Dabur India
-
కంపెనీలకు ధర దడ.. రేట్లు పెంపు?
ముడిసరుకులపై మరింతగా వెచ్చించాల్సి రావడం, ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా పెరగడం ఎఫ్ఎంసీజీ కంపెనీలకు సమస్యగా మారాయి. ఈ అంశాల కారణంగా సెప్టెంబర్ త్రైమాసికంలో దిగ్గజ సంస్థల మార్జిన్లు గణనీయంగా తగ్గాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం నెమ్మదించడం.. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్జూమర్ ప్రోడక్ట్స్ (జీసీపీఎల్), మారికో, ఐటీసీ, టాటా కన్జూమర్ ప్రోడక్ట్స్ (టీసీపీఎల్) తదితర దిగ్గజాలకు ఆందోళన కలిగిస్తోంది.సాధారణంగా ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాల్లో పట్టణ ప్రాంతాల్లో వినియోగం వాటా 65–68 శాతం స్థాయిలో ఉంటుంది. పామాయిల్ ధరలు పెరగడం, వినియోగదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం వంటి కారణాలతో జీఎస్పీఎల్కి సెప్టెంబర్ క్వార్టర్ ఒక మోస్తరుగానే గడిచింది. సింథాల్, గోద్రెజ్ నంబర్ 1, హిట్ వంటి ఉత్పత్తులను తయారు చేసే జీఎస్పీఎల్ స్టాండెలోన్ ఎబిటా మార్జిన్లు తగ్గాయి.డాబర్ ఇండియా‘అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ తగ్గడం’ వల్ల సెప్టెంబర్ క్వార్టర్లో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు డాబర్ ఇండియా పేర్కొంది. చ్యవన్‌ప్రాశ్, పుదీన్హరా వంటి ఉత్పత్తులను తయారు చేసే డాబర్ ఇండియా నికర లాభం (కన్సాలిడేటెడ్) 18 శాతం క్షీణించి రూ.418 కోట్లకు, ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 3,029 కోట్లకు తగ్గాయి. ఫుడ్ అండ్ బెవరేజెస్డిమాండ్ పడిపోతుండటంపై నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని త్రైమాసికాల క్రితం వరకు ఎఫ్అండ్బీ (ఫుడ్ అండ్ బెవరేజెస్) విభాగంలో డిమాండ్ రెండంకెల స్థాయిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం 1.5–2 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. మ్యాగీ, కిట్‌క్యాట్, నెస్కెఫే మొదలైన బ్రాండ్స్‌ను ఉత్పత్తి చేసే నెస్లే ఇండియా అమ్మకాలు దేశీయంగా కేవలం 1.2 శాతం వృద్ధికి పరిమితమయ్యాయి. ప్రథమ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కాస్త స్థిరంగానే ఉన్నప్పటికీ మెగా సిటీలు, మెట్రోల్లోనే సమస్యాత్మకంగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు.ఊహించిదానికన్నా ఎక్కువ ప్రభావం..పట్టణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులపై చేసే ఖర్చులపై ఆహార ద్రవ్యోల్బణం ప్రభావం ఊహించిన దానికంటే ఎక్కువగానే ఉందని టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా తెలిపారు. పరిమాణంపరంగా చూస్తే తమ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి .. ఇటీవల కొద్ది నెలలుగా నెమ్మదించినట్లు హెచ్‌యూఎల్ సీఈవో రోహిత్ జావా తెలిపారు. గ్రామీణ మార్కెట్లు క్రమంగా పట్టణ ప్రాంతాలను అధిగమిస్తున్నాయని వివరించారు. సర్ఫ్, రిన్, లక్స్, లిప్టన్, హార్లిక్స్ తదితర ఉత్పత్తులను తయారు చేసే హెచ్‌యూఎల్ నికర లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 2.33 శాతం తగ్గింది. ఆశీర్వాద్, సన్‌ఫీస్ట్ తదితర ఉత్పత్తుల సంస్థ ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం, అధిక స్థాయి ఆహార ద్రవ్యోల్బణం, నిర్దిష్ట ముడివస్తువుల ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: ఎగుమతుల్లో దూసుకుపోతున్న భారత్!రేట్లు పెంచే యోచనపామాయిల్, కాఫీ, కోకో, వంటి ముడిసరుకుల ధరలు పెరగడంతో మార్జిన్లను కాపాడుకోవడానికి తాము కూడా ఉత్పత్తుల రేట్లను పెంచాలని కొన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు యోచిస్తున్నాయి. సహేతుక స్థాయిలో రేట్లను పెంచి, ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మార్జిన్లను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నట్లు జీఎస్పీఎల్ ఎండీ సీతాపతి తెలిపారు. పండ్లు, కూరగాయలు, నూనెలు వంటి ముడిసరుకుల ధరలు భరించలేనంత స్థాయిలో పెరిగిపోతే ఉత్పత్తుల రేట్ల పెంపునకు దారి తీసే అవకాశం ఉందని నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ పేర్కొన్నారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీల పనితీరు ఇలా..
ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.433 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.360 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం పెరిగింది. స్థిరాస్తుల విక్రయం, రూ.42 కోట్లకు సంబంధించిన వివాదంలో సానుకూల పరిష్కారం లాభం 20 శాతం పెరిగేందుకు దారితీసినట్టు మారికో తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు రెండింతలు పెరిగినట్టు వెల్లడించింది.కన్సాలిడేటెడ్ ఆదాయం 7.6 శాతం వృద్ధితో రూ.2,476 కోట్ల నుంచి రూ.2,664 కోట్లకు చేరింది. దేశీయ అమ్మకాలు 5 శాతం పెరగ్గా, అంతర్జాతీయ వ్యాపారం స్థిర కరెన్సీ రూపంలో 13 శాతం వృద్ధి చెందింది. దేశీయ వ్యాపారం ఆదాయం 8 శాతం పెరిగి రూ.1,979 కోట్లుగా ఉంది. కోకోనట్ (పారాచ్యూట్) ఆయిల్ ధరలను పెంచడంతోపాటు అమ్మకాలు పెరగడం సానుకూలించినట్టు మారికో పేర్కొంది. పారాచ్యూట్ అమ్మకాలు 4 శాతం పెరగ్గా, ఆదాయం 10 శాతం వృద్ధి చెందినట్టు తెలిపింది. సఫోలా వంట నూనెల రూపంలో ఆదాయం కేవలం 2 శాతమే పెరిగింది. ఎఫ్ఎంసీజీ రంగానికి సంబందించి ధరల వృద్ధి సానుకూలంగా మారినట్టు మారికో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో ఆదాయంలో రెండంకెల వృద్ధిని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?డాబర్ లాభం నేలచూపుఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 418 కోట్లకు పరిమితమైంది. పట్టణ ప్రాంతాలలో డిమాండ్ తగ్గడం, ఆహార ధరల పెరుగుదల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 507 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కాగా.. మొత్తం ఆదాయం 5 శాతం వెనకడుగుతో రూ. 3,029 కోట్లను తాకింది. మొత్తం వ్యయాలు సైతం స్వల్పంగా 1 శాతం తగ్గి రూ. 2,634 కోట్లకు చేరాయి. ఆదాయంలో కన్జూమర్ కేర్ విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 2,488 కోట్లు లభించగా.. ఫుడ్ బిజినెస్ 13 శాతం క్షీణించి రూ. 467 కోట్లకు పరిమితమైంది. -
దక్షిణాదిలో మొదటి తయారీ యూనిట్
ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ డాబర్ తమిళనాడులోని ‘సిప్కాట్ ఫుడ్ పార్క్’లో తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ఈ యూనిట్ నిర్మాణానికిగాను డాబర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఈ ప్లాంట్ మొదటిది కావడం విశేషం.కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మొదటిదశ పనుల కోసం రూ.135 కోట్లు వెచ్చించనుంది. విల్లుపురం జిల్లా తిండివనంలోని సిప్కాట్ ఫుడ్ పార్క్‌లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజా వివరాల వెల్లడించారు. Welcome to Tamil Nadu, @DaburIndia! In fact, welcome to South India! In the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal, @Guidance_TN today signed an MoU with Dabur for the establishment of a world-class manufacturing plant, their FIRST EVER in South India,… pic.twitter.com/1rAazmCVOH— Dr. T R B Rajaa (@TRBRajaa) August 22, 2024‘కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ కంపెనీకి దక్షిణాదిలో మొదటిది కావడం విశేషం. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. మొదటిదశలో రూ.135 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల సుమారు 250 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్లాంట్‌లో హోమ్‌కేర్, పర్సనల్ కేర్, జ్యూస్ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు మేలు జరుగుతుంది’ అని మంత్రి అన్నారు. -
మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లు
డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. రెలిగేర్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ షేర్ హోల్డర్ వైభవ్గావ్లీ చేసిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.బర్మన్ కుటుంబానికి చెందిన డాబర్ సంస్థలోని కొన్ని షేర్లను గతంలో ఓపెన్ ఆఫర్ కింద విక్రయించారు. అందులో రెలిగేర్ లిమిటెడ్ షేర్ హోల్డర్లు పాల్గొన్నారు. రెలిగేర్ గ్రూప్‌లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి నిధులు సమీకరించారు. అనంతరం డాబర్ సంస్థ ఓపెన్ ఆఫర్‌తో అనుసంధానం అయిన ఇతర కంపెనీలకు ఆ డబ్బును చేరవేసింది.ఇదీ చదవండి: రూపాయి 78 ఏళ్ల ప్రస్థానం..ఇదిలాఉండగా, ఓపెన్ ఆఫర్ సమయంలో బర్మన్ కుటుంబానికి సంబంధించి సరైన వాటాను తెలియజేయకుండా తప్పుడు సమాచారం అందించారని రెలిగేర్ షేర్‌హోల్డర్ వైభవ్ గావ్లీ ఫిర్యాదు చేశారు. కంపెనీ నష్టాలను పూర్తిగా వెల్లడించలేదని చెప్పారు. వాటాల టెండర్లో మనీలాండరింగ్ జరిగిందన్నారు. ఓపెన్ ఆఫర్ ప్రకటించిన తర్వాత షేర్లను కొనుగోలు చేసిన వాటాదారులకు ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ప్రాథమిక చర్యలో భాగంగా ఈడీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాబర్ ఇండియా ఛైర్మన్ మోహిత్ బర్మన్తో పాటు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెందిన ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు, ఓపెన్ ఆఫర్ మేనేజర్‌కు సమన్లు జారీ చేసింది. అయితే కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అధికారుల పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దక్షిణాదిలో తయారీ ప్లాంటు యోచనలో డాబర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీ సంస్థ డాబర్ దక్షిణాదిలో కొత్తగా ఫ్యాక్టరీ నెలకొల్పే యోచనలో ఉంది. ఏడాదిలోపే దీన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. దక్షిణాదిలో తమ వ్యాపారం గడిచిన 5–6 ఏళ్లలో రెట్టింపయ్యిందని, ప్రస్తుతం మొత్తం దేశీ విక్రయాల్లో 20 శాతం వాటా ఉంటోందని ఆయన చెప్పారు. దక్షిణాది మార్కెట్లో విప్రో తదితర ఎఫ్‌ఎంసీజ తయారీ సంస్థలు ఫుడ్ సెగ్మెంట్లోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తాము కూడా ఇక్కడి మార్కెట్ కోసం కస్టమైజ్డ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. కంపెనీకి ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. వార్షికంగా దాదాపు రూ. 350–450 కోట్ల మేర పెట్టుబడి ప్రణాళికలున్న డాబర్ ఇండియా.. అటు అంతర్జాతీయంగా మధ్యప్రాచ్యం, యూరప్ మార్కెట్లలోను తమ తయారీ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. డాబర్‌కు సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే తదితర దేశాల్లోనూ ప్లాంట్లు ఉన్నాయి. -
ఆ క్రికెట్ బెట్టింగ్ యాప్‌తో వారికి ఎలాంటి సంబంధం లేదు: డాబర్ గ్రూప్
క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో తమకు ఎటువంటి పాత్ర లేదని డాబర్ గ్రూప్‌నకు చెందిన బర్మన్ కుటుంబం స్పష్టం చేసింది. ఇటీవల మహదేవ్ క్రికెట్ బెట్టింగ్‌యాప్‌తో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లు వినిపించాయి. దాంతో పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమచారం. అయితే వివాదంపై డాబర్గ్రూప్ స్పందించింది. రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌ను తాము కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం కోసం కావాలనే ఈ ఫిర్యాదు నమోదుచేశారని పేర్కొంది. నవంబరు 7న నమోదైనట్లు చెబుతున్న ఆ ఎఫ్ఐఆర్లో యాప్ ప్రమోటరు మహదేవ్‌తో పాటు 32 మందిపై ఫిర్యాదు చేసినట్లు ఉంది. అందులో డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ బర్మన్, గ్రూప్ డైరెక్టర్ గౌరవ్ బర్మన్ పేర్లున్నాయి. ఎఫ్ఐఆర్లో మోహిత్, గౌరవ్‌లకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని ఆరోపించారు. వారెవరూ మోహిత్, గౌరవ్‌లకు తెలియదని గ్రూప్ సభ్యులు తెలిపారు. బర్మన్ కుటుంబానికి రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 21.24 శాతం వాటా ఉంది. అయితే ఆ వాటాను పెంచుకోవాలని భావిస్తున్న సమయంలో ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఇదీ చదవండి: రిటైర్డ్ టీచర్లకు ఏటా రూ.83లక్షలు చెల్లించాలి: ఇన్ఫోసిస్ మూర్తి బర్మన్స్ గ్రూప్ రెలిగేర్‌కు రూ.2,200 కోట్ల ఒపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. కానీ, ఓపెన్ ఆఫర్ చేయడానికి ఆ గ్రూప్‌నకు అర్హత లేదంటూ రెలిగేర్ స్వతంత్ర డైరెక్టర్లు నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేశారు. ఆర్బీఐ, ఐఆర్డీఏఐ వంటి నియంత్రణ సంస్థలు సూచించిన అన్ని అర్హతలూ తమకున్నాయని బర్మన్స్ పేర్కొన్నారు. అదే సమయంలో 2018 నుంచి రెలిగేర్ ఛైర్పర్సన్ రశ్మీ సలూజా పారితోషికం రూ.150 కోట్లకు పెరగడంపైనా బర్మన్స్ ప్రశ్నలు లేవనెత్తగా.. సలూజా వాటిని తోసిపుచ్చారు. ఓపెన్ ఆఫర్ విషయాన్ని అనధికారికంగా సలూజాకు తెలియపరచిన తదుపరి రోజే సలూజా తన షేర్లను విక్రయించడంపైనా బర్మన్స్ ఆరోపణలు చేశారు. -
ప్రముఖ సంస్థపై కేసులు.. ఉత్పత్తులపై క్యాన్సర్ ఆరోపణలు!
డాబర్ కంపెనీకి సంబంధించిన మూడు అనుబంధ సంస్థలపై యూకే, కెనడాలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సంస్థ తయారుచేస్తున్న హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌కు కారణమవుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. డాబర్ కంపెనీ ఆయా దేశాల్లో ఈ ఉత్పత్తులను వివిధ బ్రాండ్ పేర్లతో విక్రయిస్తోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలపై ఇప్పటికే 5,400 కేసులు నమోదయ్యాయి. డాబర్ అనుబంధ సంస్థలైన నమస్తే లేబొరేటరీస్, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్, డాబర్ ఇంటర్నేషనల్ సంస్థలపై వివిధ కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. దీనికి తోడు ఇటీవల డాబర్ ఇండియా రూ.320.6 కోట్లకు జీఎస్టీ డిమాండ్ వడ్డీ, జరిమానా నోటీసును అందుకుంది. క్యాన్సర్ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ.. ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, సరైన పరిశోధన చేయకుండానే అనుబంధ సంస్థలపై కేసులు పెట్టారని పేర్కొంది. కేసుల పరిష్కారానికి కంపెనీ లీగల్ వాభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో డాబర్ స్టాక్స్ మార్కెట్లో నష్టపోయాయి. అయితే ఈ అంశం వల్ల ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ పేర్కొంది. డాబర్..చ్యవన్‌ప్రాష్, హోనిటస్ దగ్గు సిరప్, లాల్ దంత్ మంజన్ టూత్‌పేస్ట్, అశోకరిష్ట టానిక్, రియల్ జ్యూస్‌లు, ఓడోమాస్, వాటికా హెయిర్ ప్రొడక్ట్స్, పుదిన్ హర, హజ్మోలా వంటి ఉత్పత్తులను తయారు చేస్తుంది. -
ఆరోగ్య విభాగంపై డాబర్ ప్రత్యేక దృష్టి
న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ విభాగం నుంచి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అలాగే హోమ్, పర్సనల్ కేర్ విభాగాల నుంచి ఆదాయాన్ని 5–7 ఏళ్లలో రూ.7,000 కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. హెల్త్ కేర్, హోమ్, పర్సనల్ కేర్‌తో కూడిన కన్జ్యూమర్ కేర్ విభాగం నుంచి డాబర్‌కు అధిక ఆదాయం వస్తుండడాన్ని గమనించొచ్చు. 2022–23 మొత్తం ఆదాయం రూ.11,530 కోట్లలో ఈ విభాగం నుంచి 56.2 శాతం లభించింది. హెర్బల్, ఆయుర్వేదిక్ ఉత్పత్తుల అమ్మకాలు తలసరి ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతాయని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది. ఎగువ మధ్యతరగతి జనాభా పెరుగుదలతో ప్రయోజనం పొందే ప్రీమియం బ్రాండ్లు కూడా డాబర్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో లో యూనిట్ ప్యాక్‌ల (ఎల్‌యూపీ) అమ్మకాలు సైతం పెరుగుతాయనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మందికి చేరుకునే విధంగా ఎల్యూపీల పోర్ట్‌ఫోలియో పెంచుతామని పేర్కొన్నారు. ఫుడ్, బెవరేజెస్ విభాగంలో ప్రస్తుత ఉత్పత్తుల విభాగాలను విస్తరిస్తూనే, నూతన విభాగాల్లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రియల్ పేరుతో జ్యూస్‌ల విభాగంలో డాబర్ తగినంత మార్కెట్ వాటా సంపాదించం గమనార్హం. రియల్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. బాద్షా మసాలాను అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. డాబర్ గతేడాదే బాద్షా మసాలను రూ.587 కోట్లకు సొంతం చేసుకుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసుకునే ప్రణాళికతో ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు. గులాబరి బ్రాండ్‌పై బాడీవా‹Ù, సబ్బులను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పారు. -
ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ‘వింటర్’ దన్ను
న్యూఢిల్లీ: చలి పెరగడంతో చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. ఈ సీజన్‌తో అయినా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పుంజు కుంటాయని ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనుండడంతో వినియోగం మరింత పెరుగు తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధి రికవరీ ఉంటుందని భావిస్తున్నాయి. డాబర్, ఇమామీ, మారికో కంపెనీలకు సంబంధించి చర్మ సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచే (చ్యవన్‌ప్రాశ్) ఉత్పత్తుల అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ కామర్స్ వేదికలపై పెరిగాయి. ఈ ఏడాది సాగు బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, రానున్న త్రైమాసికాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు బలపడతాయన్న అంచనాలు కంపెనీల్లో ఉన్నాయి. 50 శాతం మేర వృద్ధి తమ ఉత్పత్తుల్లో బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేద శ్రేణి తదితర అమ్మకాలకు శీతాకాలం కీలకమని మారికో ఇండియా బిజినెస్ సీవోవో సంజయ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే హెయిర్ ఆయిల్ అమ్మకాలు పెరిగాయని తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే బాడీ లోషన్ అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో పెరిగాయన్నారు. కనుక అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాడీలోషన్ అమ్మకాల్లో 50 శాతానికి పైనే వృద్ధి నమోదు చేయగలమని భావిస్తున్నట్టు మిశ్రా చెప్పారు. మంచి డిమాండ్.. ఈ ఏడాది పండుగల సీజన్ తమకు రికవరీపై ఆశలు కలిగించినట్టు డాబర్ ఇండియా సీవోవో ఆదర్శ్ శర్మ తెలిపారు. డాబర్ చ్యవన్ ప్రాశ్, డాబర్ హనీ, గులాబరితోపాటు, చర్మ సంరక్షణ ఉత్పత్పత్తులతో వింటర్ పోర్ట్‌ఫోలియోను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభంలో ఉన్నామని, తమ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తోందని చెబుతూ.. ఈ ఏడాది మంచి వృద్ధి నమోదు అయితే, తదుపరి డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ తక్కువగా ఉందన్నారు. ఈ ఏడాది సాగు మంచిగా ఉండడంతో వచ్చే త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనాను వ్యక్తీకరించారు. ఈ ఏడాది వింటర్ ఉత్పత్తులకు డిమాండ్ కనిపిస్తున్నట్టు ఇమామీ సేల్స్ ప్రెసిడెంట్ వినోద్ రావు తెలిపారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుటికీ శీతాకాలంలో వినియోగించే ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రికవరీ కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హెచ్‌యూఎల్, డాబర్, ఇబామీ చర్మ సంరక్షణ విభాగంలో అధిక వాటాను ఆక్రమిస్తున్నాయని, ఇటీవల పామాయిల్, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయాల పరంగా ఇవి లాభపడతాయని నువమా గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అబనీష్ రాయ్ అంచనా వేశారు. క్రమంగా పెరుగుతున్న -
డాబర్ చేతికి బాద్షా మసాలా
న్యూఢిల్లీ: బాద్షా మసాలాలో మెజారిటీ వాటా(51 శాతం) కొనుగోలు చేసేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు దేశీ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా తాజాగా పేర్కొంది. ఇందుకు దాదాపు రూ. 588 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించేందుకు డాబర్‌కు వీలు చిక్కనుంది. డీల్ ప్రకారం రూ. 1,152 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో బాద్షా సొంతం చేసుకోనుంది. మిగిలిన 49 శాతం వాటాను సైతం ఐదేళ్ల తదుపరి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆహార సంబంధ బిజినెస్‌ను మరింత విస్తరించే వ్యూహంలో భాగంగా బాద్షా కొనుగోలుకి తెరతీసినట్లు డాబర్ పేర్కొంది. వెరసి రూ. 25,000 కోట్ల విలువైన బ్రాండెడ్ మసాలా దినుసుల విభాగంలోకి ప్రవేశించనుంది. దీంతో రానున్న మూడేళ్లలో ఫుడ్ బిజినెస్ ఆదా యాన్ని రూ. 500 కోట్లకు చేర్చే వీలున్నట్లు డాబర్ తెలియజేసింది. 1958లో ఏర్పాటైన బాద్షా మసాలా 2021–22లో రూ. 189 కోట్ల టర్నోవర్ సాధించింది. రూ. 2.5 డివిడెండ్ ఈ ఆర్థిక సంవత్సరం (2022–23) రెండో త్రైమాసికంలో డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 3 శాతం క్షీణించి రూ. 491 కోట్లకు పరిమితమైంది. గతేడాది (2021–22) ఇదే కాలంలో లాభం రూ. 505 కోట్లుగా నమోదైంది. వాటాదారులకు షేరుకి రూ. 2.5 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,986 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 2,818 కోట్ల టర్నోవర్ సాధించింది. -
ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ చైర్మన్‌గా వైదొలిగిన అమిత్ బర్మన్
సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పదవికి అమిత్ బర్మన్ రాజీనామా చేశారు. నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న మోహిత్ బర్మన్ను 5 సంవత్సరాల కాలానికి బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా సాకేత్ బర్మన్ను నియమిస్తున్నట్లు చెప్పింది. అయితే బర్మన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. డాబర్ ఛైర్మన్ అమిత్ బర్మన్ తన బాధ్యతల నుండి వైదొలిగినట్లు కంపెనీ బీఎస్ఈ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఆగష్టు 10 నుంచే ఆయన రాజీనామా అమలులోకి వచ్చిందని, దీన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని ప్రకటించింది. అమిత్ బర్మన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలను కొనసాగిస్తారని తెలిపింది. (ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా) 1999లో డాబర్ ఫుడ్స్ బాధ్యతలు స్వీకరించిన అమిత్ అనేక రకాల పొడులు, చట్నీలు ప్యాకేజ్డ్ ఫుడ్ జ్యూస్‌లతో ఫుడ్స్ వ్యాపారాన్ని పరిచయం చేశారు. అయితే 2007లో డాబర్ ఇండియాలో కంపెనీ విలీనం కావడంతో ఆయన డాబర్ ఫుడ్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత డాబర్ ఇండియా లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై) 2019లో డాబర్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్సీ చేశారు. డాబర్‌లో చేరడానికి ముందు, మాన్యుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ విభాగంలో కోల్గేట్ పామోలివ్తో కలిసి పనిచేశారు. 1990లో అతను టిష్కాన్ కార్పొరేషన్ న్యూయార్క్‌లో కూడా శిక్షణ పొందారు అమిత్. -
చిన్న ప్యాకెట్.. సూపర్‌హిట్!
న్యూఢిల్లీ: రకరకాల కారణాలతో ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నప్పటికీ ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఆ స్థాయిలో ఉత్పత్తుల రేట్లు పెంచలేని పరిస్థితి నెలకొంది. అత్యంత ఆదరణ ఉండే చిన్న ప్యాకెట్ల ధరలను పెంచితే కొనుగోళ్లు తగ్గిపోతాయన్న ఆందోళనతో అవి కస్టమర్లను నిలబెట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రేట్లు పెంచే బదులు గ్రామేజీ (బరువు)ని తగ్గించి అదే ధరకు సదరు ఉత్పత్తులను అందిస్తున్నాయి. తక్కువ రేటు ఉండే చిన్న ప్యాకెట్లకు (ఎల్‌యూపీ) డిమాండ్ బాగానే ఉండటంతో ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. పలు కంపెనీలు తమ సబ్బులు, నూడుల్స్ మొదలుకుని చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్ల వరకూ వివిధ ఉత్పత్తుల విషయంలో ఇదే వ్యూహం పాటిస్తున్నాయి. వీటితో పాటు మధ్యస్థ రేట్లతో బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెట్టడం, పెద్ద ప్యాక్‌లపై ధరల పెంపును సింగిల్ డిజిట్ స్థాయికి పరిమితం చేయడం వంటి ప్రయత్నాలెన్నో చేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ఇండియా ఒకవైపు ధరలపరమైన చర్యలతో పాటు మరోవైపు వ్యయాల నియంత్రణ కసరత్తుతో ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌యూపీ ప్యాక్‌లు ఎక్కువగా అమ్ముడవుతాయి. వీటి ధర శ్రేణి రూ. 1, రూ. 5, రూ. 10 స్థాయిలో ఉంటుంది. బండగుర్తుల్లాంటి ఈ రేట్లలో మార్పులు చేయలేని పరిస్థితి. అందుకే గ్రామేజీని తగ్గించి అదే రేట్లకు అందిస్తున్నాం. అదే పట్టణ ప్రాంతాల విషయానికొస్తే తలసరి ఆదాయం కాస్త ఎక్కువ. వినియోగదారులకు ఎక్కువ వెచ్చించగలిగే సామర్థ్యాలు ఉంటాయి. అందుకే పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచాము’’ అని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాస్త డబ్బు చేతిలో ఆడేలా చూసుకునేందుకు వినియోగదారులు ఖరీదైన ఉత్పత్తులకు బదులుగా చౌక ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న సంకేతాలు తాము గమనించినట్లు పార్లే ప్రోడక్ట్స్ వర్గాలు తెలిపాయి. ఎల్‌యూపీ ప్యాక్‌ల అమ్మకాల్లో పెరుగుదల ఇందుకు నిదర్శనమని వివరించాయి. మార్చి త్రైమాసికం నుంచి మారిన ట్రెండ్.. గతేడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే జనవరి–మార్చి క్వార్టర్లో ఇటు పట్టణ అటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరల్లో లభించే చిన్న ప్యాక్‌ల వినియోగం గణనీయంగా పెరిగినట్లు రిటైల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫాం బిజోమ్ తెలిపింది. వంట నూనెలు వంటి కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం అసాధారణ స్థాయికి పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారులు వీలైనంత వరకూ పర్సులపై భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ ఎక్కువ పరిమాణంలో సరుకులు కొనుక్కునే వారు కూడా ప్రస్తుతం బడ్జెట్‌కి కట్టుబడి ఉండే ప్రయత్నాల్లో భాగంగానే ఎల్‌యూపీ ప్యాక్‌లవైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. చాలా మటుకు ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల్లో రూ. 1 నుంచి రూ. 10 వరకూ రేటుతో చిన్న ప్యాక్‌ల వాటా 25–35 శాతం మేర ఉంటోంది. హెచ్‌యూఎల్ వ్యాపారంలో ఇలాంటి చౌక ప్యాక్‌ల విక్రయాలు 30 శాతం వరకూ ఉంటాయి. ఇమామీ అమ్మకాల్లో వీటి వాటా 24 శాతం స్థాయిలో ఉంది. అటు బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో అమ్మకాల్లో రూ. 5, రూ. 10 స్థాయి ప్యాక్‌ల వాటా 50–55 శాతం వాటా ఉంటోంది. అమ్మకాల సంగతి అలా ఉంచితే చిన్న ప్యాక్‌ల విషయంలోనూ కంపెనీలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ అబనీష్ రాయ్ వివరించారు. పెద్ద ప్యాక్‌ల రేట్లను పెంచగలిగినప్పటికీ .. తక్కువ ధర యూనిట్లలో నిర్దిష్ట స్థాయికన్నా గ్రామేజీని తగ్గించడానికి వీల్లేదు. దీంతో అవి ప్రత్యేకంగా బ్రిడ్జ్ ప్యాక్‌లు ప్రవేశపెడుతున్నాయి. హెచ్‌యూఎల్, ఇమామీ ఇలాంటి వాటిపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కాస్తంత ఎక్కువ ధరకు, ఎల్యూపీతో పోలిస్తే ఎక్కువ బరువు ఉండటం వల్ల, ఓ మోస్తరు అవసరాల కోసం వినియోగదారులు అనవసరంగా అధిక రేటు పెట్టి పెద్ద ప్యాక్‌లను కొనుక్కోవాల్సిన పరిస్థితి తప్పుతుందని రాయ్ పేర్కొన్నారు. ఇది ఇటు కొనుగోలుదారులు అటు కంపెనీలకూ ప్రయోజనకరంగా ఉంటోందని వివరించారు. -
ఎవరెడీకి చైర్మన్, ఎండీలు బైబై
న్యూఢిల్లీ: డ్రై సెల్ బ్యాటరీలు, ఫ్లాష్లైట్ల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ నాన్‌ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అదిత్య ఖైతాన్, ఎండీ అమృతాన్షు ఖైతాన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఎవరెడీ వాటాదారుల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకి ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో వీరిరువురూ పదవులకు గుడ్‌బై చెప్పినట్లు కంపెనీ పేర్కొంది. షేరుకి రూ. 320 ధరలో 1.89 కోట్ల ఎవరెడీ షేర్ల కొనుగోలుకి వివిధ సంస్థల ద్వారా సోమవారం నుంచి బర్మన్ గ్రూప్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నేటి(3) నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఆదిత్య, అమృతాన్షు బోర్డుకి రాజీనామాలు సమర్పించినట్లు ఎవరెడీ ఇండస్ట్రీస్ వెల్లడించింది. తద్వారా కొత్త యాజమాన్యం నేతృత్వంలో కంపెనీ లబ్ధి్ద పొందేందుకు వీలు కల్పించాలని వీరిరువురూ నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. తాత్కాలిక ఎండీగా.. ఆదిత్య, అమృతాన్షు ఖైతాన్‌ల రాజీనామాలను ఆమోదించిన బోర్డు కంపెనీ జేఎండీగా వ్యవహరిస్తున్న సువమాయ్ సాహాకు మధ్యంతర ఎండీగా బాధ్యతలు అప్పగించినట్లు ఎవరెడీ వెల్లడించింది. వివిధ సంస్థల ద్వారా ఎవరెడీలో 19.84 శాతం వాటా కలిగిన బర్మన్ గ్రూప్ గత వారం 5.26 శాతం అదనపు వాటాను సొంతం చేసుకోవడం ద్వారా సోమవారం ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో నిబంధనల ప్రకారం ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎవరెడీ షేరు ఎన్ఎస్ఈలో 2.2% బలపడి రూ. 357 వద్ద ముగిసింది. -
ఎవరెడీకి డాబర్ ఓపెన్ ఆఫర్
కోల్‌కతా: డ్రై సెల్ బ్యాటరీల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో పూర్తిస్థాయి యాజమాన్య నియంత్రణకు వీలుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు తాజాగా ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీ టేకోవర్ నిబంధనలకు అనుగుణంగా 26 శాతం అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు షేరుకి రూ. 320 ధర చెల్లించనున్నట్లు వెల్లడించారు. బీఎం ఖైతాన్ గ్రూప్ నిర్వహణలోని ఎవరెడీ కొనుగోలుకి డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. 5.26 శాతం అదనపు వాటా కొనుగోలు ద్వారా ఎవరెడీలో బర్మన్ కుటుంబ వాటా 25.11 శాతానికి చేరింది. దీంతో ఓపెన్ ఆఫర్‌కు డాబర్ తెరతీసింది. ప్రస్తుతం ఎవరెడీలో ఖైతాన్ కుటుంబానికి 4.84 శాతం వాటా మాత్రమే ఉంది. పరిస్థితులను గమనిస్తున్నాం ఎవరెడీలో పెట్టుబడులను పర్యవేక్షిస్తున్న డాబర్ కుటుంబంలోని మోహిత్ బర్మన్ కంపెనీ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. కంపెనీని దారిలో పెట్టేందుకు ఇదే సరైన సమయమని తెలియజేశారు. ఎవరెడీ బ్రాండుకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. కంపెనీకి విలువ జోడింపును చేపడుతామని, తద్వారా బిజినెస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలమని వ్యాఖ్యానించారు. ఎవరెడీ కొనుగోలులో డాబర్ ఇండియా ప్రత్యక్షంగా పాల్లొనకపోవడం గమనార్హం! ఎవరెడీ ప్రమోటర్లు బీఎం ఖైతాన్ కుటుంబం మెక్నల్లీ భారత్ ఇంజినీరింగ్ రుణ చెల్లింపులకు, ఇతర రుణాలకుగాను కంపెనీ షేర్లను తనఖాలో ఉంచుతూ వచ్చారు. అయితే చెల్లింపుల్లో విఫలంకావడంతో రుణదాత సంస్థలు వీటిని విక్రయిస్తూ వచ్చాయి. దీంతో ఖైతాన్ వాటా 44 శాతం నుంచి 4.8 శాతానికి క్షీణించింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్ఎస్ఈలో డాబర్ ఇండియా షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 565కు చేరగా.. ఎవరెడీ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 375 వద్ద ముగిసింది. -
వర్క్‌ఫ్రమ్ హోం లేదా ఆఫీస్.. ఇక మీ ఇష్టం!
కరోనా వల్ల మొదలైన వర్క్‌ఫ్రమ్ కల్చర్‌కు ఎండ్‌కార్డ్ వేసేందుకు మెజార్టీ కంపెనీలు పావులు కదుపుతున్నాయి. 2022 జనవరి వరకు వర్క్‌ఫ్రమ్ ఆఫీస్ నిర్ణయాన్ని వాయిదా వేసినప్పటికీ.. ఆలోపే ఆఫీసులను తెరిచేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాయి. బలవంతంగా అయినా సరే ఎంప్లాయిస్ను రప్పించేందుకు కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తుండగా, మరికొన్ని కంపెనీలు మాత్రం రోస్టర్ విధానాన్ని పాటించాలని నిర్ణయించాయి. ఈ తరుణంలో కొన్ని స్వదేశీ కంపెనీలు ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించాయి. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యం నడుమే కంపెనీలు తెరిచేందుకు కంపెనీలు సిద్ధపడ్డాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఉద్యోగులు ఆఫీసులకు రావాలా? లేదంటే వర్క్ఫ్రమ్లో కొనసాగాలా? అనే ఛాయిస్‌ను ఉద్యోగులకే వదిలేస్తున్నాయి. నెస్లే, కోకా-కోలా, గోద్రేజ్ కన్జూమర్, డాబర్, ఆమ్వే, టాటా కన్జూమర్.. మరికొన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ కంపెనీల్లో పని చేసే ఉద్యోగుల్లో మూడు వంతుల ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైంది. అయినా కూడా ఎంప్లాయిస్‌కే ‘వర్క్‌ఫ్రమ్’ ఆఫ్షన్‌ను వదిలేయడం. వర్క్ వాట్ వర్క్స్ పాలసీ కరోనా వల్ల కమర్షియల్‌గా జరిగిన నష్టానికి పూడ్చడం కోసం, అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు.. ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించాలని కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ క్రమంలో కనీసం యాభై శాతం ఉద్యోగులతోనైనా ఆఫీసులను నడిపించాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే కొన్ని కంపెనీలు మాత్రం ఆఫీసుల్లో రిపోర్టింగ్ చేయడం(ఆఫీసులకు రావాల్సిన అవసరంలేదని) తప్పనిసరేం కాదని ఉద్యోగులకు చెప్పేశాయి. ఈ క్రమంలోనే ‘వర్క్ వాట్ వర్క్స్’ పాలసీని అమలు చేయబోతున్నాయి. అంటే.. ఉద్యోగులకు ఎలా వీలుంటే అలా పని చేయాలని సూచిస్తున్నాయి. అయితే ‘ఎమర్జెన్సీ, తప్పనిసరి విభాగాల’ ఉద్యోగులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆఫీసులకు రావాల్సిందేనని స్పష్టం చేశాయి. కారణాలివే.. వర్క్‌ఫ్రమ్ హోం ఎత్తేయడానికి ఈ కంపెనీలు తటపటాయించడానికి ప్రధాన కారణం.. మూడో వేవ్ హెచ్చరికలు, పైగా పండుగ సీజన్లు ముందు ఉండడం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రిస్క్ తీసుకోదల్చుకోవట్లేదని ఈ స్వదేశీ కంపెనీలు చెప్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం ఒక డోసు తీసుకుని ఉన్నారని, సగం శాతం ఉద్యోగులు రెండు డోసులు పూర్తి చేసుకున్నారని జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్ సర్వే చెబుతోంది. అయినప్పటికీ ఆఫీసులకు రావాలా? వద్దా? అనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇచ్చేస్తున్నాయి ఈ స్వదేశీ కంపెనీలు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! ఆఫీసులు 24 గంటలు తెరిచే ఉంటాయని, రావడం రాకపోవడం ఉద్యోగుల ఇష్టమని తేల్చేశాయి. ఈ నిర్ణయంపై ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ముందు ముందు పరిస్థితి ఏంటన్నది తర్వాతి పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని చెప్తున్నారు నెస్లే చైర్మన్ సురేష్ నారాయణన్. ఇక టాటా స్టీల్, జీఈ ఇండియా, పెప్సికో కంపెనీలు చాలామంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్ హోంలోనే కొనసాగుతున్నారు. మారూతీ సుజుకీ, మెర్కెడెస్ బెంజ్ ఇండియా, ఐటీసీ లాంటి కంపెనీలు మాత్రం రోస్టర్ సిస్టమ్‌ను ఫాలో అవుతున్నాయి. టెక్ దిగ్గజాలైన గూగుల్, అమెజాన్లతో పాటు టీసీఎస్, విప్రో లాంటి స్వదేశీ ఎమ్ఎన్సీలు జనవరి నుంచి ఆఫీసులను పూర్తిస్థాయిలో తెరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. చదవండి: వారానికి నాలుగు రోజులే ఆఫీస్!! -
కల్తీ తేనె కలకలం: మరింత కరోనా ముప్పు
సాక్షి, న్యూఢిల్లీ: రోగనిరోధక శక్తి పెంచుతుంది.. యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్ అంటూ కరోనా కాలంలో తేనెను తెగ లాగించేస్తున్నారా? అయితే మీకొక షాకింగ్ రిపోర్టు.. చైనా సుగర్ సిరప్‌తో గుర్తు పట్టలేనంతగా దేశంలో కల్తీ తేనెను చలామణీ చేస్తున్నవ్యవహారం కలకలం రేపుతోంది. చిన్నా పెద్ద సహా దాదాపు అన్ని బ్రాండ్ల తేనె చక్కెర సిరప్‌తో కల్తీ చేస్తున్నారని తమ అధ్యయనం తేలిందని ప్రకటించింది. దేశంలోని 13 ప్రధాన బాండ్లలో డాబర్, పతంజలి, బైద్యనాథ్ జండుతో సహా మొత్తం 10 సంస్థలు విక్రయిస్తున్న తేనె కల్తీమయమని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభ సమయంలో ప్రజలు తేనెకు బదులుగా, ఎక్కువ చక్కెరను తింటున్నారని, ఇది కోవిడ్-19 ప్రమాదాన్నిమరింత పెంచుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తేనెలో చైనా చక్కెరతో కలిపి కల్తీ తేనెను విక్రయిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్వాలిటీ పరీక్షల్లో నిర్దారణ అయిందని తెలిపింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డిడిబి) సెంటర్ ఫర్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్ (కాల్‌ఎఫ్)లో వీటి నమూనాలను పరీక్షించారు. జర్మనీలోని ఒక ప్రత్యేక ప్రయోగశాలలో ఎన్ఎంఆర్ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షించినప్పుడు, చాలా బ్రాండ్లు విఫలమయ్యాయి. పరీక్షించిన 13 బ్రాండ్లలో మూడు బ్రాండ్లు మాత్రమే ఎన్ఎంఆర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయని సీఎస్ఈ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను డాబర్, పతంజలి, జండు ప్రతినిధులు ఖండించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఎఐ) నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగానే ఉందని వాదిస్తున్నాయి. సీఎస్ఈ విడుదల చేసిన రిపోర్టు అవాస్తవమైందనీ, ఇండియన్ నాచురల్ హనీ ఇండస్ట్రీని దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ వివాదంపై ప్రముఖ ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తుల సంస్థ డాబర్ స్పందిస్తూ ప్రపంచంలోనే నంబర్ వన్ తేనె డాబర్ హనీ అని, తమ తేనె 100 శాతం స్వచ్ఛమైంది, సురక్షితమైందని తెలిపింది. తమ తేనెలో కల్తీ జరగలేదని ట్వీట్ చేసింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో తేనె అమ్మకాలు పెరిగినప్పటికీ ఉత్తర భారతదేశంలో తేనెటీగల పెంపకందారులు లాభాలు క్షీణించాయని, దీంతో దర్యాప్తు ప్రారంభించినట్లు సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ తెలిపారు. శీతల పానీయాలపై 2003, 2006 సంవత్సరాల్లో తాముచేపట్టిన పరిశోధనలో పరిశోధనలలో కనుగొన్న దానికంటే దుర్మార్గమైన, దారుణమైన మోసాన్ని గుర్తించామన్నారు. అతి ఘోరమైన, అధునాతన కల్తీ ఇదని, ఇప్పటివరకు గుర్తించినదానికంటే చాలా ఎక్కువ హానికరమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాంతక మహమ్మారితో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని నరేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 పై పోరులో భాగంగా చాలామందితేనెను విరివిగా వినియోగిస్తున్న తరుణంలో ఈ ఫలితాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. తేనెలోకల్తీని గుర్తించడం కష్టమని ఫుడ్ సేఫ్టీ అండ్ టాక్సిన్స్ టీం ప్రోగ్రామ్ డైరెక్టర్ అమిత్ ఖురానా అన్నారు. సీఎస్ఈ అధ్యయనం ప్రకారం , ప్రారంభంలో తేనెలో తీపిని పెంచేందుకు మొక్కజొన్న, చెరకు, బియ్యం, బీట్రూట్ నుండి తీసిన చక్కెరను తేనెలో కల్తీ చేసేవారు. ఇది సీ3, సీ4 పరీక్షల్లో బయటపడుతుంది. కానీ ఈ కొత్త కల్తీ ‘చైనీస్ సుగర్’ ను న్యూక్లియర్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఎన్ఎంఆర్) అనే పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించగలం. ప్రముఖ బ్రాండ్లైన డాబర్, పతంజలి, బైద్యనాథ్, జండు, హిత్కారీ, అపిస్ హిమాలయా సంస్థలనుంచి సేకరించిన తేనె నమూనాలు ఎన్ఎంఆర్ పరీక్షలో విఫలమయ్యాయి. మారికో సఫోలా హనీ, మార్క్‌ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా మాత్రమే అన్ని పరీక్షల్లో నెగ్గాయి. World's No. 1 Dabur Honey is 100% Pure & Safe! ✅We are NMR profiled ✅We are 22 FSSAI tests compliant. Dabur Honey clears all FSSAI tests and has the first corporate-owned NMR machine in India to ensure 100% purity. Read the complete report here, https://t.co/hLlEEMzh2M pic.twitter.com/J36fBkvnKG — Dabur India Ltd (@DaburIndia) December 2, 2020 -
నిఫ్టీ-50లో ఎస్బీఐ లైఫ్, దివీస్, డాబర్!
ఏడాదికి రెండుసార్లు ప్రధాన ఇండెక్స్ నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే కంపెనీల జాబితాను ఎన్ఎస్ఈ.. సమీక్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఇండెక్స్ షేర్లలో మార్పులు చేపడుతుంటుంది. సాధారణంగా జనవరి 31, జులై 31న సవరణలు ప్రతిపాదిస్తుంటుంది. నిఫ్టీ-50లో విభిన్న రంగాలకు చెందిన 50 బ్లూచిప్ కంపెనీల షేర్లు ప్రాతినిధ్యం వహించే సంగతి తెలిసిందే. ఈ సారి సమీక్షలో భాగంగా మీడియా కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్, పీఎస్‌యూ.. గెయిల్ ఇండియా, టెలికం కంపెనీ భారతీ ఇన్ఫ్రాటెల్ నిఫ్టీలో చోటు కోల్పోవచ్చని తెలుస్తోంది. వీటి స్థానే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, దివీస్ ల్యాబ్, డాబర్ ఇండియా నిఫ్టీకి ప్రాతినిధ్యం వహించవచ్చని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక తాజాగా అంచనా వేసింది. 3 నెలలే స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొత్తగా లిస్టయ్యే సెక్యూరిటీల విషయంలో ఆరు నెలలకు బదులుగా మూడు నెలల గణాంకాలనే పరిగణించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఫ్లోటింగ్ స్టాక్ సర్దుబాటులో భాగంగా మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) విధానం ప్రకారం నిఫ్టీ షేర్లలో సవరణలుంటాయని ఐడీబీఐ నివేదిక తెలియజేసింది. ఇండెక్స్ విలువపై ప్రభావం చూపని షేర్ల విభజన, రైట్స్ ఇష్యూ తదితరాలకు సైతం ప్రాధాన్యత ఉంటుందని వివరించింది. లాభాల్లో ఏస్ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఈ జనవరి నుంచి చూస్తే దివీస్ ల్యాబ్ షేరు 39 శాతం జంప్‌చేయగా.. డాబర్ 7.3 శాతం బలపడింది. అయితే ఎస్బీఐ లైఫ్, గెయిల్, ఇన్ఫ్రాటెల్, జీ 5-52 శాతం మధ్య క్షీణించాయి. ఇండెక్స్‌లో ఎంపిక చేసుకునే కంపెనీలకు సంబంధించి వ్యాపార పునర్వ్యవస్థీకరణ, అనుబంధ సంస్థల విడతీత తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉంటుందని, అయితే రికార్డ్ డేట్ ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని ఐడీబీఐ క్యాపిటల్ నివేదిక వివరించింది. డీలిస్టింగ్ బాట పట్టిన వేదాంతా స్థానే ఇటీవల హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను నిఫ్టీ-50 ఇండెక్స్‌లో పొందుపరచిన విషయం విదితమే. -
డెల్టా కార్ప్- ఎవరెడీ ఇండస్ట్రీస్.. జూమ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ కేసినో, రియల్టీ సంస్థ డెల్టా కార్ప్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు వాటాను పెంచుకున్న వార్తలతో వరుసగా రెండో రోజు లైటింగ్ ప్రొడక్టుల కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. డెల్టా కార్ప్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డెల్టా కార్ప్ రూ. 28.2 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 42.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. లాక్‌డవున్ ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 74 శాతం క్షీణించి రూ. 48.3 కోట్లకు పరిమితమైంది. ఈ క్యూ1లో దాదాపు రూ. 22 కోట్లమేర పన్ను వ్యయాలు నమోదుకాగా.. గత క్యూ1లో రూ. 6 కోట్ల రైట్‌బ్యాక్ లభించినట్లు డెల్టా కార్ప్ తెలియజేసింది. అంతేకాకుండా లాక్‌డవున్ కారణంగా కేసినో లైసెన్స్ ఫీజును రద్దు చేయవలసిందిగా గోవా ప్రభుత్వాన్ని అర్ధించినట్లు తెలియజేసింది. లాక్‌డవున్ కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఆదాయం భారీగా పెరిగినట్లు వెల్లడించింది. దీంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం డెల్టా కార్ప్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 94 సమీపంలో ఫ్రీజయ్యింది. ఎవరెడీ ఇండస్ట్రీస్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం డాబర్ ప్రమోటర్లు బర్మన్ కుటుంబం తాజాగా 8.48 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడికావడంతో బ్యాటరీల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్ షేరు జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎవరెడీ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 94 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 98 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం దూసుకెళ్లిన విషయం విదితమే. అదనపు వాటా కొనుగోలు నేపథ్యంలో తాజాగా ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో బర్మన్ కుటుంబ వాటా 19.84 శాతానికి ఎగసినట్లు తెలుస్తోంది. గతంలో ఈ వాటా 11.35 శాతంగా నమోదైంది. -
కరోనాపై పోరు.. డాబర్ గ్రూప్ విరాళం
కరోనా వైరస్ పై పోరుకు చాలామంది తమవంతు సాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. బీడీ కార్మికుల నుంచి బడా బడా కంపెనీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. తాజాగా డాబర్ గ్రూప్ కూడా ముందుకొచ్చింది. కరోనా వైరస్ సహాయక చర్యల కోసం రూ. 21 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ‘డాబర్ కేర్ ఫండ్ ఫర్ కోవిడ్ 19’ ద్వారా రూ. 11కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు అందించనుంది. కాగా మిగతా మొత్తాన్ని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, వలస కార్మికుల కోసం అందించనున్నట్లు ప్రకటించింది. ‘ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదాం. ప్రజల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం.. ఆ దిశగా డాబర్ గ్రూప్ పనిచేస్తుందని' డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమిత్ బర్మానీ చెప్పారు. (తెలంగాణలో 487 కరోనా పాజిటివ్ కేసులు) -
డాబర్ ఆదాయం రూ.2,212 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దేశీయ దిగ్గజం డాబర్ ఇండియా రెండో త్రైమాసిక కాలంలో రూ.404 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని డాబర్ ఇండియా తెలిపింది. పెట్టుబడుల విలువకు సంబంధించి రూ.40 కోట్ల వన్‌టైమ్ ఇంపెయిర్మెంట్ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని వివరించింది. 140 శాతం మధ్యంతర డివిడెండ్... ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.40 మధ్యంతర డివిడెండ్ (140 శాతం) ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. పన్నులతో కలుపుకొని మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.298 కోట్లకు చేరతాయి. -
కార్పొరేట్ పన్నుకోత : దేవతలా ఆదుకున్నారు
న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర సర్కార్ కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకొని మార్కెట్లో జోష్ నింపిన విషయం తెలిసిందే. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం మందగమనంలో ఉన్న ఉపాధి రంగానికి ఊతమిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక మందగమనంతో డీలా పడ్డ ముఖ్యమైన రంగాలకు ఊరట లభించింది. కాగా, కన్స్యూమర్, రిటైల్, నిర్మాణం వంటి రంగాలలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వ, పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ప్రధానంగా భారీగా అమ్మకాలు పడిపోయి సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమ ఉపశమనం లభించినట్ల యిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మ్యాన్ పవర్ సర్వీసెస్ ఇండియా ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ మాట్లాడుతూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కార్పోరేట్ పన్నుకోత తయారీ రంగంలో పెట్టుబడులు పెరిగి లక్షలాది ఉద్యోగ కల్పనకు సాధ్యపడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంనుంచి కోలుకునే ఆశలు కోల్పోతున్న తరుణంలో, నిర్మలా సీతారామన్ నిజమైన లక్ష్మీ దేవత అవతారంలో ఆదుకున్నారని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ హర్ష గోయెంకా ప్రశంసించారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవాలని ప్రార్థిస్తున్న లక్షలాదిమంది భారతీయుల్లో ఆశలునింపారని, మూలధన వ్యయ పునరుద్ధరణకు, కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ చర్య సహాయ పడుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాజా నిర్ణయంతో ఇప్పుడే దీపావళి వచ్చినట్లుందని మహేంద్ర అండ్ మహేంద్ర ఎండీ పవన్ గోయంకా ట్వీట్ చేశారు. మరోవైపు కాంటినెన్షియల్ ఇండియా టైర్ల కంపెనీకి చెందిన ప్రశాంత్ దొరస్వామి స్పందిస్తూ పెట్టుబడులకు ఎంతో ఉపకరిస్తుందని ఉపాధి రంగానికి సానుకూల అంశమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాల్సిందేనని అయితే పెట్టుబడులు పెరిగినప్పుడే అనుకున్న లక్ష్యాలు సిద్ధిస్తాయని ఆదిత్య బిర్తా గ్రూపుకు చెందిన సంతృప్త మిశ్రా అన్నారు. ప్రభుత్వం తీసుకున్న పన్ను మినహాయింపులు, అందులో తమ కంపెనీకి చెందిన చాలా ఉత్పత్తులు ఉండడం హర్షించదగ్గ విషయమని డాబర్ కంపెనీకి చెందిన హెచ్ఆర్ వికృష్ణన్ అన్నారు. ఉద్యోగులు జీతాల పెరుగుదలకు మరికొంత సమయం వేచి చూడక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
డాబర్ ఇండియాకు కొత్త చైర్మన్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియ చైర్మన్‌గా అమిత్ బర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ పదవిలో ఉన్న ఆనంద్ బర్మన్ ఇటీవల రాజీనామా చేయడంతో ఈ కొత్త నియామకం జరిగింది. మరో వారసుడు మోహిత్ బర్మన్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. దీంతో రూ. 8500 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని కలిగిన దేశంలోని పురాతన వినియోగ వస్తువుల కంపెనీ పగ్గాలు తరువాతి తరం చేతుల్లోకి మారాయి. మరోవైపు సీఈవో పదవినుంచి తప్పుకున్న సునీల్ దుగ్గల్ శుక్రవారం బోర్డునకు కూడా రాజీనామా చేశారు. ఈ ఏడాది జనవరిలో మోహిత్ మల్హోత్రాను సీఈవోగా నియమించింది వ్యవస్థాపక బర్మన్ కుటుంబంనుంచి ఐదవతరం సభ్యుడైన అమిత్ బర్మన్(50) డాబర్‌లో అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈయన కంపెనీ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. డాబర్ ఫుడ్స్ పేరుతో సంస్థను స్థాపించిన అమిత్ 12 ఏళ్ల తరువాత దీన్ని మాతృసంస్థ డాబర్ ఇండియలో విలీనం చేశారు. వైస్ ఛైర్మన్‌గా నియమితులైన మోహిత్ ప్రస్తుతంఎలిఫెంట్ క్యాపిటల్(లండన్ స్టాక్ఎక్స్ఛేంజ్-లిస్టెడ్) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, జీవిత బీమా, సాధారణ భీమా, ఎసెట్ మేనేజ్మెంట్, రిటైల్ స్పోర్ట్స్ సహా డాబర్ ఫ్యామిలీకి చెందిన పెట్టుబడులకు నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అవివా లైఫ్ ఇన్సూరెన్స్, యూనివర్సల్ సైమన్ జనరల్ ఇన్సూరెన్స్, ఐపీఎల్ టీం కింగ్స్ఎలెవన్ పంజాబ్ తదితరాలున్నాయి. అలాగే ఆనంద్బర్మన్ కుమారుడు ఆదిత్య డాబర్ ఇండియాలో నాన్-ఎగ్జిక్యూటివ్ అడిషనల్ డైరెక్టర్‌గా కంపెనీలో చేరనున్నారు. కాగా సహజ ఉత్పత్తుల విక్రయం పేరుతో 1884లో డా.ఎస్.కె. బర్మన్ డాబర్ కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం వాటికా షాంపూ, ఫెమ్ స్కిన్‌కేర్, రెడ్ టూత్ పేస్టు, ఓడోనిల్ ఎయిర్ ఫ్రెషనర్స్, రియల్ జ్యూస్, హోం మేడ్ కుకింగ్ పేస్టులతో సహా అనేక ప్యాకేజీ బ్రాండ్లను విక్రయిస్తున్నసంగతి తెలిసిందే. -
క్రికెట్ యాడ్‌పై దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ‘మూర్ఖుడా, దద్దమ్మా, హాస్యము తెలియని వెర్రి వెంగలప్ప, అభిరుచి లేనివాడా! భిన్న సంస్కృతులు, భాషలు కలిగిన గొప్ప దేశం పట్ల గౌరవ లేకుండా క్రికెట్ పేరు మీద తప్పుడు జాతీయవాదాన్ని రుద్దుతున్నావు’ అంటూ ప్రముఖ బెంగాలీ చలనచిత్ర నిర్మాత సృజిత్ ముఖర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ‘బెంగాలీ సంస్కృతిని, రవీంద్రుడి కవిత్వాన్ని అవమానించడం అంటే అది కచ్చితంగా ఓ జాతి పట్ల విద్వేషం వెదజల్లడమే అవుతుంది’ అంటూ జర్నలిస్ట్ సౌమ్యజిత్ మజుందార్ విమర్శించారు. ‘నేనొక బెంగాలీని, బెంగాలీ సంస్కృతిని గౌరవిస్తాను. మా ఆత్మ అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వాన్ని అవమానించావు, మేము దేవుడికి నైవేద్యంగా పెట్టే తిలర్ నాడును అవమానించావు. ఇందుకు క్షమాపణలు చెప్పాలి’ అని మరొకరు, ‘బెంగాలీలు భారతీయులు కాదా, వేరుగా చూసినందుకు క్షమాణలు చెప్పాలి లేదా కోర్టుకు వెళతాం’ అని ఇంకొకరు, అసలు డాబర్ కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలన్న హాష్‌ట్యాగ్‌తో మరికొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు కురిపిస్తున్నారు. మంగళవారం జరిగిన భారత్–బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా టీవీల్లో ప్రసారమైన డాబర్ కంపెనీ ఇచ్చిన రెడ్పేస్ట్ యాడ్‌పై కొనసాగుతున్న రాద్ధాంతం ఇది. క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని డాబర్ కంపెనీ ఈ యాడ్‌ను రూపొందించింది. భారత్ ఏ దేశంతో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ దేశానికి చిహ్నమైన వంటకాన్ని టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఓ అభిమాని కసాపసా నమిలి మింగేస్తుంటే ‘సబ్కోఛాబాజాయెంగే (అందరిని నమిలేస్తాం)’ అన్న హాష్‌ట్యాగ్‌తో యాడ్ ప్రసారం అవుతోంది. అభిమాని పాత్రలో ప్రముఖ హాస్య నటుడు మనోజ్ పావువా నటించారు. మొన్న పాకిస్తాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ప్రసారం చేసిన యాడ్‌లో ‘వాల్నట్స్ (అక్రోట్ కాయలు)’ను మనోజ్ పరా పరా నమలడం కనిపించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘స్టిక్జా టొఫీ (చాక్లెట్ లాంటి స్వీటు),’ వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ‘కొబ్బరి గరిజలు’ తినడం కనిపించింది. నిన్న బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ జరిగినప్పుడు ‘తిలర్ నాడు (బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు)’ తినడం కనిపించింది. రవీంద్ర నాథ్ ఠాగూర్ రాసిన ‘బ్రిస్తీ పోర్ తపుర్, తుపర్ (చిటపట చినుకులు)’ కవితా పంక్తిని కూడా మనోజ్ వినిపించారు. బెంగాళీ హిందువులు దేవుళ్ల వద్ద ప్రసాదంగా ఎక్కువగా ఈ నువ్వుల ఉండలు పెడతారు. బంగ్లాదేశ్‌కు ప్రతీకగా తమ నువ్వుల ఉండలు చూపడమేమిటీ, ఠాగూర్ కవిత్వాన్ని ప్రస్తావించడం ఏమిటన్నది వారి ప్రశ్న. వాస్తవానికి బెంగాల్ సరిహద్దుకు ఆవల ఉన్న బంగ్లాదేశీయులు కూడా నువ్వుల ఉండలను ప్రీతిగా తింటారు. ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నువ్వుల ఉండలను ప్రజలు ఎక్కువగానే తింటారు. ప్రసాదంగా కూడా పెడతారు. ఠాగూర్‌ను బంగ్లా సరిహద్దు గ్రామాల ప్రజలు గౌరవిస్తారు. ఏదేతేనేమీ విమర్శలు వెల్లువెత్తడంతో డాబర్ కంపెనీ బేషరతుగా క్షమాపణలు చెప్పింది. ఈ యాడ్‌ను రూపొందించడంలో ఎలాంటి దురుద్దేశం లేదని, యాడ్‌లో అభ్యంతకరమైన భాగాన్ని తొలగిస్తున్నామని, ఎవరి మనుసులనైనా నొప్పించి ఉన్నట్లయితే అందుకు క్షంతవ్యులమంటూ వివరణ ఇచ్చింది. -
డాబర్ డైరెక్టర్‌పై ఈడీ కొరడా: నష్టాల్లో షేరు
సాక్షి, న్యూఢిల్లీ: డాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్కు చెందిన సుమారు 21 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో 20.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫారిన్ ఎక్స్చేంచ్ మేనేజ్మెంట్ (ఫెమా) చట్టంలోని 37ఏ ఉల్లంఘన కింద విదేశాల్లో ఆయనకు అక్రయ ఆస్తులు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది. డాబర్ సంస్థ డైరక్టర్ ప్రదీప్ విదేశాల్లో ఆయన పెట్టుబడులు ఉన్నట్లు గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో ఉంది. విదేశీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయంటూ ఇప్పటికే ఐటీశాఖ కూడా కేసు నమోదు చేసింది. డాబర్ సంస్థకు చెందిన కుటుంబీకుల్లో ప్రదీప్ ఒకరు. ప్రస్తుతం డాబర్ మార్కెట్ విలువ సుమారు రూ.37వేల కోట్ల ఉంటుందని అంచనా. జెనీవాకు చెందిన హెచ్ఎస్బీసీ జాబితాలో ఆయన పేర్లు ఉన్నాయి. అయితే విదేశీ అకౌంట్లు కలిగి ఉన్న కేసును 2011 నుంచి విచారణ జరుగుతున్న ఆ కేసులో ప్రదీప్ 8 కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో డాబర్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో షేరు 3శాతానికి పై గా నష్టపోయింది. -
డాబర్ ఇండియా లాభం రూ.397 కోట్లు
న్యూఢిల్లీ: ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం డాబర్ ఇండియా నాలుగో త్రైమాసిక కాలంలో రూ.397 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం రూ.334 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించింది. అమ్మకాలు పటిష్టంగా ఉండడం, నిర్వహణ మార్జిన్ మెరుగుపడటంతో ఈ స్థాయి లాభం సాధించామని డాబర్ ఇండియా సీఈఓ సునీల్ దుగ్గల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.1,980 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.2,106 కోట్లకు పెరిగింది. ఒక్కో షేర్‌కు రూ.6.25 డివిడెండ్‌ను ప్రకటించారు. దీంట్లో రూ. 5 ప్రత్యేక డిమాండ్, రూ.1.25 తుది డివిడెండ్ కలగలసి ఉన్నాయి. కాగా, అంతర్జాతీయ అమ్మకాలు 17 శాతం ఎగిశాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,280 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధితో రూ.1,358 కోట్లకు పెరిగిందని సునీల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.రూ.8,000 కోట్ల నుంచి రూ.8,054 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.