11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం
న్యూఢిల్లీ: అంతకంతకూ దిగి వస్తున్న బంగారం ధరలు సోమవారం మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 250 క్షీణించి రూ. 27,550 దగ్గర 11నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎనలిస్టులు సూచనలు, నగల దుకాణదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ క్షీణతను నమోదు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.
స్థానిక మార్కెట్ లో స్పాట్ గోల్డ్ 99.9fశాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారంరూ. 250 to Rs 27,550 వద్ద, 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారం రూ. 250 నీరసించి రూ. 27,400వద్ద ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 4 నాటి రూ. 27,575 ముగింపు తో పోలిస్తే ఇదే కనిష్టం. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు రూ.27 వేలకు దిగువన బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర సోమవారం రూ.25 పతనమై పది గ్రా. రూ.26,960 పలుకుతోంది.
అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.. కిలో వెండి ధర రూ.210 నీరసించి రూ.38,600 దగ్గరుంది. అటు పరిశ్రమలు, ఇటు నాణేల తయారీదారుల నుంచి తగ్గిన డిమాండ్ వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. నోట్ల కష్టాలు, జ్యువెల్లర్స్, రిటైల్ వ్యాపారులనుండి గణనీయంగా తగ్గిన డిమాండ్ కారణంగా విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెంచుతున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు సింగపూర్ మార్కెట్ సెలవు కారణంగా ఇన్వెస్టర్లలో స్తబ్దదత నెలకొంది.