న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియా ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలని అనుకుంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ విభాగం నుంచి రూ.5,000 కోట్ల టర్నోవర్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. అలాగే హోమ్, పర్సనల్ కేర్ విభాగాల నుంచి ఆదాయాన్ని 5–7 ఏళ్లలో రూ.7,000 కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. హెల్త్ కేర్, హోమ్, పర్సనల్ కేర్‌తో కూడిన కన్జ్యూమర్ కేర్ విభాగం నుంచి డాబర్‌కు అధిక ఆదాయం వస్తుండడాన్ని గమనించొచ్చు.
2022–23 మొత్తం ఆదాయం రూ.11,530 కోట్లలో ఈ విభాగం నుంచి 56.2 శాతం లభించింది. హెర్బల్, ఆయుర్వేదిక్ ఉత్పత్తుల అమ్మకాలు తలసరి ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతాయని డాబర్ ఇండియా అంచనా వేస్తోంది. ఎగువ మధ్యతరగతి జనాభా పెరుగుదలతో ప్రయోజనం పొందే ప్రీమియం బ్రాండ్లు కూడా డాబర్ పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్టు సంస్థ సీఈవో మోహిత్ మల్హోత్రా తెలిపారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో లో యూనిట్ ప్యాక్‌ల (ఎల్‌యూపీ) అమ్మకాలు సైతం పెరుగుతాయనే అంచనాతో ఉన్నట్టు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మందికి చేరుకునే విధంగా ఎల్‌యూపీల పోర్ట్‌ఫోలియో పెంచుతామని పేర్కొన్నారు.
ఫుడ్, బెవరేజెస్ విభాగంలో ప్రస్తుత ఉత్పత్తుల విభాగాలను విస్తరిస్తూనే, నూతన విభాగాల్లోకి ప్రవేశించనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం రియల్ పేరుతో జ్యూస్‌ల విభాగంలో డాబర్ తగినంత మార్కెట్ వాటా సంపాదించం గమనార్హం. రియల్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ప్రయతి్నస్తున్నట్టు మల్హోత్రా తెలిపారు. బాద్షా మసాలాను అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. డాబర్ గతేడాదే బాద్షా మసాలను రూ.587 కోట్లకు సొంతం చేసుకుంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసుకునే ప్రణాళికతో ఉన్నట్టు మల్హోత్రా తెలిపారు. గులాబరి బ్రాండ్‌పై బాడీవా‹Ù, సబ్బులను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment