Britannia
-
బ్రిటానియా... తగ్గిన ‘టేస్ట్’
న్యూఢిల్లీ: బేకరీ ఫుడ్ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 9 శాతం నీరసించి రూ. 532 కోట్లకు పరిమితమైంది. కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా కన్జూమర్ డిమాండ్ మందగించడం ప్రభావం చూపింది.గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 587 కోట్లు ఆర్జించింది. మొత్తం అమ్మకాలు మాత్రం 4 శాతం పుంజుకుని రూ. 4,566 కోట్లను దాటాయి. గుడ్డే, మేరీ గోల్డ్, న్యూట్రిచాయిస్ తదితర బ్రాండ్ల కంపెనీ మొత్తం ఆదాయం సైతం 5 శాతంపైగా బలపడి రూ. 4,714 కోట్లకు చేరింది. అయితే మొత్తం వ్యయాలు 8 శాతం పెరిగి రూ. 3,995 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బ్రిటానియా షేరు బీఎస్ఈలో 6 శాతం పతనమై ,425 వద్ద ముగిసింది. -
బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
ప్రకటించిన బరువు కంటే తక్కువ బరువున్న బిస్కెట్ ప్యాకెట్లను విక్రయించినందుకు ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ బ్రిటానియా సంస్థకు భారీ జరిమానా విధించిన సంఘటనలో కేరళలో జరిగింది. రూ.60,000 నష్టపరిహారం చెల్లించాలని కేరళలోని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ బ్రిటానియా ఇండస్ట్రీస్, స్థానిక బేకరీని ఆదేశించింది.వినియోగదారుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బేకరీ నుంచి 300 గ్రాముల బరువున్న "బ్రిటానియా న్యూట్రి ఛాయిస్ థిన్ యారో రూట్ బిస్కెట్స్" రెండు ప్యాకెట్లను వినియోగదారుడు కొనుగోలు చేశాడు. అయితే బిస్కెట్ పాకెట్ల బరువుపై అనుమానం వచ్చిన వినియోగదారుడు వాటిని తూకం వేయగా ప్యాకెట్లు వరుసగా 268 గ్రాములు, 248 గ్రాములు ఉన్నాయి.ప్యాకెట్ ప్రామాణిక బరువు కంటే చాలా తక్కువ ఉండటంతో వినియోగదారుడు త్రిస్సూర్ లోని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన అధికారులు సైతం బిస్కెట్ పాకెట్ల బరువు తక్కువ ఉన్నట్లు నిర్ధారించారు. వినియోగదారుల రక్షణ చట్టం, 2009 లీగల్ మెట్రాలజీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ దోపిడీ, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుంచి విముక్తి పొందే వినియోగదారుడి హక్కును బ్రిటానియా కంపెనీ, స్థానిక బేకరీ ఉల్లంఘించాయని కమిషన్ గుర్తించింది. దీంతో ఫిర్యాదుదారుడికి నష్ట పరిహారం కింద రూ.50 వేలు, అతను భరించిన లిటిగేషన్ ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. -
రూ.194 డివిడెండ్ ప్రకటించిన కంపెనీ
ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ తన ఇన్వెస్టర్లకు రూ.10 ముఖవిలువ కలిగిన ప్రతి షేరుకు రూ.194 డివిడెండ్ ప్రకటించింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎంఆర్ఎఫ్ నికరలాభం రూ.2081 కోట్లుగా నమోదైంది. 2022-23 నికరలాభం రూ.769 కోట్లుగా కంపెనీ పోస్ట్ చేసింది. కార్యకలాపాల ఆదాయం కూడా రూ.23,008 కోట్ల నుంచి రూ.25,169 కోట్లకు వృద్ధి చెందినట్లు చెప్పింది.మార్చి త్రైమాసికంలో రూ.396 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.341 కోట్లతో పోలిస్తే ఇది 16% ఎక్కువ. కంపెనీ తాజాగా ప్రకటించిన డివిడెండ్‌తోపాటు ఇప్పటికే మధ్యంతర డివిడెండ్‌ను రెండుసార్లు రూ.3 చొప్పున సంస్థ అందించింది.ఇదీ చదవండి: నేపాల్‌లో నిలిచిన ఇంటర్నెట్ సేవలు.. కారణం..బ్రిటానియా రూ.73.50 డివిడెండ్బ్రిటానియా ఇండస్ట్రీస్ మార్చి త్రైమాసికంలో రూ.536.61 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాలంలో నమోదుచేసిన లాభం రూ.557.60 కోట్ల కంటే ఇది తక్కువ. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4023.18 కోట్ల నుంచి 1.14% పెరిగి రూ.4069.36 కోట్లకు చేరింది. రూ.1 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు రూ.73.50 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. -
బ్రిటానియా గూటికి కెన్యా బిస్కెట్ల తయారీ కంపెనీ
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
బ్రిటానియా గూటికి కెనాఫ్రిక్
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
బ్రిటానియా లాభం రూ.303 కోట్లు
ఎఫ్ఎమ్సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.261 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.303 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎమ్డీ వరుణ్ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. ఇక నిర్వహణ మార్జిన్ 14.8 శాతం నుంచి 1 శాతం పెరిగి 15.8 శాతానికి చేరిందని వివరించారు. అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికమని బెర్రి పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.2,203 కోట్ల నుంచి రూ.2,455 కోట్లకు పెరిగాయి. ముడి పదార్ధాల ధరలు పెరిగినప్పటికీ, కఠినమైన వ్యయ నియంత్రణ పద్దతులు పాటించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేర్ ఫ్లాట్‌గా, రూ.5,754 వద్ద ముగిసింది. -
డీ-మార్ట్ దూసుకుపోతుంది
సాక్షి, న్యూఢిల్లీ : డీ-మార్ట్ స్టోర్లు నిర్వహించే సూపర్‌మార్కెట్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ సరికొత్త గరిష్టాలను నమోదుచేస్తూ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో బీఎస్ఈలో 3 శాతం పైకి జంప్ చేసిన అవెన్యూ సూపర్‌మార్ట్స్ రూ.1000 మార్కును బీట్చేసి, రూ.1018 వద్ద నమోదవుతోంది. మార్కెట్లు కొంత ప్రతికూల ట్రేడింగ్‌లో నడుస్తున్నప్పటికీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్(డీ-మార్ట్) స్టాక్ మాత్రం గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్ల నుంచి అంటే ఆగస్టు 10 నుంచి 16 శాతం ర్యాలీ కొనసాగించింది. గత రెండువారాల నుంచి చూస్తున్న ఈ స్ట్రాంగ్ ర్యాలీతో, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.62వేల కోట్లను దాటేసింది. ప్రస్తుతం మొత్తం ర్యాంకింగ్స్‌లో 44వ స్థానానికి వచ్చేసింది. బీఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 10:17 గంటల సమయంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ62,901 కోట్లు. ఎఫ్ఎంసీజీ దిగ్గజం గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌ను, స్టీల్ దిగ్గజం టాటా స్టీల్‌ను, ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని, సిమెంట్ దిగ్గజం షీర్ సిమెంట్‌ను డీమార్ట్ అధిగమించింది. మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు డాబర్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, అరబిందో ఫార్మాలను దాటుకుని ఇది ముందుకు వెళ్లింది. -
మురిపించిన బ్రిటానియా
ముంబై: బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ క్యూ1 (స్వతంత్ర అండ్ కన్సాలిడేటెడ్) ఫలితాలను ప్రకటించింది. బిస్కట్ల దిగ్గజం బ్రిటానియా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలతో ఆకట్టుకుంది. జూన్ 30తోముగిసిన తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 13 శాతం జంప్ చేసి రూ. 219 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 9 శాతం పెరిగి రూ. 2191కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 10 శాతం పెరిగి రూ. 316 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు మాత్రం 14.3 శాతం నుంచి నామమాత్రంగా 14.4 శాతానికి బలపడ్డాయి. ఈ ఫలితాల నేపథ్యంలో ఈ షేర్ కు నేటి మార్కెట్ లో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. దీంతో బ్రిటానియా షేరు 5 శాతం లాభాలతో ట్రేడవుతోంది.