![Ashok Leyland Q2 Profit Declines By 93 Per Cent - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/9/lorry.gif.webp?itok=8-bk7KaI)
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment