వావ్ వన్ ప్లస్ 3
మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ....6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమెరీ, డ్యాష్ చార్జింగ్ తో వన్ ప్లస్ 3 వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్, తన తర్వాతి తరం స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి మంగళవారం అర్థరాత్రి ఆవిష్కరించింది. దీని ధర రూ.27,999గా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ కోసం వినియోగదారులు వేచి చూడకుండా నేటి నుంచే ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ ఇండియాలో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం గ్రాఫిక్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని, కొద్దికాలం అనంతరం సాప్ట్ గోల్డ్ వేరియంట్ ను మార్కెట్లోకి వస్తుందని చెప్పింది.
వన్ ప్లస్ 3 ఫీచర్లు...
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్ఓసీ
6జీబీ ర్యామ్
64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో
డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్(నానో సిమ్ కార్డులు)
5.5 అంగుళాల డిస్ ప్లే అండ్ ఫుల్ హెచ్డీ రెసుల్యూషన్
ఆప్టిక్ అమోలెడ్ డిస్ ప్లే విత్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఫింగర్ ప్రింట్ సెన్సార్
16 ఎంపీ వెనుక కెమెరా(సోనీ ఐఎమ్ఎక్స్ 298)
8 ఎంపీ ముందు కెమెరా
4జీ ఎల్టీఈ సపోర్ట్
3,000 ఎంఏహెచ్ లిథియం పోలిమర్ బ్యాటరీ