![Ashok Leyland announced Uttarakhand plant shutdown tempararely - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/16/ashok%20leyland.jpg.webp?itok=J7XhvAoG)
సాక్షి, ముంబై : దేశీయ మూడవ అతిపెద్ద వాణజ్య వాహనాల సంస్థ ఆశోక్ లేలాండ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. డిమాండ్ క్షీణించినందున ఉత్తరాఖండ్‌లోని పంతన్‌నగర్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హిందుజా గ్రూప్ దిగ్గజం అశోక్ లేలాండ్ మంగళవారం పేర్కొంది. ఈ నెల 16 నుంచి 24 వరకూ (తొమ్మిది రోజులు )పంత్‌నగర్ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు నష్టాల్లో (4 శాతం) ట్రేడవుతోంది.
కాగా గతంలో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి లాంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాంట్లను మే- జూన్ మధ్య మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా వాణిజ్య వాహనాల రంగం గత కొన్ని నెలలుగా డిమాండ్ పడిపోతోంది. జూన్ వాహనాల అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదు చేసాయి. కార్లు, ఎస్‌యూవీలు, ఎంయువిలు మరియు వ్యాన్‌ల అమ్మకాలు వరుసగా ఎనిమిది నెలలు క్షీణించాయి.
.
Comments
Please login to add a commentAdd a comment