న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం డాబర్ ఇండియా నాలుగో త్రైమాసిక కాలంలో రూ.397 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో సాధించిన నికర లాభం రూ.334 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించింది. అమ్మకాలు పటిష్టంగా ఉండడం, నిర్వహణ మార్జిన్ మెరుగుపడటంతో ఈ స్థాయి లాభం సాధించామని డాబర్ ఇండియా సీఈఓ సునీల్ దుగ్గల్ చెప్పారు.
మొత్తం ఆదాయం రూ.1,980 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.2,106 కోట్లకు పెరిగింది. ఒక్కో షేర్‌కు రూ.6.25 డివిడెండ్‌ను ప్రకటించారు. దీంట్లో రూ. 5 ప్రత్యేక డిమాండ్, రూ.1.25 తుది డివిడెండ్ కలగలసి ఉన్నాయి. కాగా, అంతర్జాతీయ అమ్మకాలు 17 శాతం ఎగిశాయి. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.1,280 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధితో రూ.1,358 కోట్లకు పెరిగిందని సునీల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.రూ.8,000 కోట్ల నుంచి రూ.8,054 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment