
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది.
తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్‌ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment