అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు రస్సెల్ క్రిస్టోఫ్ మాత్రం పదే పదే ఈ మాటను వల్లె వేస్తుంటాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.. అతడి కథేంటో తెలుసుకుంటే అతడి వేదాంతానికి అర్థమూ మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు కూడా అంటారు.. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అని! 1986లో సరదాగా ఓసారి ఫొటో స్టుడియోకు వెళ్లాడు క్రిస్టోఫ్. నార్తన్ కాలిఫోర్నియాలో చక్కగా ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫొటోలు పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నవ్వుతున్నట్టు, ఛాతీ విరుచుకుని, నిటారుగా నిల్చుని.. ఇలా రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగాడు. వాటన్నిటినీ చూసుకుని మురిసిపోయాడు. వాటిలో ఒక ఫొటో అతడికి బాగా నచ్చింది. కాఫీ కప్పును పెదాలపై ఉంచి, ఆ సువాసనను ఆస్వాదిస్తున్నట్టుగా ఉందా చిత్రం. రోజులు గడుస్తున్నాయి. నెలలు, ఏళ్లు.. ఇలా కాలం పరుగులెడుతూనే ఉంది. కానీ, క్రిస్టోఫ్కు ఆ చిత్రాలపై మమకారం మాత్రం తగ్గలేదు. అవి అతడికి మధుర జ్ఞాపకాలుగా మారిపోయాయి. అవే అతడికి లక్షలు.. కోట్లు! 2003లో ఓ రోజు షాపింగ్‌కు వెళ్లాడు క్రిస్టోఫ్. ఇంటికి కావాల్సినవి అన్నీ కొన్నాడు. అందులో నెస్లీ కంపెనీకి చెందిన ‘టేస్టర్స్ చాయిస్’ ఇన్ స్టంట్ కాఫీ కూడా ఉంది. ఆ కాఫీ కవర్‌పై ఓ యువకుడు కాఫీని ఆస్వాదిస్తున్న చిత్రం ఉంది. అది చూడగానే ఎంతో ఉద్వేగంగా ఫీలయ్యాడు క్రిస్టోఫ్. తాను అప్పుడెప్పుడో ముచ్చటపడి తీసుకున్న చిత్రంలానే అది ఉందనుకున్నాడు. మరింత గమనించి చూస్తే అది తన చిత్రమేనని అతనికి అర్థమైంది. వెంటనే ఆ కాఫీ కవర్‌పై పరిశోధనలు మొదలుపెట్టాడు. 1997 నుంచి 2003 వరకూ దాదాపు ఆరు దేశాల్లో అదే కవర్‌తో నెస్లీ సంస్థ కాఫీలను అమ్ముతోందని గుర్తించాడు. ఇక, ఆగలేదు. నెస్లీ తన చిత్రాన్ని ప్రచారానికి వాడుకున్నందుకుగానూ పరిహారాన్ని కోరాలనుకున్నాడు. కానీ, ఎందుకో ధైర్యం సరిపోలేదు. తాను ఓడిపోతానని భావించాడు. అయితే, స్నేహితులు ధైర్యం నూరిపోయడంతో నెస్లీపై దావా వేశాడు. కేసు విచారణ సాగిన తర్వాత న్యాయస్థానం క్రిస్టోఫ్ చెవిలో తేనె పోసింది. ఏళ్లపాటు ఎలాంటి పారితోషికమూ చెల్లించకుండా లాభాలు గడించినందుకు నెస్లే సంస్థకు గట్టిగానే షాకిచ్చింది. ఏకంగా 15.6 మిలియన్ డాలర్లను క్రిస్టోఫ్కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ మొత్తంలో ఒక్కసారిగా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు రస్సెల్ క్రిస్టోఫ్. ఈ మొత్తం మన కరెన్సీలో వంద కోట్ల రూపాయల పైమాటే! ఇప్పుడు చెప్పండి.. ఆయన ‘బెటర్ లేట్ దేన్..’ మాటను పదే పదే వల్లె వేయడం కరెక్టో కాదో..!! - (సాక్షి స్కూల్ ఎడిషన్) -
నూడుల్స్ ధ్వంసానికి సుప్రీంను ఆశ్రయించిన నెస్లే
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ తయారీ సంస్థ నెస్లే ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవలి నిషేధం నేపథ్యంలో భారీగా పేరుకుపోయిన మ్యాగీ నూడుల్స్ నిల్వలను ధ్వంసం చేసేందుకు సుప్రీం అనుమతి కోరింది. గడువు తీరిన 550 టన్నుల మ్యాగీ నూడుల్స్ ను ధ్వంసం చేయాల్సి అవసరం ఉందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అంగీకరించకపోడంతో సుప్రీంను ఆశ్రయించినట్టు పేర్కొంది. జస్టిస్ దీపక్ మిశ్రాలతో, జస్టిస్ సి నాగప్పన్ లతో కూడిన బెంచ్ ముందుకు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. ఇది గతంలో హైకోర్టులో నెస్లే లేవనెత్తిన సమస్యే అని ఎఫ్ఎస్ఎస్ఏఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో జస్టిస్ అటార్నీ జనరల్ ముకుల్ సూచనలను పాటించాల్సి ఉందని పునరుద్ఘాటించారు. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 30 కి వాయిదా వేశారు. -
అరకు కాఫీపై నెస్లే ఆసక్తి
♦ ప్రయత్నాలు చేశాం; కానీ ఫలించలేదు ♦ డిమాండ్ పెరిగితే మళ్లీ పరిశీలిస్తాం ♦ నెస్లే నంజన్‌గుడ్ ప్లాంటు ఇన్చార్జ్ వ్యాఖ్యలు ♦ 200 కోట్లతో కాఫీ ప్లాంటుకు మెరుగులు సాక్షి, బిజినెస్ బ్యూరో : డిమాండ్‌ను బట్టి ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి కూడా కాఫీ గింజలు సేకరించాలని ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే యోచిస్తోంది. అలాగే ఉత్పత్తిని మెరుగుపర్చుకునే దిశగా కర్ణాటకలోని నంజన్‌గుడ్ కాఫీ ప్లాంటును రూ.200 కోట్లతో ఆధునీకరిస్తోంది కూడా. కాఫీ, నూడుల్స్ ప్లాంట్ల సందర్శన సందర్భంగా కంపెనీ అధికారులు విలేకరులకు ఈ విషయాలు చెప్పారు. ‘‘అరకు కాఫీ గింజల కొనుగోలు కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేశాం. కాకపోతే మా ప్రమాణాల ప్రకారం నాణ్యత ఉండాలి. ఈ విషయంలో అప్పుడప్పుడూ తిరస్కరణలు కూడా ఉంటాయి. వాటిపై స్థానికులకు కొన్ని సందేహాలు, భయాలు ఉండటంతో మా ప్రయత్నాలు ఫలించలేదు’’ అని ప్లాంటు ఇన్చార్జ్ నిర్మల షాపూర్కర్ పేర్కొన్నారు. కాకపోతే పెరిగే డిమాండ్‌ను బట్టి వారు ముందుకొస్తే అరకు నుంచి సమీకరించే అవకాశాలు లేకపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. 2015-16లో దేశవ్యాప్తంగా సుమారు 3.48 లక్షల టన్నుల మేర, ఆంధ్రప్రదేశ్‌లో 9,200 టన్నుల మేర కాఫీ గింజల ఉత్పత్తి జరిగింది. నెస్లే ప్రస్తుతం దక్షిణాదిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాఫీ గింజలు సమకూర్చుకుంటోంది. ఈ ఏడాది ఉత్పత్తి కొంత త గ్గే అవకాశాలున్నా... ధర మాత్రం ప్రస్తుత స్థాయిలోనే కొనసాగవచ్చని నిర్మల చెప్పారు. ప్రస్తుతం తమ కాఫీ ప్లాంటు వార్షికంగా 15,000 టన్నుల కాఫీ గింజలు ప్రాసెసింగ్ చేస్తుండగా... నూడుల్స్ ప్లాంటులో 45,000 టన్నుల మేరకు ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. నంజన్‌గుడ్ ప్లాంటు సుమారు 70-80 శాతం సామర్ధ్యంతో పనిచేస్తోందని, దాదాపు 25 మంది తమకు కాఫీ గింజల సరఫరా చేస్తున్నారని చెప్పారామె. నూడుల్స్‌కు సంబంధించి ఇటీవలే ఆవిష్కరించిన నాలుగు కొత్త వేరియంట్లను త్వరలో తెలంగాణ, ఏపీల్లో నెస్లే పూర్తి స్థాయిలో విక్రయించనుంది. నూడుల్స్ తయారీలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 8,000 పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. నంజన్‌గుడ్ ఫ్యాక్టరీలో 500 మంది పైగా సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. రైతులకు తోడ్పాటు.. స్వల్ప వ్యయాలతో అధిక దిగుబడులు పొందేలా నెస్ కెఫే ప్లాన్ కార్యక్రమం కింద స్థానిక రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నట్లు నెస్లే వర్గాలు పేర్కొన్నాయి. నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తికి సంబంధించిన సుమారు 500 పైచిలుకు రైతులకు 4సీ సర్టిఫికేషన్ లభించేలా తోడ్పడినట్లు తెలిపాయి. త్వరలో ఈ సంఖ్యను వెయ్యి దాకా పెంచుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. మరోవైపు కార్పొరేట్ సామాజిక కార్యక లాపాల కింద వరి, చెరకు రైతులకు కూడా శ్రీవరి తదితర మెరుగైన సాగు పద్ధతుల్లో శిక్షణను కల్పిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన అగ్శ్రీ సంస్థ తోడ్పాటు అందిస్తోంది. -
పతంజలికి పోటీగా నెస్లే తిరిగి పుంజుకుంటుందా?
ముంబై: వేలకోట్ల టర్నోవర్ లక్ష్యంతో భారత మార్కెట్లోకి దూసుకు వస్తున్న పతంజలి పోటీని తట్టుకొనేందుకు నెస్లే ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో కొత్త ప్రధాన ప్రత్యర్థి పతంజలి ఆహార ఉత్పత్తులకు దీటుగా తన నూతన 25 కొత్త ప్రొడక్ట్స్ ను పరిచయం చేస్తోంది. తద్వారా మ్యాగీ వివాదంతో కుదేలైన తన వ్యాపారాన్ని తిరిగి కొల్లగొట్టాలని యత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ కేటగిరీల్లో 25 కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇన్ స్టెంట్ నూడుల్స్ మార్కెట్లో 55.5శాతం వాటాతో నెస్లే ఉత్పత్తులదే హవా. అయితే రాబోయే రోజుల్లో రూ.500కోట్ల టర్నోవర్ లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది. మార్కెట్లో మరింత ముందుకు వెళ్లడానికి ఇదే మాకు సరైన సమయమని నెస్లే ఇండియా సీఎండీ సురేష్ నారాయణన్ పిటిఐకి చెప్పారు.గతేడాది మేము తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నానీ, ఇంకా రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మ్యాగీ నూడుల్స్ లో అనేక రకాల ప్లావర్స్ ను కంపెనీ కొత్త ఉత్పత్తులను కొన్నింటిని విడుదల చేసిన నారాయణ్ ఇప్పటికే ఉన్న ఉత్పత్తులను నాణ్యంగా వినియోగదారులకు అందించటంతో పాటు ముఖ్యగా పసిపిల్లలు, మహిళలు, పెద్దలు, అర్బన్ మార్కెట్ లోని వినియోగదారులను ఆకట్టుకునేలా తన ఉత్పత్తులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఇందులో 20-25 వరకు ఉత్పత్తులు ఉంటాయన్నారు. వీటిలో మరికొన్నింటిని రాబోయే నాలుగు ఆరువారాల్లో రిలీజ్ చేస్తామన్నారు. దీంతో సింగిల్ లార్జెస్ట్ విండో గా అవతరించనున్నామని ప్రకటించారు. ఇకముందు ఈ కామర్స్ లోకి, అలాగే పానీయాల రంగంలోకి అడుగిడుతున్నట్టు తెలిపారు. కాగా మోతాదుకు మించి లెడ్ ఉన్న కారణం ఫుడ్ స్టాండర్డ్స్ అసోసియషన్ ఆఫ్ ఇండియా గత ఏడావి మ్యాగీ నూడల్సు ను నిషేధించిన సంగతి తెలిసిందే. మరి కొత్త ఉత్పత్తులతో వస్తున్న నెస్లే కు వినియోగదారులనుంచి పూర్వ ఆదరణ లభిస్తుందా.. అనుకున్నమార్కెట్ షేర్ ను కొల్లగొడుతుందా... వేచి చూడాల్సిందే.. -
అలీబాబా దోస్తీతో నెస్లే పరుగులు
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో భాగస్వామ్యంలో ప్రపంచ అతిపెద్ద ఫుడ్ రిటైలర్ నెస్లే పరుగులు పెడుతోంది. ఆన్ లైన్ అమ్మకాలను పెంచుకోడానికి అలీబాబాతో భాగస్వామ్యాన్ని మొదలుపెట్టింది. కొత్త డిజిటల్ మార్కెటింగ్ విధానాలతో నెస్లే విభిన్న ఉత్పత్తులను అలీబాబాలో ఆవిష్కరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. కాఫీ నుంచి బేబీ ఫార్ములా వరకు 30 బ్రాండ్లను అలీబాబా ఫ్లాట్ ఫామ్ లో అమ్మకాలకు పెట్టనున్నట్లు తెలిపింది. వినియోగదారులను పెంచుకోడానికి అలీబాబాతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని ఆసియన్, ఓషియేసియన్, ఆఫ్రికన్ మార్కెట్లను పర్యవేక్షించే నెస్లే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెండ్ వాన్ లింగ్ మార్టె తెలిపారు. అంతర్జాతీయంగా అన్ని దేశాల కంటే చైనా మార్కెట్ ఆన్ లైన్ అమ్మకాల్లో ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 150 ఏళ్ల మార్కెట్ వృద్ధికి చైనా మార్కెట్టే తగినదని.. సరి కొత్త మార్కెటింగ్ విధానాలను త్వరగా అర్థం చేసుకోవడంలో చైనా కస్టమర్లే ముందంజలో ఉన్నారని చెప్పారు. మ్యాగీ అమ్మకాలు మళ్లీ మార్కెట్లలోకి వచ్చాక, నెస్లే సంస్థ స్నాప్ డీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది చివర్లో అలీబాబాతోనూ భాగస్వామ్యం కుదుర్చుకుంది. చైనాలో సగం నెస్లే అమ్మకాలు ఆన్ లైన్ లోనే జరిగాయని కంపెనీ పేర్కొంది. చైనాలో ఆన్ లైన్ కొనుగోలు 2011 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 12 రెట్లు పెరిగాయని, తలసరి వినియోగం కూడా 27శాతం పెరిగిందని అలీబాబా ఫైనాన్షియల్ సర్వీసు ప్లాట్ ఫామ్ యాంట్ ఫైనాన్షియల్, ప్రైవేట్ ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. చాలా మంది యువత షాపింగ్ కు ఆన్ లైన్ నే ఆశ్రయిస్తున్నారని అలీబాబా సీఈవో ఝాంగ్ తెలిపారు. -
నెస్లేను తరిమేస్తా, కోల్గేట్కు గేట్ పెడతా
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా ఇప్పుడు ఆహార పదార్థాల వ్యాపార రంగంలోనూ తిరుగులేని బిజినెస్ మ్యాన్‌గా దూసుకుపోతున్నారు. పతంజలి గ్రూప్ ప్రొడక్ట్స్‌తో ఇప్పటికే కోల్గేట్, నెస్లే వంటి బహుళ జాతి సంస్థలకు ఎసరు పెట్టిన ఆయన తాజాగా మరో శపథం చేశారు. దేశం నుంచి 'నెస్లే' పక్షిని తరిమేస్తానని, 'కోల్గేట్'కు దేశంలోకి రాకుండా గేటు పెట్టేస్తానని, వాటిని భారత్‌లో లేకుండా చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10వేల కోట్ల టర్నవర్ సాధించడమే పతంజలి కంపెనీ లక్ష్యమని ఆయన మంగళవారం ప్రకటించారు. పతంజలి సంస్థ ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్ గా మారిందని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. రాందేవ్ 2012 మార్చి నుంచి పతంజలి కంపెనీ ద్వారా పలు ఫాస్ట్ మూవింగ్ కన్సుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) ప్రొడక్ట్స్‌ను దేశంలో మార్కెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. టూత్ పేస్ట్, న్యూడిల్స్, నెయ్యి వంటి పలు రకాల ఉత్పత్తులతో పతంజలి కంపెనీ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఈ కంపెనీ 2011-12లో రూ. 446 కోట్లు, 2012-13లో రూ. 850 కోట్లు, 2013-14లో రూ. 1200 కోట్లు, 2014-15లో రూ. 2006 కోట్ల టర్నోవర్ సాధించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 150 శాతం వృద్ధితో రూ. ఐదువేల కోట్ల టర్నోవర్‌ను పతంజలి గ్రూప్ సాధించనుంది. -
నెస్లేకు 'కిట్ క్యాట్' బాధిత యువతి అల్టిమేటం
ఎంతో ఇష్టంగా కొనుక్కున్న కిట్ క్యాట్ చాక్లెట్ లో ఒట్టి చాక్లెట్ తప్ప వేఫర్ లేకపోవడంతో కంగుతిన్న అమ్మాయి.. ఏకంగా తయారీదారులైన నెస్లే కంపెనీకి హెచ్చరికలు పంపింది. నష్టపరిహారంగా తనకు జీవితకాలం ఉచితంగా చాక్లెట్లు పంపాలని డిమాండ్ చేసింది. లండన్ కు చెందిన న్యాయవిద్యార్థిని సైమా అహ్మద్(20) గత వారం ఓ షాపులో కిట్ క్యాట్ చాక్లెట్లు కనుక్కుంది. ఇంటికెళ్లి చూస్తే.. వేఫర్ లేకుండా కిట్ క్యాట్ మొత్తానికిమొత్తం చాక్లెట్ మాదిరే కనిపించడంతో అవాక్కయింది. ఆ వెంటనే వినియోగదారుల పట్ల కంపెనీ తీరును నిరసిస్తూ నెస్లేకు లేఖ రాసింది. తాను కొన్న చాక్లెట్ శాంపిళ్లను కంపెనీకి పంపుతూ పరిహారంగా జీవితకాలం తనకు ఉచితంగా చాక్లెట్లు సరఫరా చేయాలని సైమా అహ్మద్ డిమాండ్ చేసింది. అలా కాని పక్షంలో విషయం కోర్టులో తేల్చుకుంటానని హెచ్చరించింది. ఇప్పటివరకైతే నెస్లే ఆమె డిమాండ్ కు స్పందించలేదు. మ్యాగీ నూడుల్స్ లో విషపదార్థాలు కలుస్తున్నాయనే ఆరోపణలతో ఇండియాలో పరువుపోగొట్టుకున్న నెస్లే.. కిట్ క్యాట్ రచ్చ ద్వారా ఇప్పుడు ఇంగ్లాండ్ లోనూ అదేపరిస్థితికి దిగజరినట్లయింది. -
'మ్యాగీ నూడిల్స్ సురక్షితం'
ముంబై: మ్యాగీ నూడిల్స్ సురక్షితమని పరీక్షల్లో తేలినట్టు నెస్లె ఇండియా సంస్థ ప్రకటించింది. 100 మ్యాగీ శాంపిల్స్‌ను మూడు ల్యాబరేటరీలలో పరీక్షించగా, ఫలితాల్లో సురక్షితమని తేలినట్టు వెల్లడించింది. మ్యాగీలో హానికర రసాయనాలున్నాయంటూ భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ వెల్లడించడంతో నిషేధించిన సంగతి తెలిసిందే. కాగా నిషేధాన్ని ఇటీవల బాంబే హైకోర్టు ఎత్తేసింది. మ్యాగీ తాజా నమూనాలను హైదరాబాద్, జైపూర్, పంజాబ్‌లోని ఆహార పరీక్ష కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. మ్యాగీలో రసాయనాలు అనుమతించిన మోతాదు కన్నా తక్కువ ఉన్నట్లు ఈ పరీక్షల్లో తేలితే ఉత్పత్తులు అమ్ముకోవచ్చని తెలిపింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ల్యాబరేటరీల్లో శాంపిల్స్‌ను పరీక్షించారని, ఈ నివేదికలు తమకు అందాయని నెస్లె సంస్థ ప్రతినిధులు చెప్పారు. మ్యాగీలో రసాయనాలను మోతాదుకు లోపే వాడినట్టు పరీక్షల్లో తేలిందని తెలిపారు. భారత ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల సంస్థ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, మూడు ల్యాబరేటరీల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొత్త మ్యాగీ న్యూడిల్స్ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు. -
మాకు మ్యాగీ నూడుల్స్ తో ఇబ్బందేమీ లేదు!
న్యూఢిల్లీ: భారత్ లో నెస్లీ ఇండియాకి చెందిన మ్యాగీ న్యూడుల్స్ పై నిషేధం కొనసాగుతుండగా, అమెరికా మాత్రం మ్యాగీ వాడకంపై సానుకూలంగా స్పందిస్తోంది. తాము తాజాగా చేసిన పరీక్షల్లో మ్యాగీలో ఎటువంటి హానికర రసాయనాలు లేనట్లు అమెరికా పేర్కొంది. మ్యాగీ న్యూడుల్స్ లో సీసం శాతం తగినంతగానే ఉన్నట్లు పేర్కొంది. మ్యాగీకి చెందిన అనేక రకాలైన శాంపిల్స్ ను తీసుకుని చేసిన పరీక్షల్లో ఈ విషయం స్పష్టమైందని యూఎస్ ఎఫ్ డీఏ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అమెరికాలో మ్యాగీ అమ్మకాలు యథావిధిగానే కొనసాగుతున్నట్లు ఓ ఈమెయిట్ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. మ్యాగీ వాడకం వల్ల తమ ప్రజలు హానికర రసాయనాల బారిన పడుతున్నట్లు తమ ఎఫ్ డీఏ పరీక్షల్లో నిర్ధారణ కాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా నెస్లీ ఇండియా అనుచిత వ్యాపారాలకు పాల్పడినట్లు భారత్ లో కేసు నమోదైంది. లేబుళ్ల మీద తప్పుడు వివరాలు ఇవ్వడమే కాకుండా తప్పుదోవ ప్రకటించే ప్రకటనలు చేశారని.. వీటన్నింటి దృష్ట్యా దేశానికి జరిగిన నష్టానికి గాను రూ. 640 కోట్లు కట్టాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆశ్రయించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం వచ్చిన దాదాపు మూడు దశాబ్దాల్లో ఓ కంపెనీపై ప్రభుత్వ శాఖ ఇలా కేసు పెట్టడం ఇదే తొలిసారి. మ్యాగీ నూడుల్స్‌లో సీసంతో పాటు ఎంఎస్‌జీ (మోనోసోడియం గ్లూటామేట్) ఎక్కువ స్థాయిలో ఉన్నాయంటూ ఆరోపణలు రావడంతో చాలా రాష్ట్రాలు దాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. -
మ్యాగీ నూడుల్స్ పాతిపెట్టేందుకు 20 కోట్ల ఒప్పందం
న్యూఢిల్లీ: తమకు చిక్కులు తెచ్చిపెట్టిన మ్యాగీ నూడుల్స్‌ను ధ్వంసం చేసి భూమిలో పాతిపెట్టేందుకు నెస్ట్లీ సంస్థ అంబుజా సిమెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం, రూ.20 కోట్లు ఇప్పటికే చెల్లించింది. ఆహార భద్రతా నియమాలకు విరుద్ధంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు మ్యాగీ నూడుల్స్‌లో ఉన్నట్లు గుర్తించి వాటిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో తమ వద్ద స్టాక్ ఉన్న నూడుల్స్ మొత్తాన్ని భూస్థాపితం చేయడం నెస్ట్లీకి తలనొప్పిగా మారడంతో గుజరాత్‌కు చెందిన అంబుజా సిమెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే విషయాన్ని నెస్ట్లీ సంస్థ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. తాము అంబుజా సిమెంట్స్ సహాయం తీసుకుంటున్నామని, అన్ని మార్కెట్లలో స్టాక్ ఉన్న మ్యాగీని వెనక్కి తెప్పిస్తున్నామని తెలిపారు. అయితే, ఒప్పందం ఎన్నికోట్లనే విషయంలో మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదు. -
మ్యాగీ నూడుల్స్ ఎగుమతులకు కోర్టు అంగీకారం
ముంబై: సంచలనం రేపిన మ్యాగీ ఉత్పత్తుల నిషేధం కేసులో నెస్లే సంస్థకు కాస్తలో కాస్త ఊరట లభించింది. ఇప్పటికే భారత్‌లో నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలన్న నెస్లే అభ్యర్థనకు బాంబే హైకోర్టు అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తీర్పును వెలువరించింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం(లెడ్), మోనో సోడియం గ్లూటామేట్(ఎంఎస్‌జీ) అనే హానికర రసాయనాలు పరిమితికి మించి ఉన్నాయనిని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) తనిఖీల్లో రుజువుకావడంతో ఆ ఉత్పత్తులపై జూన్ 5న కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో మ్యాగీ ఉత్పత్తులన్నింటినీ ధ్వసం చేయాలనే డిమాండ్ వెల్లువెత్తడంతో అలా చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని, విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అనుమతించాలని నెస్లే సంస్థ కోర్టును ఆశ్రయించింది. -
మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్య
నైనితాల్: ఉత్తరాఖండ్‌లో ఓ మ్యాగీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్ధానిక మ్యాగీ సంస్థలో పనిచేస్తున్న అతడు ఆ సంస్థ మూత పడటంతో ప్రాణం బలి తీసుకున్నాడు. మ్యాగీలో ఆందోళన కలిగించిన లెడ్ మోతాదు నెస్లే కొంపముంచిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ నైనితాల్‌కు సమీపంలోని రుద్రాపూర్‌లో ఓ మ్యాగీ ప్లాంట్ ఉంది. ఇందులో లల్టా ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. నెస్లే కంపెనీ ఉత్పత్తులను 90 రోజులపాటు నిషేధించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆ సంస్థ మూతపడింది. దీంతో అందులో పనిచేసేవారంతా రోడ్డున పడ్డారు. మానసికంగా కుంగిపోయిన ప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 13 రోజుల తరువాత దాని పరిణామం వెలుగు చూసింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. దాదాపు 1100 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డున పడ్డారట. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని మ్యాగీ శ్యాంపిళ్లను పరిశీలించిన హైకోర్టు దీనిపై నివేదిక పంపించాల్సిందిగా నెస్లేను కోరింది. తదుపరి విచారణను జూన్ 20 కి వాయిదా వేసింది. కాగా, మ్యాగీ నూడుల్స్‌ను నిషేధించడంతో రూ.320 కోట్ల విలువైన నూడుల్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు నెస్లే ఇండియా వెల్లడించింది. మార్కెట్, ఫ్యాక్టరీల్లోని నిల్వలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది.