బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్‌’ | Britannia profit falls 9pc due to weak demand | Sakshi
Sakshi News home page

బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్‌’

Published Tue, Nov 12 2024 8:25 AM | Last Updated on Tue, Nov 12 2024 8:25 AM

Britannia profit falls 9pc due to weak demand

న్యూఢిల్లీ: బేకరీ ఫుడ్‌ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 9 శాతం నీరసించి రూ. 532 కోట్లకు పరిమితమైంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా కన్జూమర్‌ డిమాండ్‌ మందగించడం ప్రభావం చూపింది.

గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 587 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 4,566 కోట్లను దాటాయి. గుడ్‌డే, మేరీ గోల్డ్, న్యూట్రిచాయిస్‌ తదితర బ్రాండ్ల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా బలపడి రూ. 4,714 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 3,995 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బ్రిటానియా షేరు బీఎస్‌ఈలో 6 శాతం పతనమై ,425 వద్ద ముగిసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement