Profit Falls
-
బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్’
న్యూఢిల్లీ: బేకరీ ఫుడ్ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం నీరసించి రూ. 532 కోట్లకు పరిమితమైంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా కన్జూమర్ డిమాండ్ మందగించడం ప్రభావం చూపింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 587 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 4,566 కోట్లను దాటాయి. గుడ్డే, మేరీ గోల్డ్, న్యూట్రిచాయిస్ తదితర బ్రాండ్ల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా బలపడి రూ. 4,714 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 3,995 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బ్రిటానియా షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై ,425 వద్ద ముగిసింది. -
అశోక్ లేలాండ్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం అశోక్ లేలాండ్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 58 శాతం క్షీణించి రూ. 158 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో రూ. 377 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 8,142 కోట్ల నుంచి రూ. 9,927 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,831 కోట్ల నుంచి రూ. 9,430 కోట్లకు పెరిగాయి. ముడివ్యయాలు రూ. 1,100 కోట్లమేర పెరిగి రూ. 6,581 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. వీటికితోడు రూ. 267 కోట్ల అనుకోని నష్టం నమోదైనట్లు తెలియజేసింది. వాటాదారులకు షేరుకి రూ. 1 చొప్పున డివిడెండు ప్రకటించింది. -
టైటాన్ నికర లాభం 38% డౌన్
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టైటాన్కు అధిక వ్యయాల సెగ తగిలింది. ఈ ఆర్థిక సంవ త్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కంపెనీ స్టాండెలోన్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ.199 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.320 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం 1.72 శాతం తగ్గుదలతో రూ.4,466 కోట్ల నుంచి రూ.4,389 కోట్లకు చేరింది. క్యూ2లో కంపెనీ మొత్తం వ్యయాల్లో భాగంగా రూ.480 కోట్లను నష్టంగా గుర్తించింది. కంపెనీ మొత్తం వ్యయాలు రూ.4,151 కోట్లకు ఎగబాకాయి. క్రితం ఏడాది క్యూ2లో మొత్తం వ్యయాలు రూ.4,037 కోట్లుగా ఉన్నాయి. భారత్లో కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020–21 తొలి త్రైమాసికంలో నెలకొన్న తీవ్ర సమస్యల తర్వాత రెండో త్రైమాసికంలో అమ్మకాలు భారీగా 89 శాతం మేర పుంజుకున్నాయని కంపెనీ పేర్కొంది. ‘క్యూ2లో కంపెనీ చవిచూసిన రికవరీ పట్ల సంతృప్తి చెందుతున్నాం. పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి సానుకూల సెంటిమెంట్ నెలకొనడం కంపెనీ మొత్తం విభాగాలన్నింటికీ శుభసూచకం. కీలక వ్యాపారాల్లో కంపెనీ మార్కెట్ వాటా పెంపు కొనసాగుతోంది. వ్యయాలు, పెట్టుబడులపై మరింత దృష్టిసారించడం, లాభాలు అదేవిధంగా నగదు ప్రవాహాలు మెరుగయ్యేందుకు దోహదం చేసింది’ అని కంపెనీ ఎండీ సి.కె. వెంకటరామన్ తెలిపారు. ► ఆభరణాల విభాగం ఆదాయం క్యూ2లో రూ.3,446 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.3,528 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. వాచీలు, వేరబుల్స్ వ్యాపార ఆదాయం 44 శాతం దిగజారి రూ.719 కోట్ల నుంచి రూ.400 కోట్లకు క్షీణించింది. ► కళ్లద్దాల వ్యాపారం ఆదాయం సైతం 39 శాతం క్షీణతతో రూ.154 కోట్ల నుంచి రూ.94 కోట్లకు పడిపోయింది. ఫలితాల నేపథ్యంలో టైటాన్ షేరు బుధవారం బీఎస్ఈలో 1.2 శాతం నష్టంతో రూ.1,218 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్ లాభం 49% డౌన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ లాభం మార్చి త్రైమాసికంలో 49 శాతం తగ్గి రూ.1,109 కోట్లకు పరిమితం అయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,175 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.91,643 కోట్ల నుంచి రూ.87,285 కోట్లకు తగ్గింది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కన్సాలిడేటెడ్గా రూ.28,724 కోట్ల నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. ఆదాయం రూ.3,04,903 కోట్లుగా ఉంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభం రూ.9,091 కోట్లు, ఆదాయం రూ.2,96,298 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో జేఎల్ఆర్ రూపంలో టాటా మోటార్స్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. టాటా మోటార్స్ స్టాండలోన్గా (దేశీయ వ్యాపారం) చూసుకుంటే మార్చి త్రైమాసికంలో రూ.106 కోట్ల లాభం వచ్చింది. ఆదాయం రూ.18,561 కోట్లుగా ఉంది. 2018–19 పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్గా రూ.2,398 కోట్ల లాభాన్ని గడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.946 కోట్ల నష్టాన్ని చవిచూడడం గమనార్హం. స్టాండలోన్ ఆదా యం రూ.58,689 కోట్ల నుంచి రూ.69,202 కోట్లకు పెరిగింది. బీఎస్ఈలో టాటా మోటార్స్ షేరు 7 శాతానికి పైగా లాభపడి రూ.190 వద్ద క్లోజయింది. -
అయ్యయ్యో...ఇండిగో
సాక్షి,ముంబై: అతిపెద్ద దేశీయ వాహకాన్ని ఇండిగో ఆపరేటర్ ఇంటర్ గ్లోబెల్ ఏవియేషన్ క్యూ1 ఫలితాల్లో చతికిల పడింది. విదేశీ మారకం, అధిక ఇంధన ధరలు సంస్థ తొలి త్రైమాసిక ఫలితాలను బాగా దెబ్బ తీసాయి. గత ఏడాది ఇదే క్వార్టర్లో 8.11 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసిన బడ్జెట్ క్యారియర్ ఇండిగో వివిధ ప్రతికూల అంశాలకారణంగా తాజా త్రైమాసికంలో భారీగా నష్టపోయింది. క్యూ1లో నికర లాభం ఏకంగా 96.6 శాతం క్షీణించి రూ.278 మిలియన్లకు చేరింది. అయితే ఈ త్రైమాసికంలో అమ్మకాలు పుంజుకున్నాయి. 13.2 శాతం వృద్ధితో రూ .6.51 బిలియన్లకు చేరుకున్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 5.75 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి. విదేశీ మారకం, అధిక ఇంధన ధరలతోపాటు, మార్కెట్లో నెలకొన్న పోటీ కారణంగా లాభాలు క్షీణించినట్టు సంస్థ వెల్లడించింది. అయితే ఈ త్రైమాసికానికి ప్రతికూల పరిస్తితులను ఎదుర్కొంటున్నప్పటికీ, సుదీర్ఘ ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు ఇండిగో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భాటియా ప్రకటించారు. దేశీయంగా కొత్త మార్గాలతోపాటు భారతదేశంలోని వివిధ నగరాలను, అంతర్జాతీయ గమ్యస్థానాలతో అనుసంధానిస్తున్నట్టు తెలిపారు. -
భారీగా తగ్గిన రెడ్డీస్ నికర లాభం
♦ నికర లాభం 76% తగ్గి రూ.153 కోట్లకు ♦ టర్నోవరు 14 శాతం పడి రూ.3,222 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఔషధ రంగ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ జూన్ త్రైమాసికం(2016-17, క్యూ1) కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికర లాభం భారీగా తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం 76 శాతం తగ్గి రూ.647.4 కోట్ల నుంచి రూ.153.5 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు 14.11 శాతం పడి రూ.3,752 కోట్ల నుంచి రూ.3,222 కోట్లుగా ఉంది. నిర్వహణ లాభం 60 శాతం తగ్గి రూ.400 కోట్లు నమోదు చేసింది. యూఎస్, వెనిజులా మార్కెట్లలో అమ్మకాలు మందగించడమే లాభం తగ్గడానికి కారణమని కంపెనీ వెల్లడించింది. యూఎస్ఎఫ్డీఏ నుంచి వార్నింగ్ లెటర్ రావడంతో ఉత్పత్తుల విడుదల ఆలస్యం కావడం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపిందని వివరించింది. పోటీ పెరగడంతో ప్రధాన మాలిక్యూల్స్ విలువ పడిపోవడం కూడా సమస్యను పెంచిందని డాక్టర్ రెడ్డీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సౌమెన్ చక్రవర్తితో కలసి ఈ సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పెరిగిన భారత వ్యాపారం..: ఉత్తర అమెరికా జనరిక్స్ వ్యాపారం 16.2 శాతం తగ్గి రూ.1,552 కోట్లు నమోదు చేసింది. ఇక యూరప్ జనరిక్స్ వ్యాపారం 16 శాతం పడి రూ.161.5 కోట్లుగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లు 26 శాతం తగ్గి రూ.427.7 కోట్లను తాకాయి. వీటికి భిన్నంగా భారత్లో కంపెనీ వ్యాపారం పెరిగింది. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ 10 శాతం వృద్ధి చెంది రూ.522 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఫార్మాస్యూటికల్ సర్వీసెస్, యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఆదాయం 16 శాతం పడి రూ.469 కోట్లుగా ఉంది. పరిశోధన, అభివృద్ధికి చేసిన వ్యయాలు 9 శాతం అధికమై రూ.480 కోట్లుంది. 5 శాతం పడిన షేర్లు.. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో రెడ్డీస్ షేరు మంగళవారం సుమారు 5 శాతం పడింది. బీఎస్ఈలో షేరు 4.37% పడి రూ.3,322.85 వద్ద స్థిరపడింది. ఇంట్రా డేలో 5.15 శాతం తగ్గి రూ.3,295 నమోదు చేసింది. ఎన్ఎస్ఈలో షేరు 4.67 శాతం పడి రూ.3,319.65 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో 1.54 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 15 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
భారీగా కుదేలైన రెడ్డీస్ ల్యాబ్స్