హోండా కొత్త బైక్‌.. మార్కెట్‌లోకి ఎన్‌ఎక్స్‌200 | Honda NX200 Launched In India, Check Price And Special Features Inside | Sakshi
Sakshi News home page

Honda NX200 India Launch: హోండా కొత్త బైక్‌.. మార్కెట్‌లోకి ఎన్‌ఎక్స్‌200

Published Fri, Feb 14 2025 9:50 PM | Last Updated on Sat, Feb 15 2025 9:15 AM

Honda NX200 launched in India Price And Features

దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్‌లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్‌ఎక్స్‌ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్‌ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్‌ఎక్స్‌ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్‌.

ఈ కొత్త చేరికతో హోండా భారత్‌లో విక్రయించే ఎన్‌ఎక్స్‌ శ్రేణి బైక్‌లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్‌లో ఎన్‌ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్‌లో ఎన్‌ఎక్స్‌కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్‌ను ఎన్‌ఎక్స్‌200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.

స్టైలింగ్ పరంగా ఎన్‌ఎక్స్‌200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్‌సైకిల్‌పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌, బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ప్రధానంగా ఉన్నాయి.

ఎన్‌ఎక్స్‌200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్‌తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ బైక్‌లో జత చేశారు. హోండా ఎన్‌ఎక్స్‌200ను కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement