
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 3 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.1,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,052 కోట్లకు తగ్గిందని హెచ్‌పీసీఎల్ తెలిపింది. రిఫైనరీ మార్జిన్లు సగం తగ్గడం, ఇన్వెంటరీ లాభాలు కూడా భారీగా తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని కంపెనీ సీఎమ్‌డీ ఎమ్.కె. సురానా వివరించారు.
బీఎస్–సిక్స్ పర్యావరణ నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయని చెప్పారు. అప్పటికల్లా బీఎస్–సిక్స్ నిబంధనలకు అనుగుణ్యమైన ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆ మేరకు తమ రిఫైనరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment