Ashok Leyland Company
-
భారత సైన్యానికి అశోక్ లేలాండ్ వాహనాలు - ఆర్డర్ ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీ దిగ్గజం అశోక్ లేలాండ్ తాజాగా భారత సైన్యం నుంచి రూ.800 కోట్ల ఆర్డర్‌ను చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా భారత సైన్యానికి ఫీల్డ్ ఆర్టిలరీ ట్రాక్టర్, గన్ టోయింగ్ వెహికిల్స్‌ను అశోక్ లేలాండ్ సరఫరా చేస్తుంది. 12 నెలల్లో వీటిని డెలివరీ చేస్తామని కంపెనీ ఎండీ, సీఈవో శేణు అగర్వాల్ తెలిపారు. డిఫెన్స్ వ్యాపారం కంపెనీ వృద్ధికి బలమైన స్తంభంగా నిలిచిందని చెప్పారు. ఈ డీల్‌తో డిఫెన్స్ మొబిలిటీ వెహికల్స్ వ్యాపారంలో సంస్థ నాయకత్వాన్ని మరింత స్థిరపరుస్తుందని అన్నారు. -
తెలంగాణ ఆర్టీసీ స్లీపర్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ తొలిసారి ప్రీమియం కేటగిరీ స్లీపర్ బస్సులను ప్రారంభిస్తోంది. లహరి పేరుతో రోడ్డెక్కుతున్న ఈ బస్సుల్లో తొలుత 10 సర్వీసులను సోమవారం ఉదయం ప్రారంభిస్తోంది. మరో ఆరు బస్సులను రెండు మూడు రోజుల్లో నడపనున్నారు. ఇప్పటికే అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న సర్వీసులతో పాటు సొంతంగా కొన్న బస్సులను ప్రారంభిస్తోంది. టెండర్ ద్వారా అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఈ బస్సులను కొన్నారు. ఈ స్లీపర్ బస్సులను తొలుత హైదరాబాద్ నుంచి ఐదు నగరాలకు తిప్పనున్నారు. మియాపూర్, ఎంజీబీఎస్ల నుంచి బెంగళూరుకు, హుబ్లీకి, బీహెచ్ఈఎల్, ఎంజీబీఎస్ల నుంచి విశాఖపట్నం, తిరుపతి, చెన్నైలకు నడుపుతారు. గరుడ ప్లస్ కంటే ఈ బస్సుల్లో టికెట్ ధర 30 శాతం వరకు ఎక్కువగా ఉండనుంది. రైలు మూడో ఏసీ శ్రేణి టికెట్ ధరకు ఇంచుమించు సమంగా వీటి టికెట్ ధరలను ఖరారు చేశారు. లహరి స్లీపర్ బస్సుల్లో 30 బెర్తులు ఉంటాయి. మంచినీటి సీసా హోల్డర్, మొబైల్ చార్జింగ్ సాకెట్‌తోపాటు ఉచిత వైఫై వసతి ఉంటుంది. ఈ బస్సుల్లో మూడు సీసీ కెమెరాలు, పానిక్ బటన్, రేర్ వ్యూ కెమెరా, ఎల్ఈడీ సూచిక బోర్డులుంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్.. ఈ కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్న సందర్భంగా తొలుత కొన్ని రోజుల పాటు టికెట్ ధరల్లో తగ్గింపును అమలు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో 20 శాతం, ఇతర రూట్లలో తిరిగే బస్సుల్లో 15 శాతం మేర టికెట్ ధరలను తగ్గించనున్నారు. డైనమిక్ ఫేర్ విధానం ప్రారంభం.. డైనమిక్ టికెట్ ఫేర్ విధానాన్ని కూడా సోమవారం నుంచే ఆర్టీసీ ప్రారంభిస్తోంది. తొలిసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తరహాలో డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను సవరిస్తారు. డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో టికెట్ ధర ఎక్కువగా, డిమాండ్ లేని సమయాల్లో తక్కువగా ఉంటుంది. గరిష్టంగా 25 శాతానికి మించకుండా పెంచుతారు, కనిష్టంగా 20 శాతానికి తగ్గకుండా ధరలు తగ్గిస్తారు. తనంతట తానుగా పరిస్థితి ఆధారంగా సిస్టమే ధరలను మార్చుకునే సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ఇందుకు ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ డెవలపింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల కసరత్తు తర్వాత ఆ విధానం సిద్ధం కావటంతో సోమవారం నుంచి దాన్ని ప్రారంభిస్తున్నారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్ ధరలు ఇక గంటగంటకు మారనున్నాయి. లహరి స్లీపర్ సర్వీసుల్లో కూడా ఇదే విధానం అమలుకానుంది. -
పెరిగిన అశోక్ లేలాండ్ అమ్మకాలు
ముంబై: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ మొత్తం దేశీయ, ఎగుమతి అమ్మకాలు నవంబర్‌లో 5 శాతం పెరిగి 10,569 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది నవంబర్‌లో 10,175 అమ్మకాలు జరగ్గా, అది ఈ ఏడాది నవంబర్‌లో ఐదు శాతం పెరగడం విశేషం. వార్షిక లాభాల్లో 32 శాతం పెరుగులదలను అశోక్ లేలాండ్ నమోదు చేసింది. నవంబర్ నెలలో అశోక్ లేలాండ్ ట్రక్ అమ్మకాలు 23 శాతం పెరిగి 4,238 యూనిట్లకు చేరుకోగా ,బస్సు అమ్మకాలు 90 శాతం తగ్గి 184 యూనిట్లకు చేరుకున్నాయి. అశోక్ లేలాండ్ షేర్లు 0.05 శాతం పెరిగి 92.15 కు చేరుకున్నాయి. -
భారత్ ఫోర్జ్- అశోక్ లేలాండ్.. యమస్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ కౌంటర్‌కు భారీ డిమాండ్ నెలకొంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినప్పటికీ ఆటో రంగ దిగ్గజం అశోక్ లేలాండ్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్లకు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం.. భారత్ ఫోర్జ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో భారత్ ఫోర్జ్ రూ. 127 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 172 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2373 కోట్ల నుంచి రూ. 1199 కోట్లకు బలహీనపడింది. ఇటీవల దేశ, విదేశీ మార్కెట్లలో స్వల్ప రికవరీ పరిస్థితులు కనిపిస్తున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం దూసుకెళ్లి రూ. 482 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 490 వరకూ ఎగసింది. అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్- జూన్)లో అశోక్ లేలాండ్ రూ. 389 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 275 కోట్ల నికర లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 6588 కోట్ల నుంచి రూ. 1486 కోట్లకు భారీగా క్షీణించింది. అయితే ఇటీవల డిమాండ్ బలపడుతున్నదని, దీంతో క్యూ2, క్యూ3లో అమ్మకాలు పెరిగే వీలున్నదని కంపెనీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 11 శాతం జంప్‌చేసి రూ. 60 వద్ద ట్రేడవుతోంది. -
అశోక్ లేలాండ్ లాభం 93 శాతం డౌన్
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆరి్థక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్లో 93 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.39 కోట్లకు తగ్గిందని అశోక్ లేలాండ్ తెలిపింది. ఆదాయం రూ.7,621 కోట్ల నుంచి 48 శాతం తగ్గి రూ.3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూ2లో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8 శాతం నిర్వహణ లాభ మార్జిన్ సాధించామని తెలిపారు. -
సగానికి తగ్గిన అశోక్ లేలాండ్ లాభం
చెన్నై: హిందుజా గ్రూప్ ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో రూ.275 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.467 కోట్ల నికర లాభం వచ్చిందని అశోక్ లేలాండ్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,194 కోట్ల నుంచి రూ.6,612 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామ న్నారు. 4 శాతం పెరిగిన మార్కెట్ వాటా.. వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్ వెల్లడించారు. తేలిక రకం వాణిజ్య వాహనాల విక్రయాలు 12 శాతం పెరిగాయని వివరించారు. భారత్ స్టేజ్ సిక్స్ వాహనాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్సీడీలు, బాండ్ల జారీ ద్వారా రూ.600 కోట్లు సమీకరించనున్నామని చెప్పారు. -
అశోక్ లేలాండ్‌పై ఆగ్రహం
అనంతపురం ,రాప్తాడు: అశోక్ లేలాండ్ కంపెనీ సేవల్లో జాప్యం కారణంగా పచ్చి సరుకు లోడుతో బయల్దేరిన లారీ సకాలంలో గమ్యానికి చేరుకోలేదు. దీంతో సరుకు నష్టాన్ని లారీ యజమానే చెల్లించాలని వ్యాపారి అల్టిమేటం జారీ చేశాడు. సరుకు దెబ్బతిని నష్టం జరగడానికి కారణమైన అశోక్ లేలాండ్ వారే పరిహారం చెల్లించాలని కోరుతూ లారీ అసోసియేషన్ నాయకులు బుధవారం ఉదయం రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి సమీపాన గల అశోక్ లేల్యాండ్ మ్యానుఫ్యాక్చరర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం కోలార్‌కు చెందిన జావీద్ రూ.10 లక్షల విలువ చేసే టమాటాలను కోలార్ నుంచి ఒడిషా రాష్ట్రం బరగాడు తీసుకెళ్లేందుకు అనంతపురానికి చెందిన లారీ ఓనర్ నీలకంఠంకు చెందిన 14 చక్రాల అశోక్ లేలాండ్ లారీ (ఏపీ02 టిహెచ్ 3399)ని బాడుగకు మాట్లాడుకున్నారన్నారు. ఈ నెల 29న సోమవారం సాయంత్రం 4 గంటలకు బయల్దేరారని తెలిపారు. లారీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నాగపూర్ సమీపంలోని లింగన గాట్ దగ్గరకు రాగానే ఎలక్ట్రికల్ సమస్యతో నిలిచిపోయిందని పేర్కొన్నారు. రిపేరీ విషయంలో అంతులేని జాప్యం అశోక్ లేలాండ్ టోల్ ఫ్రీ నంబర్‌తో పాటు రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి దగ్గర ఉన్న అశోక్ లేలాండ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అనంతపురం, కర్నూలు మేనేజర్లు వరదారాజులు, ముక్తార్‌కు సమాచారం ఇచ్చామన్నారు. లారీ నిలిచిపోయిన ప్రదేశానికి 50 కిలో మీటర్ల దూరంలోనే అశోక్ లేలాండ్ కార్యాలయం అందుబాటులో ఉన్నా అధికారులు స్పందించలేదన్నారు. లారీ నిలిచిపోయిందని ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే సిబ్బంది వచ్చి రిపేరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. లారీ రిపేరీ కాదని సిబ్బంది చెప్పి ఉంటే లారీలో ఉన్న పచ్చి సరుకు టమాటాలను మరొక లారీ ద్వారానైనా బరగాడుకు చేర్చేవారమని అన్నారు. 25 గంటలకు స్పందించిన సిబ్బంది లారీ ఆగిపోయిందని సమాచారం ఇచ్చిన 25 గంటల తర్వాత సిబ్బంది స్పందించారు. వారు లారీ దగ్గరకు వచ్చే సరికి టమాటాలన్నీ చెడిపోయాయని తెలిపారు. దీంతో కోలార్ వ్యాపారి జావీద్ టమాటాలు చెడిపోయినందున తనకు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని, ఆ మొత్తాన్ని చెల్లించాలని లారీ ఓనర్ నీలకంఠంపై ఒత్తిడి తెచ్చాడన్నారు. తాము ఫిర్యాదు చేసిన వెంటనే అశోక్ లేలాండ్ సిబ్బంది 4 గంటల్లో వచ్చి సమస్యను పరిష్కరించి ఉంటే సరుకు పాడయ్యేది కాదన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఆలస్యమై సరుకు దెబ్బతినిందని, నష్టపరిహారం కింద అశోక్ లేలాండ్ అధికారులే చెల్లించాలని లారీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. రోజుకు రూ.5వేల నుంచి రూ.15వేలు బాడుగలకు వెళ్లే లారీ ఓనర్లు రూ.10లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. అశోక్ లేలాండ్ అధికారులు డబ్బు చెల్లించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. సాయంత్రమైనా అధికారులెవరూ స్పందించలేదు. ఎస్ఐ ఆంజనేయులు తమ సిబ్బందితో వచ్చి చర్చించి ధర్నా విరమించాలని కోరితే నాయకులు ఒప్పుకోలేదు. ఆందోళనను అలాగే కొనసాగించారు. కార్యక్రమంలో లారీ అసోసియేషన్ నాయకులు అమర్నాథ్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, మల్లి, నారాయణ, రామలింగారెడ్డి, రామ్మోహన్, రామాంజనేయ రెడ్డి, లక్ష్మినారాయణ, క్రిష్ణానాయక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అశోక్ లేలాండ్ ప్లాంట్ తాత్కాలిక మూసివేత
సాక్షి, ముంబై : దేశీయ మూడవ అతిపెద్ద వాణజ్య వాహనాల సంస్థ ఆశోక్ లేలాండ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. డిమాండ్ క్షీణించినందున ఉత్తరాఖండ్‌లోని పంతన్‌నగర్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హిందుజా గ్రూప్ దిగ్గజం అశోక్ లేలాండ్ మంగళవారం పేర్కొంది. ఈ నెల 16 నుంచి 24 వరకూ (తొమ్మిది రోజులు )పంత్నగర్ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు నష్టాల్లో (4 శాతం) ట్రేడవుతోంది. కాగా గతంలో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి లాంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాంట్లను మే- జూన్ మధ్య మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా వాణిజ్య వాహనాల రంగం గత కొన్ని నెలలుగా డిమాండ్ పడిపోతోంది. జూన్ వాహనాల అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదు చేసాయి. కార్లు, ఎస్‌యూవీలు, ఎంయువిలు మరియు వ్యాన్ల అమ్మకాలు వరుసగా ఎనిమిది నెలలు క్షీణించాయి. . -
వచ్చే ఏడాది అశోక్ లేలాండ్ ఎలక్ట్రిక్ బస్సులు
* ఒక్క చార్జింగ్‌తో 200 కి.మీ.ప్రయాణం * బస్సు ఖరీదు రూ. 2-3 కోట్లు చెన్నై: అశోక్ లేలాండ్ కంపెనీ వచ్చే ఏడాది మొదట్లో ఆప్టేర్ ఎలక్ట్రిక్ బస్సులను భారత్‌లో ప్రవేశప్టెట్టనుంది. ఇంగ్లండ్‌లో ఈ బస్సులు విజయవంతంగా నడుస్తుండటంతో భారత్‌లో కూడా వీటిని అందించనున్నామని అశోక్ లేలాండ్ ఎండీ వినోద్ కె. దాసరి చెప్పారు. ఇంజిన్ ఉండని ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ బస్సులకు సంబంధించి అంతర్జాతీయ అగ్రగామి సంస్థల్లో అప్‌టరే ఒకటని దాసరి వివరించారు. వచ్చే ఏడాది నుంచి వీటిని భారత్‌లో తయారు చేయడం ప్రారంభిస్తామని, ఢిల్లీల్లో వచ్చే ఏడాది జనవరి 22న జరిగే బస్ ఎక్స్‌పోలో వీటిని ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిమీ. నడుస్తాయని, ఒక్కో బస్సు ఖరీదు రూ.2-3 కోట్లు ఉంటుందని తెలిపారు. అశోక్ లేలాండ్ బ్యాడ్జ్ కిందనే ఈ ఎలక్ట్రిక్ బస్సులను విక్రయిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ఆప్‌టరేలో సోలో, వెర్సా మెడళ్లను భారత్‌లో తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల కోసమే వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఈ బస్సుల్లో ఎలక్ట్రిక్ మోటార్లు, బ్యాటరీలు ఉంటాయని, ఇంజిన్లు ఉండవని, హైబ్రిడ్ వేరియంట్లో చిన్న డీజిల్ ఇంజిన్ ఉంటుందని తెలిపారు. మార్కెట్ చిన్నదే... అయితే భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ చిన్నదని దాసరి వివరించారు. 20 ఏళ్ల క్రితమే సీఎన్జీ బస్సులను మార్కెట్లోకి తెచ్చామని, అయితే వాటికి ఇప్పటికీ మార్కెట్ లేదన్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బస్సులపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే ఇంగ్లాండ్‌కు చెందిన ఆప్టేర్ పీఎల్సీ కంపెనీలో హిందూజా గ్రూప్‌నకు మెజారిటీ వాటా ఉంది.