Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్‌’లివే.. | Yearender 2024: These Vande Bharat Express Trains Launched This Year | Sakshi
Sakshi News home page

Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్‌’లివే..

Published Sat, Dec 21 2024 7:26 AM | Last Updated on Sat, Dec 21 2024 9:51 AM

Yearender 2024: These Vande Bharat Express Trains Launched This Year

భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది.  2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇవే..

ఢిల్లీ-పట్నా 
ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్‌ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

మీరట్-లక్నో 
మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా  మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్‌ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.

మదురై-బెంగళూరు
మదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.

చెన్నై-నాగర్‌కోయిల్
తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్‌కోయిల్‌తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

టాటానగర్-పట్నా 
టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్‌లోని టాటానగర్‌ను బీహార్‌లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.

భాగల్పూర్-హౌరా
భాగల్‌పూర్-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2024 సెప్టెంబర్ 15న బీహార్‌లోని భాగల్‌పూర్‌ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.

బ్రహ్మపూర్-టాటానగర్
బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్‌ను టాటానగర్‌తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.

ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్‌ విలయం వరకూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement