న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దేశీయ దిగ్గజం డాబర్ ఇండియా రెండో త్రైమాసిక కాలంలో రూ.404 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని డాబర్ ఇండియా తెలిపింది. పెట్టుబడుల విలువకు సంబంధించి రూ.40 కోట్ల వన్‌టైమ్ ఇంపెయిర్‌మెంట్ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని వివరించింది.
140 శాతం మధ్యంతర డివిడెండ్...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.40 మధ్యంతర డివిడెండ్ (140 శాతం) ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. పన్నులతో కలుపుకొని మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.298 కోట్లకు చేరతాయి.
డాబర్ ఆదాయం రూ.2,212 కోట్లు
Published Wed, Nov 6 2019 5:40 AM | Last Updated on Wed, Nov 6 2019 5:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment