Rs 27
-
హయ్యస్ట్ డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
న్యూఢిల్లీ: వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జెడ్‌ఎల్) భారీ డివిడెండ్ ప్రకటించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ 13.985 కోట్ల మధ్యంతర డివిడెండ్ బుధవారం ప్రకటించింది. దీంతో మొత్తం చెల్లించిన డివిడెండ్ విలువ రూ.27,157 కోట్లకు చేరింది.దీంతో దేశంలో అతి పెద్ద డివిడెండ్ చెల్లించిన కంపెనీగా హిందుస్థాన్ జింక్ నిలిచింది. స్పెషల్ వన్ టైం మధ్యంతరం డివిడెండ్‌ను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. 1,375 శాతం మధ్యంతర డివిడెండ్ లేదా డివిడెండ్ పంపిణీ పన్ను (డిడిటి) సహా, రూ 13.985 కోట్లను ప్రకటించింది. దీని ప్రకారం రూ .2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుకు రూ.27.50లను చెల్లించనుంది. 2016 ఏప్రిల్ లో చెల్లించిన గోల్డెన్ జుబ్లీ డివిడెండ్, అక్టోబర్ లో చెల్లించిన డివిడెండ్ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తమ వాటాదారులకు స్పెషల్ డివిడెండ్ చెల్లించడం సంతోషంగా ఉందని, విలువ పంపిణీలో కంపెనీ నిబద్ధతను, విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని కంపెనీ ఛైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. కాగా మార్చిలో రూ.2 విలువగల ప్రతి ఈక్విటీ షేరుపై రూ.24 డివిడెండ్ చెల్లించింది. ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో జింక్, వెండి ఉత్పత్తిలో దేశంలోని అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీ హిందుస్థాన్ జింక్. -
11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం
-
11 నెలల కనిష్టానికి పడిపోయిన బంగారం
న్యూఢిల్లీ: అంతకంతకూ దిగి వస్తున్న బంగారం ధరలు సోమవారం మరింత పతనమయ్యాయి. బులియన్ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ. 250 క్షీణించి రూ. 27,550 దగ్గర 11నెలల కనిష్టాన్ని నమోదుచేసింది. ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎనలిస్టులు సూచనలు, నగల దుకాణదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ క్షీణతను నమోదు చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. స్థానిక మార్కెట్ లో స్పాట్ గోల్డ్ 99.9fశాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారంరూ. 250 to Rs 27,550 వద్ద, 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రా. బంగారం రూ. 250 నీరసించి రూ. 27,400వద్ద ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 4 నాటి రూ. 27,575 ముగింపు తో పోలిస్తే ఇదే కనిష్టం. అలాగే ఎంసీఎక్స్ మార్కెట్ లో బంగారం ధరలు రూ.27 వేలకు దిగువన బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర సోమవారం రూ.25 పతనమై పది గ్రా. రూ.26,960 పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.. కిలో వెండి ధర రూ.210 నీరసించి రూ.38,600 దగ్గరుంది. అటు పరిశ్రమలు, ఇటు నాణేల తయారీదారుల నుంచి తగ్గిన డిమాండ్ వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. నోట్ల కష్టాలు, జ్యువెల్లర్స్, రిటైల్ వ్యాపారులనుండి గణనీయంగా తగ్గిన డిమాండ్ కారణంగా విలువైన లోహాల ధరలపై ఒత్తిడి పెంచుతున్నట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరోవైపు సింగపూర్ మార్కెట్ సెలవు కారణంగా ఇన్వెస్టర్లలో స్తబ్దదత నెలకొంది. -
వావ్ వన్ ప్లస్ 3
మొబైల్స్ తయారీదారు వన్ ప్లస్ తన నూతన స్మార్ట్‌ఫోన్ ....6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమెరీ, డ్యాష్ చార్జింగ్ తో వన్ ప్లస్ 3 వచ్చేసింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్, తన తర్వాతి తరం స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి మంగళవారం అర్థరాత్రి ఆవిష్కరించింది. దీని ధర రూ.27,999గా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ కోసం వినియోగదారులు వేచి చూడకుండా నేటి నుంచే ప్రముఖ ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్ ఇండియాలో ఎక్స్ క్లూజివ్ గా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం గ్రాఫిక్ కలర్ వేరియంట్ లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని, కొద్దికాలం అనంతరం సాప్ట్ గోల్డ్ వేరియంట్ ను మార్కెట్లోకి వస్తుందని చెప్పింది. వన్ ప్లస్ 3 ఫీచర్లు... క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ఎస్ఓసీ 6జీబీ ర్యామ్ 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్(నానో సిమ్ కార్డులు) 5.5 అంగుళాల డిస్ ప్లే అండ్ ఫుల్ హెచ్డీ రెసుల్యూషన్ ఆప్టిక్ అమోలెడ్ డిస్ ప్లే విత్ గోరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 16 ఎంపీ వెనుక కెమెరా(సోనీ ఐఎమ్ఎక్స్ 298) 8 ఎంపీ ముందు కెమెరా 4జీ ఎల్టీఈ సపోర్ట్ 3,000 ఎంఏహెచ్ లిథియం పోలిమర్ బ్యాటరీ