రియల్‌మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్‌ ఛేంజింగ్‌ ఫీచర్‌తో.. | Realme 14 Pro and Pro Plus 5G launched in India | Sakshi
Sakshi News home page

రియల్‌మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్‌ ఛేంజింగ్‌ ఫీచర్‌తో..

Published Thu, Jan 16 2025 5:10 PM | Last Updated on Thu, Jan 16 2025 5:19 PM

Realme 14 Pro and Pro Plus 5G launched in India

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌మీ 14 సిరీస్‌లో రెండు కొత్త మోడల్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. రియల్‌మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్‌మీ 14 ప్రో ప్లస్‌ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్‌ మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్‌ చేంజింగ్‌ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి.

రియల్‌మీ 14 ప్రో ప్లస్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌3 (Snapdragon 7s Gen 3) చిప్‌సెట్‌తో నడుస్తుంది. ఇక రియల్‌మీ 14 ప్రోలో మీడియాటెక్‌ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్‌మీ 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్‌సెట్‌లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.

ధరలివే..
భారత్‌లో రియల్‌మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్‌కు రూ.24,999, 8GB+256GB వేరియంట్‌కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇక రియల్‌మీ 14 ప్రో ప్లస్‌ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.

ఈ ఫోన్‌ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్‌లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్‌మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.

రియల్‌మీ 14 ప్రో ప్లస్‌ 5G స్పెసిఫికేషన్‌లు
⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్‌, 1500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్‌) AMOLED డిస్‌ప్లే.

⇒ స్నాప్‌డ్రాగన్ 7S జెన్‌ 3 చిప్‌సెట్‌

⇒ గరిష్టంగా 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌

⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ

⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీ

రియల్‌మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్
⇒ వనిల్లా మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్‌ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్‌ప్లే

⇒ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌

⇒ GB ర్యామ్‌, 256GB వరకు స్టోరేజ్‌

⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్‌ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

హై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్‌లు

ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ

కలర్‌ చేంజింగ్‌ ఫీచర్‌
ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్‌మీ 14 ప్రో ప్లస్‌ 5G, రియల్‌మీ 14 ప్రో ‌5G ఫోన్లలో పెరల్‌ వైట్‌ వేరియంట్‌లలో రియల్‌మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement