సాక్షి, ముంబై: ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం డాబర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పదవికి అమిత్ బర్మన్ రాజీనామా చేశారు. నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న మోహిత్ బర్మన్‌ను 5 సంవత్సరాల కాలానికి బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో పాటు బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్‌గా సాకేత్ బర్మన్‌ను నియమిస్తున్నట్లు చెప్పింది. అయితే బర్మన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
డాబర్ ఛైర్మన్ అమిత్ బర్మన్ తన బాధ్యతల నుండి వైదొలిగినట్లు కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్ ద్వారా తెలిపింది. ఆగష్టు 10 నుంచే ఆయన రాజీనామా అమలులోకి వచ్చిందని, దీన్ని డైరెక్టర్ల బోర్డు ఆమోదించిందని ప్రకటించింది. అమిత్ బర్మన్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలను కొనసాగిస్తారని తెలిపింది. (ఫెస్టివ్ సీజన్: పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్ బొనాంజా)
1999లో డాబర్ ఫుడ్స్ బాధ్యతలు స్వీకరించిన అమిత్ అనేక రకాల పొడులు, చట్నీలు ప్యాకేజ్డ్ ఫుడ్ జ్యూస్‌లతో ఫుడ్స్ వ్యాపారాన్ని పరిచయం చేశారు. అయితే 2007లో డాబర్ ఇండియాలో కంపెనీ విలీనం కావడంతో ఆయన డాబర్ ఫుడ్స్ సీఈవో పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత డాబర్ ఇండియా లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. (సంచలన నిర్ణయం: ఐకానిక్ బేబీ పౌడర్‌కు గుడ్‌బై)
2019లో డాబర్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ, కొలంబియా విశ్వవిద్యాలయంలో ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్సీ చేశారు. డాబర్‌లో చేరడానికి ముందు, మాన్యుఫ్యాక్చరింగ్ స్ట్రాటజీ విభాగంలో కోల్‌గేట్ పామోలివ్‌తో కలిసి పనిచేశారు. 1990లో అతను టిష్కాన్ కార్పొరేషన్ న్యూయార్క్‌లో కూడా శిక్షణ పొందారు అమిత్.
Comments
Please login to add a commentAdd a comment