ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 16 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.261 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.303 కోట్లకు పెరిగిందని బ్రిటానియా ఇండస్ట్రీస్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,596 కోట్ల నుంచి 12 శాతం పెరిగి రూ.2,914 కోట్లకు ఎగసిందని కంపెనీ ఎమ్‌డీ వరుణ్ బెర్రి చెప్పారు. ఎబిటా రూ.378 కోట్ల నుంచి 20 శాతం వృద్ధితో రూ.454 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు.
ఇక నిర్వహణ మార్జిన్ 14.8 శాతం నుంచి 1 శాతం పెరిగి 15.8 శాతానికి చేరిందని వివరించారు. అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించడం ఇది వరుసగా నాలుగో త్రైమాసికమని బెర్రి పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.2,203 కోట్ల నుంచి రూ.2,455 కోట్లకు పెరిగాయి. ముడి పదార్ధాల ధరలు పెరిగినప్పటికీ, కఠినమైన వ్యయ నియంత్రణ పద్దతులు పాటించడం వల్ల లాభదాయకత మెరుగుపడిందని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఈ షేర్ ఫ్లాట్‌గా, రూ.5,754 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment