ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తులను తయారు చేస్తున్న ప్రముఖ కంపెనీ డాబర్ తమిళనాడులోని ‘సిప్‌కాట్ ఫుడ్ పార్క్’లో తయారీ యూనిట్ ప్రారంభించనుంది. ఈ యూనిట్ నిర్మాణానికిగాను డాబర్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో కంపెనీకి ఈ ప్లాంట్ మొదటిది కావడం విశేషం.
కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తయారీ యూనిట్ కోసం రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకుంది. మొదటిదశ పనుల కోసం రూ.135 కోట్లు వెచ్చించనుంది. విల్లుపురం జిల్లా తిండివనంలోని సిప్‌కాట్ ఫుడ్ పార్క్‌లో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా వివరాల వెల్లడించారు.
Welcome to Tamil Nadu, @DaburIndia!
In fact, welcome to South India!
In the presence of Honourable @CMOTamilNadu Thiru. @MKStalin avargal, @Guidance_TN today signed an MoU with Dabur for the establishment of a world-class manufacturing plant, their FIRST EVER in South India,… pic.twitter.com/1rAazmCVOH— Dr. T R B Rajaa (@TRBRajaa) August 22, 2024
‘కన్జూమర్ గూడ్స్ కంపెనీ డాబర్ తమిళనాడులో ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ ప్లాంట్ కంపెనీకి దక్షిణాదిలో మొదటిది కావడం విశేషం. దీని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. మొదటిదశలో రూ.135 కోట్లు పెట్టుబడి పెడుతుంది. దీనివల్ల సుమారు 250 మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ప్లాంట్‌లో హోమ్‌కేర్, పర్సనల్ కేర్, జ్యూస్ ఉత్పత్తులను తయారు చేస్తారు. దీంతో స్థానిక రైతులకు మేలు జరుగుతుంది’ అని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment