weak demand
-
బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్’
న్యూఢిల్లీ: బేకరీ ఫుడ్ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం నీరసించి రూ. 532 కోట్లకు పరిమితమైంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా కన్జూమర్ డిమాండ్ మందగించడం ప్రభావం చూపింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 587 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 4,566 కోట్లను దాటాయి. గుడ్డే, మేరీ గోల్డ్, న్యూట్రిచాయిస్ తదితర బ్రాండ్ల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా బలపడి రూ. 4,714 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 3,995 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బ్రిటానియా షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై ,425 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ ప్లాంట్ తాత్కాలిక మూసివేత
సాక్షి, ముంబై : దేశీయ మూడవ అతిపెద్ద వాణజ్య వాహనాల సంస్థ ఆశోక్ లేలాండ్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. డిమాండ్ క్షీణించినందున ఉత్తరాఖండ్‌లోని పంతన్‌నగర్ ప్లాంటును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు హిందుజా గ్రూప్ దిగ్గజం అశోక్ లేలాండ్ మంగళవారం పేర్కొంది. ఈ నెల 16 నుంచి 24 వరకూ (తొమ్మిది రోజులు )పంత్నగర్ ప్లాంటులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అశోక్ లేలాండ్ షేరు నష్టాల్లో (4 శాతం) ట్రేడవుతోంది. కాగా గతంలో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి లాంటి దిగ్గజ సంస్థలు తమ ప్లాంట్లను మే- జూన్ మధ్య మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయంగా వాణిజ్య వాహనాల రంగం గత కొన్ని నెలలుగా డిమాండ్ పడిపోతోంది. జూన్ వాహనాల అమ్మకాలు రెండంకెల క్షీణతను నమోదు చేసాయి. కార్లు, ఎస్‌యూవీలు, ఎంయువిలు మరియు వ్యాన్ల అమ్మకాలు వరుసగా ఎనిమిది నెలలు క్షీణించాయి. . -
11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం
-
11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం
న్యూఢిల్లీ: అంతకంతకూ దిగి వస్తున్న బంగారం ధరలు సోమవారం మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 250 క్షీణించి రూ. 27,550 దగ్గర 11నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎనలిస్టులు సూచనలు, నగల దుకాణదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ క్షీణతను నమోదు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక మార్కెట్ లో స్పాట్ గోల్డ్ 99.9fశాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారంరూ. 250 to Rs 27,550 వద్ద, 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారం రూ. 250 నీరసించి రూ. 27,400వద్ద ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 4 నాటి రూ. 27,575 ముగింపు తో పోలిస్తే ఇదే కనిష్టం. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు రూ.27 వేలకు దిగువన బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర సోమవారం రూ.25 పతనమై పది గ్రా. రూ.26,960 పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.. కిలో వెండి ధర రూ.210 నీరసించి రూ.38,600 దగ్గరుంది. అటు పరిశ్రమలు, ఇటు నాణేల తయారీదారుల నుంచి తగ్గిన డిమాండ్ వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. నోట్ల కష్టాలు, జ్యువెల్లర్స్, రిటైల్ వ్యాపారులనుండి గణనీయంగా తగ్గిన డిమాండ్ కారణంగా విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెంచుతున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు సింగపూర్ మార్కెట్ సెలవు కారణంగా ఇన్వెస్టర్లలో స్తబ్దదత నెలకొంది.