వర్క్‌ఫ్రమ్‌ హోం లేదా ఆఫీస్‌.. ఇక మీ ఇష్టం! | Work From Home Or Office Top companies Give Choice To Employees | Sakshi
Sakshi News home page

వర్క్‌ వాట్‌ వర్క్స్‌ పాలసీ.. ఎంప్లాయిస్‌ ఫుల్‌ హ్యాపీ

Published Wed, Sep 29 2021 1:34 PM | Last Updated on Wed, Sep 29 2021 1:36 PM

Work From Home Or Office Top companies Give Choice To Employees - Sakshi

కరోనా వల్ల మొదలైన వర్క్‌ఫ్రమ్‌ కల్చర్‌కు ఎండ్‌కార్డ్‌ వేసేందుకు మెజార్టీ కంపెనీలు పావులు కదుపుతున్నాయి.  2022 జనవరి వరకు వర్క్‌ఫ్రమ్‌ ఆఫీస్‌ నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ..  ఆలోపే ఆఫీసులను తెరిచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి.  బలవంతంగా అయినా సరే ఎంప్లాయిస్‌ను రప్పించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుండగా,  మరికొన్ని కంపెనీలు మాత్రం రోస్టర్‌ విధానాన్ని పాటించాలని నిర్ణయించాయి. ఈ తరుణంలో కొన్ని స్వదేశీ కంపెనీలు ఉద్యోగులకు బంపరాఫర్‌ ప్రకటించాయి. 


థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యం నడుమే కంపెనీలు తెరిచేందుకు కంపెనీలు సిద్ధపడ్డాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాలా? లేదంటే వర్క్‌ఫ్రమ్‌లో కొనసాగాలా? అనే ఛాయిస్‌ను ఉద్యోగులకే వదిలేస్తున్నాయి.  నెస్లే, కోకా-కోలా, గోద్రేజ్‌ కన్జూమర్‌, డాబర్‌, ఆమ్‌వే, టాటా కన్జూమర్‌.. మరికొన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో  మూడు వంతుల ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తైంది. అయినా కూడా ఎంప్లాయిస్‌కే ‘వర్క్‌ఫ్రమ్‌’ ఆఫ్షన్‌ను వదిలేయడం.  



వర్క్‌ వాట్‌ వర్క్స్‌ పాలసీ
కరోనా వల్ల కమర్షియల్‌గా జరిగిన నష్టానికి పూడ్చడం కోసం, అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలపై  ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం యాభై శాతం ఉద్యోగులతోనైనా ఆఫీసులను నడిపించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఆఫీసుల్లో రిపోర్టింగ్‌ చేయడం(ఆఫీసులకు రావాల్సిన అవసరంలేదని) తప్పనిసరేం కాదని ఉద్యోగులకు చెప్పేశాయి. ఈ క్రమంలోనే ‘వర్క్‌ వాట్‌ వర్క్స్‌’ పాలసీని అమలు చేయబోతున్నాయి. అంటే.. ఉద్యోగులకు ఎలా వీలుంటే అలా పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ‘ఎమర్జెన్సీ, తప్పనిసరి విభాగాల’ ఉద్యోగులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి.

 

కారణాలివే.. 
వర్క్‌ఫ్రమ్‌ హోం ఎత్తేయడానికి ఈ కంపెనీలు తటపటాయించడానికి ప్రధాన కారణం..  మూడో వేవ్‌ హెచ్చరికలు, పైగా పండుగ సీజన్లు ముందు ఉండడం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రిస్క్‌ తీసుకోదల్చుకోవట్లేదని ఈ స్వదేశీ కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం ఒక డోసు తీసుకుని ఉన్నారని, సగం శాతం ఉద్యోగులు రెండు డోసులు పూర్తి చేసుకున్నారని జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్‌ సర్వే చెబుతోంది. అయినప్పటికీ ఆఫీసులకు రావాలా? వద్దా? అనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాయి ఈ స్వదేశీ కంపెనీలు.


చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. అయినా స్మోక్‌ చేయకూడదు!


 

ఆఫీసులు 24 గంటలు తెరిచే ఉంటాయని, రావడం రాకపోవడం ఉద్యోగుల ఇష్టమని తేల్చేశాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందు ముందు పరిస్థితి ఏంటన్నది తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని చెప్తున్నారు నెస్లే చైర్మన్‌ సురేష్‌ నారాయణన్‌. ఇక  టాటా స్టీల్‌, జీఈ ఇండియా, పెప్సికో కంపెనీలు చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోంలోనే కొనసాగుతున్నారు. మారూతీ సుజుకీ, మెర్కెడెస్‌ బెంజ్‌ ఇండియా, ఐటీసీ లాంటి కంపెనీలు మాత్రం రోస్టర్‌ సిస్టమ్‌ను ఫాలో అవుతున్నాయి. టెక్‌ దిగ్గజాలైన గూగుల్‌, అమెజాన్‌లతో పాటు టీసీఎస్‌, విప్రో లాంటి స్వదేశీ ఎమ్‌ఎన్‌సీలు జనవరి నుంచి ఆఫీసులను పూర్తిస్థాయిలో తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి.

చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్‌!!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement