డాబర్ ఉత్పత్తులు (పాత పోటో)
సాక్షి, న్యూఢిల్లీ: డాబర్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సంస్థ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్‌కు చెందిన సుమారు 21 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. అక్రమ ఆస్తుల కేసులో 20.87 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఫారిన్ ఎక్స్చేంచ్ మేనేజ్‌మెంట్ (ఫెమా) చట్టంలోని 37ఏ ఉల్లంఘన కింద విదేశాల్లో ఆయనకు అక్రయ ఆస్తులు ఉన్నాయని ఈడీ ఆరోపిస్తోంది.
డాబర్ సంస్థ డైరక్టర్ ప్రదీప్ విదేశాల్లో ఆయన పెట్టుబడులు ఉన్నట్లు గతంలో సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన నల్లకుబేరుల జాబితాలో ఉంది. విదేశీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయంటూ ఇప్పటికే ఐటీశాఖ కూడా కేసు నమోదు చేసింది. డాబర్ సంస్థకు చెందిన కుటుంబీకుల్లో ప్రదీప్ ఒకరు. ప్రస్తుతం డాబర్ మార్కెట్ విలువ సుమారు రూ.37వేల కోట్ల ఉంటుందని అంచనా. జెనీవాకు చెందిన హెచ్‌ఎస్‌బీసీ జాబితాలో ఆయన పేర్లు ఉన్నాయి. అయితే విదేశీ అకౌంట్లు కలిగి ఉన్న కేసును 2011 నుంచి విచారణ జరుగుతున్న ఆ కేసులో ప్రదీప్ 8 కోట్ల రూపాయల జరిమానా కూడా చెల్లించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో డాబర్ కౌంటర్‌లో అమ్మకాలకు తెరలేచింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో షేరు 3శాతానికి పై గా నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment