share purchase
-
నువామా వెల్త్ చేతికి ఓయో షేర్లు
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ యూనికార్న్ ఒరావెల్ స్టేస్ లిమిటెడ్‌లో నువామా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రూ. 100 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఓయో బ్రాండ్ కంపెనీ వాటాను షేరుకి రూ. 53 చొప్పున సొంతం చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. సెకండరీ మార్కెట్లో లావాదేవీ ద్వారా కంపెనీ తొలి ఇన్వెస్టర్ల నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. మరోపక్క ఆతిథ్య రంగ కంపెనీలో వాటా కొనుగోలుకి ఇన్‌క్రెడ్ తదితర సంస్థలు సైతం ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాయి. ఇందుకు షేరుకి రూ. 53–60 మధ్య ధరను చెల్లించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెరసి కంపెనీ విలువను 5 బిలియన్ డాలర్లకుపైగా మదింపు చేసినట్లు వివరించాయి. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వీటి ప్రకారం ఏప్రిల్–జూన్(క్యూ1)లో సుమారు రూ. 132 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2023–24) క్యూ1లో రూ. 108 కోట్ల నష్టాలు ప్రకటించింది. -
పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్‌లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. -
బ్రిటీష్ టెలికంలో భారతి గ్లోబల్ పాగా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం భారతి గ్లోబల్ తాజాగా బ్రిటన్ సంస్థ బీటీ (బ్రిటీష్ టెలికం) గ్రూప్‌లో 24.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువను నిర్దిష్టంగా ప్రకటించనప్పటికీ బీటీ వేల్యుయేషన్ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని, దాన్ని బట్టి చూస్తే ఒప్పంద విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,600 కోట్లు) ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతి గ్లోబల్ ప్రకటన ప్రకారం కంపెనీ ముందుగా ఆల్టిస్ సంస్థ నుంచి బీటీ గ్రూప్‌లో 9.99 శాతం వాటాను తక్షణం కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థ అనుమతులు వచ్చాక మిగతా వాటాను తీసుకుంటుంది. బీటీని పూర్తిగా దక్కించుకోవడంపై గానీ బోర్డులో స్థానం తీసుకోవడంపై గానీ ఆసక్తి లేదని భారతి గ్లోబల్ పేర్కొంది. బీటీ గ్రూప్ బ్రిటన్‌లో అతి పెద్ద బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. దానికి గతంలో 1997 నుంచి 2001 వరకు భారతి ఎంటర్ప్రైజెస్ టెలికం విభాగమైన భారతి ఎయిర్‌టెల్‌లో 21 శాతం వాటాలు ఉండేవి. బీటీ గ్రూప్‌లో బిలియనీర్ ప్యాట్రిక్ డ్రాహీకి చెందిన పెట్టుబడి సంస్థ ఆల్టిస్ 2021లో ముందుగా 12 శాతం వాటాలు తీసుకుని తర్వాత దాన్ని 24.5 శాతానికి పెంచుకుంది. భారతి గ్లోబల్ పెట్టుబడులు తమ గ్రూప్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకానికి నిదర్శనమని బీటీ సీఈవో అలిన్ కిర్క్‌బీ పేర్కొన్నారు. టాటా, మహీంద్రాల సరసన భారతి.. → తాజా డీల్‌తో బ్రిటన్ కంపెనీలను కొనుగోలు చేసిన టాటా, మహీంద్రా, వెల్స్పన్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థల సరసన భారతి ఎంటర్ప్రైజెస్ కూడా చోటు దక్కించుకోనుంది. → టాటా గ్రూప్‌లో భాగమైన టాటా టీ 2000లో బ్రిటన్ సంస్థ టెట్లీ టీని కొనుగోలు 271 మిలియన్ పౌండ్లకు చేసింది. అప్పట్లో టెట్లీతో పోలిస్తే టాటా టీ పరిమాణం చాలా చిన్నది. అయినప్పటికీ 1995 నుంచి దాన్ని కొనుగోలు చేసేందుకు సుదీర్ఘంగా ప్రయత్నాలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా రంగంలోకి దిగారు. చివరికి 2000లో టాటా గ్రూప్ దాన్ని సొంతం చేసుకుని అప్పట్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలు డీల్‌ను నమోదు చేసింది. → ఆ తర్వాత ఆరేళ్లకు 2006 జూలైలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా, బ్రిటన్‌కి చెందిన టెర్రీ టవల్ బ్రాండ్ క్రిస్టీ మాతృ సంస్థ సీహెచ్టీ హోల్డింగ్స్‌లో 85 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 132 కోట్లు వెచి్చంచింది.→ టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తూ ఆ మరుసటి ఏడాది 2007లో ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ గ్రూప్‌ను దక్కించుకుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. దానికి కొనసాగింపుగా 2008లో టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ మోటర్ నుంచి దక్కించుకుంది. → ఇక 2016 అక్టోబర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల సంస్థ బీఎస్ఏ కంపెనీని రూ. 28 కోట్లకు తీసుకుంది. → 2020 ఏప్రిల్‌లో బైక్‌ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ 16 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. భారతి, బీటీలకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది. దిగ్గజ బ్రిటన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాకు ఒక గొప్ప మైలురాయిలాంటిది – సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ -
జ్యురిక్ చేతికి కొటక్ ఇన్సూరెన్స్
న్యూఢిల్లీ: కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యురిక్ ఇన్సూరెన్స్ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ. 5,560 కోట్లుగా కొటక్ మహీంద్రా బ్యాంక్ పేర్కొంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి జ్యురిక్ 70 శాతం వాటా కొనుగోలును పూర్తి చేసినట్లు తెలియజేసింది. దీంతో విదేశీ యాజమాన్య వాటాను 74 శాతం వరకూ అనుమతించిన తర్వాత దేశీయంగా జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రవేశించిన తొలి విదేశీ కంపెనీగా జ్యురిక్ నిలిచినట్లు పేర్కొంది. 49 శాతం నుంచి 74 శాతానికి పెంచుతూ 2021లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ) నిబంధనలను సవరించిన సంగతి తెలిసిందే. 30 శాతం బ్యాంక్ చేతిలో కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో మిగిలిన 30% వాటాను ప్రస్తుతం కొటక్ మహీంద్రా బ్యాంక్ కలిగి ఉంది. మరోపక్క మెజారిటీ వాటా కొనుగోలుతో సంస్థ పేరు జ్యురిక్ కొటక్ జనరల్ ఇన్సూరెన్స్‌గా మారినట్లు జ్యురిక్ ఇన్సూరెన్స్ పేర్కొంది. -
బజాజ్ ఆటో షేర్ల బైబ్యాక్..!
బజాజ్ ఆటో షేర్ల కొనుగోలు(బైబ్యాక్) ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఈ నెల 8న జరిగే బోర్డు సమావేశంలో చర్చించే అంశాల్లో ఇది ఒకటని పేర్కొంది. కంపెనీ అత్యున్నత అధికారులు, వీరి తరఫు బంధువులు సంస్థ సెక్యూరిటీలు, ఈక్విటీ షేర్లలో లావాదేవీలు నిర్వహించే విండోను ఈ నెల 1 నుంచి 26వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. బైబ్యాక్ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 6,989 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 52 వారాల గరిష్టం రూ. 7,060 వరకూ ఎగసింది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో ‘జీక్యూజీ’కి 4.7 శాతం వాటా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్ 4.7 శాతం వాటా చేజిక్కించుకుంది. బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కొక్కటి రూ.59.09 చొప్పున సుమారు 29 కోట్ల షేర్లను రూ.1,672 కోట్లు వెచి్చంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో శుక్రవారం మొత్తం 3 ప్రధాన బ్లాక్ డీల్స్ ద్వారా ఒక్కో షేరు రూ.58.2–59.25 చొప్పున 12.6% వాటాలు చేతులు మారాయి. వీటి మొత్తం విలువ రూ.4,465 కోట్లు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో వాటా కొనుగోలు చేసిన కంపెనీల్లో నోమురా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, స్టిక్టింగ్ డిపాజిటరీ ఏపీజీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ పూల్ సైతం ఉన్నాయి. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో తనకున్న మొత్తం 7.27 శాతం వాటాలను యూకే కంపెనీ ఏఎస్ఎన్ ఇన్వెస్ట్మెంట్స్ విక్రయించింది. ఏ/డీ ఇన్వెస్టర్స్ ఫండ్, వరేనియం ఇండియా అపార్చునిటీ ఫండ్ సైతం వాటాలను విక్రయించాయి. -
1నుంచి టీసీఎస్ బైబ్యాక్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సరీ్వసెస్(టీసీఎస్).. సొంత ఈక్విటీ షేర్ల కొను గోలు(బైబ్యాక్)ను డిసెంబర్ 1నుంచి ప్రారంభించనుంది. షేరుకి రూ. 4,150 ధర మించకుండా 1.12 శాతం ఈక్విటీకి సమానమైన 4.09 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకు మొత్తం రూ. 17,000 కోట్లవరకూ వెచి్చంచనుంది. బైబ్యాక్‌లో భాగంగా రూ. 2 లక్షల పెట్టుబడిలోపుగల చిన్న ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 6 షేర్లకుగాను 1 షేరుని తీసుకోనుంది. ఇందుకు రికార్డ్ డేట్ నవంబర్ 25కాగా.. ఇతర సంస్థాగత ఇన్వెస్టర్ల వద్దగల ప్రతీ 209 షేర్లకుగాను 2 షేర్లను కొనుగోలు చేయనుంది. ఈక్విటీ షేర్ల తాజా బైబ్యాక్ ప్రభావం కంపెనీ లాభదాయకత లేదా ఆర్జనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపబోదని ఈ సందర్భంగా కంపెనీ స్పష్టం చేసింది. బైబ్యాక్ కారణంగా పెట్టుబడులకు వినియోగించగల నిధులు మాత్రమే ఆమేర తగ్గనున్నట్లు వివరించింది. వెరసి కంపెనీ వృద్ధి అవకాశాలకు ఎలాంటి విఘాతం కలగబోదని స్పష్టం చేసింది. ప్రమోటర్ల వాటా.. టీసీఎస్‌లో ప్రమోటర్ టాటా సన్స్ 72.27 శాతానికి సమానమైన 26.45 కోట్ల షేర్లను కలిగి ఉంది. వీటిలో బైబ్యాక్‌కు 2.96 కోట్ల షేర్లను దాఖలు చేయనుంది. ఇక టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ తమవద్ద గల 10,14,,172 షేర్లలో 11,358 షేర్లను టెండర్ చేయనుంది. టీసీఎస్ మొత్తం 4,09,63,855 షేర్లను బైబ్యాక్ చేసే లక్ష్యంతో ఉంది. బైబ్యాక్‌కు పూర్తిస్థాయిలో షేర్లు దాఖలైతే కంపెనీలో ప్రమోటర్ల వాటా ప్రస్తుత 72.3 శాతం నుంచి 72.41 శాతానికి బలపడనుంది. కాగా.. బైబ్యాక్ పూర్తయిన తదుపరి ఏడాదివరకూ టీసీఎస్ మూలధన సమీకరణ చేపట్టబోదు. గతేడాది సైతం షేరుకి రూ. 4,500 ధరలో ఈక్విటీ బైబ్యాక్‌కు రూ. 18,000 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. అంతక్రితం 2020, 2018, 2017లలో సైతం బైబ్యాక్‌లకు సుమారు రూ. 16,000 కోట్లు చొప్పున పెట్టుబడులను వెచి్చంచడం విశేషం! కంపెనీ తొలిసారి 2017లో మార్కెట్ ధరకంటే 18 శాతం అధిక ధరలో షేర్ల కొనుగోలుకి తెరతీసింది. ఆపై 18–10 శాతం మధ్య ప్రీమియంలో బైబ్యాక్‌లను పూర్తి చేసింది. 2022 బైబ్యాక్‌కు 17 శాతం అధిక ధరను చెల్లించింది. తాజా బైబ్యాక్ తదుపరి షేరువారీ ఆర్జన(ఈపీఎస్) రూ. 58.52 నుంచి 59.18కి మెరుగుపడనుంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు ఎన్ఎస్ఈలో 1.3 శాతం లాభపడి రూ. 3,515 వద్ద ముగిసింది. -
జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మలేసియా సంస్థ వాటా
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ సంస్థ జీఎంఆర్ గ్రూప్.. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాను 74 శాతానికి పెంచుకోనుంది. మలేసియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్ బెర్హాద్ (ఎంఏహెచ్‌బీ) నుంచి 11 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకు జీఎంఆర్ 10 కోట్ల డాలర్లు (సుమారు రూ. 831 కోట్లు) వెచి్చంచనుంది. జీఎంఆర్ నేతృత్వంలో ఏర్పాటైన కన్సార్షియం.. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) ఈ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)కు జీహెచ్ఐఏఎల్ అనుబంధ సంస్థకాగా.. ఎంఏహెచ్‌బీతో వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. కీలక ఆస్తులను కన్సాలిడేట్ చేయడంలో భాగంగా తాజా వాటా కొనుగోలుకి తెరతీసినట్లు జీఎంఆర్ గ్రూప్ తెలియజేసింది. ప్రస్తుతం జీహెచ్‌ఐఏఎల్‌లో జీఏఎల్‌కు 63 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు 13 శాతం చొప్పున వాటా ఉంది. -
ఆక్సా వాటా భారతీ గ్రూప్ చేతికి
న్యూఢిల్లీ: జీవిత బీమా రంగ భాగస్వామ్య సంస్థలో ఏఎక్స్ఏ(ఆక్సా) వాటాను కొనుగోలు చేయనున్నట్లు భారతీ గ్రూప్ తాజాగా పేర్కొంది. వెరసి భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆక్సాకుగల 49 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ లావాదేవీ తదుపరి జీవిత బీమా జేవీకి హోల్డింగ్ కంపెనీగా భారతీ లైఫ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్(బీఎల్వీపీఎల్) నిలవనున్నట్లు తెలియజేసింది. 100 శాతం వాటాను పొందడం ద్వారా భారతీ గ్రూప్ ఈ ఫీట్‌ను సాధించనుంది. ప్రస్తుతం జేవీలో ఆక్సాకు 49 శాతం వాటా ఉంది. తగిన అనుమతులు పొందాక లావాదేవీ డిసెంబర్‌కల్లా పూర్తికానున్నట్లు భారతీ అంచనా వేసింది. 2006లో ఆక్సా, భారతీ గ్రూప్ సంయుక్తంగా భారతీ ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్‌లను ఏర్పాటు చేశాయి. తదుపరి 2020లో ఐసీఐసీఐ లాంబార్డ్‌కు జనరల్ ఇన్సూరెన్స్‌ను విక్రయించాయి. -
గల్ఫ్ ఆయిల్ చేతికి టైరెక్స్
ముంబై: ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) చార్జర్ల తయారీ కంపెనీ టైరెక్స్ ట్రాన్స్‌మిషన్‌లో నియంత్రణ వాటాను కొనుగోలు చేయనున్నట్లు హిందుజా గ్రూప్ కంపెనీ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండి యా తాజాగా పేర్కొంది. ఇందుకు రూ.103 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. తద్వారా ఈవీ విభాగంలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించనున్నట్లు అంచనా వేసింది. ఈవీ చార్జింగ్ మార్కెట్ ప్రస్తుత అంచనా విలువ 20 బిలియన్ డాలర్లుకాగా.. 2030కల్లా భారీగా 200 బిలియన్ డాలర్లను తాకగలదన్న అంచనాలున్నట్లు తెలిపింది. -
అదానీ పవర్లో 8.1% వాటా విక్రయం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్లు తాజాగా అదానీ పవర్లో 8.1 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఇందుకోసం 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,000 కోట్లు) వెచ్చించాయి. సెకండరీ మార్కెట్లో అత్యంత భారీ ఈక్విటీ డీల్స్‌లో ఇది కూడా ఒకటని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం.. 31.2 కోట్ల షేర్లను ప్రమోటర్ అదానీ కుటుంబం విక్రయించగా, సగటున షేరుకు రూ. 279.17 రేటుతో జీక్యూజీ పార్టనర్స్, ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్‌నకు చెందిన పలు సంస్థల్లో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఒక ఇన్వెస్టరు, ప్రమోటరు గ్రూప్ మధ్య ఈ తరహా లావాదేవీ జరగడం భారత్‌లో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు వివరించాయి.. అదానీ గ్రూప్ వ్యాపార ప్రమాణాలను, బలాన్ని ఇది సూచిస్తోందని తెలిపాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ దెబ్బతో అదానీ గ్రూప్ అతలాకుతలం అయిన పరిస్థితుల్లో, ఈ ఏడాది మార్చి నుంచి ఆ గ్రూప్ సంస్థల్లో జీక్యూజీ క్రమంగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో 5.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 6.54%, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 2.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలోనూ.. మరో స్టాక్ మార్కెట్ డీల్‌లో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ 1.27 శాతం వాటాలను రూ. 717.57 కోట్లకు విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా జీక్యూజీ పార్ట్నర్స్, వాషింగ్టన్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ తదితర సంస్థలు కొనుగోలు చేశాయి. జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్.. షేరు ఒక్కింటికి రూ. 341.7 రేటు చొప్పున 2.10 కోట్ల షేర్లను విక్రయించింది. డీల్ అనంతరం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జేఎస్‌డబ్ల్యూ ఇన్వెస్ట్మెంట్స్ వాటా 20.22 శాతం నుంచి 18.95 శాతానికి తగ్గింది. ఇటీవలే జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలో జీక్యూజీ పార్ట్నర్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఈక్విటీ ఫండ్ రూ. 411 కోట్లతో 1.19 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. -
అంబుజా చేతికి సంఘీ సిమెంట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ అయిన అంబుజా సిమెంట్స్ తాజాగా హైదరాబాద్‌కు చెందిన సంఘీ ఇండస్ట్రీస్‌లో 56.74 శాతం వాటా కొనుగోలు చేసింది. సంఘీ ప్రమోటర్లు అయిన రవి సంఘీ, కుటుంబం నుంచి ఈ వాటా దక్కించుకుంది. ఇందుకోసం అంబుజా సిమెంట్స్ రూ.1,674 కోట్లు వెచి్చస్తోంది. మరో 26 శాతం వాటా కోసం అంబుజా సిమెంట్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. 6.71 కోట్ల ఈక్విటీ షేర్లకుగాను 13.8 శాతం ప్రీమియంతో ఒక్కొక్కటి రూ.114.22 చొప్పున రూ.767 కోట్లను ఖర్చు చేయనుంది. ఓపెన్ ఆఫర్ పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయితే సంఘీ ఇండస్ట్రీస్‌లో అంబుజా సిమెంట్స్‌కు 82.74 శాతం వాటా దక్కుతుంది. ఈ డీల్‌లో భాగంగా సంఘీ ఇండస్ట్రీస్‌ను రూ.5,000 కోట్లుగా విలువ కట్టారు. 3–4 నెలల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. సంఘీ ఇండస్ట్రీస్ కొనుగోలుతో అంబుజా సిమెంట్స్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 7.36 కోట్ల టన్నులకు చేరనుంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు.. సంఘీ సిమెంట్స్‌కు గుజరాత్‌లోని కచ్ వద్ద ఉన్న సంఘీపురంలో 61 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక తయారీ సామర్థ్యం గల సిమెంట్ ప్లాంటుతోపాటు 66 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో క్లింకర్ ప్లాంట్ ఉంది. ‘సంఘీ ఇండస్ట్రీస్‌తో చేతులు కలపడం ద్వారా అంబుజా తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి.. నిర్మాణ సామగ్రి రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉంది. సంఘీ ఇండస్ట్రీస్‌కు ఉన్న 100 కోట్ల టన్నుల సున్నపురాయి నిల్వలతో అంబుజా సిమెంట్స్ వచ్చే రెండేళ్లలో సంఘీపురంలో సిమెంట్ సామర్థ్యాన్ని 1.5 కోట్ల టన్నులకు చేర్చనుంది. అదానీ గ్రూప్ 2028 నాటికి 14 కోట్ల మెట్రిక్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంతో ఉంది’ అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద నౌకలకు వీలుగా.. 8,000 డెడ్ వెయిట్ టన్నేజ్ సామర్థ్యం గల పెద్ద నౌకలు వచ్చేందుకు వీలుగా అక్కడే ఉన్న పోర్టును విస్తరించడానికి పెట్టుబడి చేయనున్నట్టు అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనమిక్ జోన్ సీఈవో కరణ్ అదానీ వెల్లడించారు. దేశంలో అతి తక్కువ ఖర్చుతో క్లింకర్‌ను ఉత్పత్తి చేసే ప్లాంటుగా సంఘీ ఇండస్ట్రీస్‌ను తీర్చిదిద్దాలన్నది లక్ష్యమని చెప్పారు. గురువారం అంబుజా షేరు ధర 2.87% పెరిగి రూ.474.20 వద్ద, సంఘీ ఇండస్ట్రీస్ షేరు ధర 4.99% ఎగసి రూ.105.76 వద్ద స్థిరపడింది. -
ఐటీసీ చేతికి యోగా బార్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) బ్రాండ్ యోగా బార్‌ను సొంతం చేసుకోనుంది. బ్రాండ్ మాతృ సంస్థ స్ప్రవుట్‌లైఫ్ ఫుడ్స్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్ఎఫ్పీఎల్)లో 100 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీసీ వెల్లడించింది. మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో వాటాను చేజిక్కించు కో నున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా తొలుత 47.5 శాతం వాటాను దశలవారీగా 2025 మార్చి 31కల్లా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. కొనుగోలు తీరిలా తొలుత 2023 ఫిబ్రవరి 15కల్లా ఎస్‌ఎఫ్‌పీఎల్‌లో 39.4 శాతం వాటాకుగాను రూ. 175 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఐటీసీ తెలియజేసింది. తదుపరి మరో రూ. 80 కోట్లు వెచ్చించడం ద్వారా 47.5 శాతానికి వాటాను పెంచుకోనున్నట్లు వివరించింది. మిగిలిన 52.5 శాతం వాటాను సైతం తదుపరి దశలలో కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు ఎస్ఎఫ్పీఎల్.. కొత్తతరం డిజిటల్ ఫస్ట్ బ్రాండ్ యోగా బార్ పేరున న్యూట్రిషన్ ప్రొడక్టులను విక్రయిస్తోంది. వేగవంత వృద్ధిలో ఉన్న పౌష్టికాహార విభాగంలో ఏర్పాటైన స్టార్టప్ ఎస్ఎఫ్పీఎల్.. గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో రూ. 68 కోట్ల టర్నోవర్ సాధించింది. -
ఎన్డీటీవీ ఓపెన్ ఆఫర్‌కి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: ఎన్డీటీవీలో అదనంగా 26 శాతం వాటాలను కొనుగోలు చేసే దిశగా ఓపెన్ ఆఫర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన ఓపెన్ ఆఫర్ లెటర్ ముసాయిదాను పరిశీలించి, అభిప్రాయాలు తెలపాల్సిందిగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని కోరింది. ఎన్డీటీవీ వ్యవస్థాపకులకు రూ. 400 కోట్ల రుణాలిచ్చిన విశ్వప్రధాన్ కమర్షియల్ (వీసీపీఎల్) అనే సంస్థను ఈ ఏడాది ఆగస్టులో కొనుగోలు చేయడం ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ 29.18 శాతం వాటాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మైనారిటీ షేర్‌హోల్డర్ల నుండి మరో 26 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 17న ఓపెన్ ఆఫర్ ప్రకటించనున్నట్లు అప్పట్లో వీసీపీఎల్ తెలిపింది. కానీ డీల్‌పై ఎన్డీటీవీ ప్రమోటర్ అయిన ఆర్ఆర్పీఆర్ అనుసరిస్తున్న ప్రతికూల వైఖరి కారణంగా సాధ్యపడలేదని తాజాగా పేర్కొంది. ఓపెన్ ఆఫర్ ప్రకారం షేరు ఒక్కింటికి రూ. 294 చొప్పున దాదాపు 1.67 కోట్ల షేర్లను (26 శాతం) వీసీపీఎల్ కొనుగోలు చేస్తుందంటూ ఇష్యూని నిర్వహిస్తున్న జేఎం ఫైనాన్షియల్ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. దీన్ని బట్టి ఓపెన్ ఆఫర్ అక్టోబర్ 17న ప్రారంభమై నవంబర్ 1న ముగియాలి. మరోవైపు, బుధవారం ఎన్డీటీవీ షేరు రూ. 332.90 వద్ద క్లోజయ్యింది. ఓపెన్ ఆఫర్ ధరతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. -
బ్రిటానియా గూటికి కెనాఫ్రిక్
న్యూఢిల్లీ: బేకరీ ప్రొడక్టుల దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ తాజాగా కెన్యా కంపెనీ కెనాఫ్రిక్ బిస్కట్స్‌ను హస్తగతం చేసుకుంది. పూర్తి అనుబంధ సంస్థ బీఏడీసీవో ద్వారా 51 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది. ఇందుకు నగదు రూపేణా 13.87 కెన్యన్ షిల్లింగ్స్(రూ. 9.2 కోట్లు) చెల్లించినట్లు వెల్లడించింది. తద్వారా ఆఫ్రికా మార్కెట్లలోనూ అమ్మకాలను విస్తరించే వీలు ఏర్పడినట్లు తెలియజేసింది. కెన్యాసహా ఆఫ్రికా మార్కెట్లలో బిస్కట్ల తయారీ, విక్రయాలు చేపట్టే లక్ష్యంతో కెనాఫ్రిక్ను సొంతం చేసుకున్నట్లు వివరించింది. ఈ నెల 3కల్లా లావాదేవీని పూర్తిచేసినట్లు తెలియజేసింది. వెరసి కెనాఫ్రిక్ బిస్కట్స్ అనుబంధ సంస్థగా మారినట్లు తెలియజేసింది. మిగిలిన 49% వాటా కెనాఫ్రిక్ గ్రూప్ కలిగి ఉన్నట్లు వెల్లడించింది. -
సోలార్ టెక్ సంస్థతో ఆర్ఐఎల్ జత
న్యూఢిల్లీ: సోలార్ టెక్ సంస్థ కేలక్స్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొంది. ఇందుకు 1.2 కోట్ల డాలర్లు(రూ. 97 కోట్లు) వెచ్చించినట్లు వెల్లడించింది. పెరోవ్‌స్కైట్ ఆధారిత సోలార్ సాంకేతికతగల కేలక్స్‌లో వాటాను సొంతం చేసుకోవడం ద్వారా నూతన ఇంధన తయారీ సామర్థ్యాలను పటిష్ట పరచుకోనుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ ద్వారా కేలక్స్ కార్పొరేషన్‌తో వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. ఈ కాలిఫోర్నియా సంస్థ భాగస్వామ్యంతో అధిక సామర్థ్యంగల చౌక వ్యయాల సోలార్ మాడ్యూల్స్‌ను తయారు చేయగలమని వివరించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆర్ఐఎల్ సమీకృత ఫొటోవోల్టాయిక్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. -
కిమ్స్ ఖాతాలో మరో ఆసుపత్రి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న కింగ్స్‌వే హాస్పిటల్స్‌లో 51 శాతం వాటాను కైవసం చేసుకుంది. ఈ కొనుగోలు ప్రక్రియలో భాగంగా కింగ్స్‌వే ఆసుపత్రికి రూ.80 కోట్లను కిమ్స్ పెట్టుబడి రూపంలో అందించనుంది. ఈ మొత్తాన్ని రుణ భారం తగ్గించుకోవడానికి, బ్యాలెన్స్ షీట్ బలోపేతానికి వినియోగిస్తారు. కింగ్స్‌వే హాస్పిటల్స్‌కు 300లకుపైగా పడకల సామర్థ్యం ఉంది. మహారాష్ట్రలో నాసిక్ తర్వాత సంస్థకు ఇది రెండవ కేంద్రం అని కిమ్స్ ఎండీ భాస్కర రావు తెలిపారు. -
ఎన్డీటీవీ ఏజీఎం వాయిదా
న్యూఢిల్లీ: అదనంగా 26 శాతం వాటాల కొనుగోలు కోసం అదానీ గ్రూప్ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ తమ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని (ఏజీఎం) సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. వాస్తవానికి ఇది సెప్టెంబర్ 20న జరగాల్సి ఉంది. అనుబంధ సంస్థ వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో అదానీ గ్రూప్ పరోక్షంగా 29.18 శాతం వాటాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం మరో 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్దిష్ట నిబంధనల అమలు కోసం 34వ ఏజీఎంను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
భారతీ టెలికంకు సింగ్టెల్ వాటా
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్‌టెల్‌కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్ సింగపూర్ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుటుంబంతోపాటు, సింగ్టెల్ సైతం ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ గ్రూప్ వాటా 29.7 శాతానికి చేరనుంది. రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
సెబీ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: కంపెనీకి చెందిన ప్రమోటర్ల వాటా కొనుగోలుకి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి తప్పనిసరి అంటూ వార్తా చానళ్ల మీడియా సంస్థ ఎన్డీటీవీ తాజాగా స్పష్టం చేసింది. చెల్లించని రుణాలస్థానే ప్రమోటర్ గ్రూప్ సంస్థ ఆర్ఆర్పీఆర్ లిమిటెడ్‌లో వాటాను చేజిక్కించుకునేందుకు వీసీపీఎల్.. సెబీ అనుమతి పొందవలసి ఉన్నట్లు పేర్కొంది. 2020 నవంబర్ 27న కంపెనీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్, రాధికా రాయ్‌లను సెబీ రెండేళ్లపాటు సెక్యూరిటీ మార్కెట్ల నుంచి నిషేధించింది. తద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సెక్యూరిటీల కొనుగోలు, విక్రయం లేదా సెక్యూరిటీల మార్కెట్లలో ఏ ఇతర కార్యకలాపాలు చేపట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ నిషేధం 2022 నవంబర్ 26న ముగియనున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఎన్డీటీవీ వివరించింది. దీంతో గడువుకంటే ముందుగానే ఆర్ఆర్పీఆర్లో వీసీపీఎల్ వాటాను సొంతం చేసుకునేందుకు సెబీ అనుమతి తప్పనిసరిగా తెలియజేసింది. మంగళవారం వీసీపీఎల్ ద్వారా ఎన్డీటీవీలో 29.18% వాటాను కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. దీంతో సాధారణ వాటాదారుల నుంచి మరో 26% వాటా కొనుగోలుకి షేరుకి రూ. 294 ధరలో ఓపెన్ ఆఫర్‌ను సైతం ప్రకటించిన విషయం విదితమే. వారెంట్ల నిబంధనలు కీలకం ఎన్డీటీవీ బలవంతపు టేకోవర్‌కు అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలలో వారెంట్ల జారీలో చోటుచేసుకున్న నిబంధనలు కీలకంగా నిలవనున్నట్లు న్యాయనిపుణులు అభిప్రాయపడ్డారు. అదానీ గ్రూప్‌నకు చెందిన వీసీపీఎల్ నుంచి వారెంట్ల జారీ ద్వారా ఎన్డీటీవీ ప్రమోటర్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ గతంలో దాదాపు రూ. 404 కోట్ల రుణాలు పొందింది. వీటిని ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఆర్ఆర్పీఆర్లో 99.9 శాతం వాటాను పొందినట్లు అదానీ గ్రూప్ తెలియజేసింది. వెరసి ఎన్డీటీవీలో 29.18 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. అయితే ప్రమోటర్లకు ఈ విషయం తెలియదంటూ ఎన్డీటీవీ పేర్కొంది. దీంతో వారెంట్ల జారీలో అంగీకరించిన నిబంధనలు ఇకపై కీలక పాత్ర పోషించనున్నట్లు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. రేటింగ్‌పై ఎఫెక్ట్... బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ ఇతర కంపెనీల కొనుగోళ్ల ద్వారా భారీగా విస్తరిస్తోంది. అయితే రుణాల ద్వారా చేపడుతున్న ఈ కొనుగోళ్లు కంపెనీ రేటింగ్‌పై ఒత్తిడిని పెంచుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తాజాగా పేర్కొంది. 1988లో కమోడిటీల ట్రేడర్‌గా ప్రారంభమైన గ్రూప్ మైనింగ్, పోర్టులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు తదితర పలు రంగాలలో భారీగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో ఇటీవలే సిమెంట్ రంగంలో 10.5 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లకు తెరతీసింది. -
Elon Musk: ట్విటర్‌కు మస్క్ వల!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ ఇంక్‌పై ఎలన్ మస్క్ కన్నేశారు. ఇప్పటికే 9.1 శాతం వాటా కలిగిన మస్క్ తాజాగా కంపెనీ టేకోవర్‌కు ఆఫర్ ప్రకటించారు. షేరుకి 54.2 డాలర్ల చొప్పున నగదు రూపంలో చెల్లించనున్నట్లు తెలియజేశారు. 100 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. వెరసి ట్విటర్ కొనుగోలుకి మస్క్ 43 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 3.23 లక్షల కోట్లు) విలువైన ఆఫర్‌ను ఇచ్చా రు. ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా సీఈవో మస్క్ ఇటీవలే ట్విటర్ బోర్డులో చేరబోనంటూ ప్రకటించిన నేపథ్యంలో టేకోవర్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా నిలిచిన మస్క్ మిగిలిన వాటాను సైతం కొనుగోలు చేసేందుకు తాజాగా ప్రతిపాదించినట్లు ట్విటర్ ఇంక్ నియంత్రణ సంస్థలు(ఎస్ఈసీ, ఎక్సే్ఛంజీలు)కు వెల్లడించింది. ఇందుకు వాటాదా రులకు అత్యుత్తమ, తుది ధరను ఆఫర్ చేసినట్లు ఈ సందర్భంగా మస్క్ సైతం ఎస్ఈసీకి తెలియజేశారు. ట్విట్టర్లో వాటా వివరాలు వెల్లడించిన ముందు రోజు అంటే ఈ నెల(ఏప్రిల్) 1నాటి ధరతో చూస్తే తాజా ఆఫర్ 38 శాతం అధికమని, ఇక షేరు కొనుగోళ్లు ప్రారంభించకముందు అంటే జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియమని మస్క్ ఎస్ఈసీకి తెలియజేశారు. ఫ్రీ స్పీచ్‌కు దన్ను... ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్చ(ఫ్రీ స్పీచ్)కి భారీ అవకాశాలు కల్పించగల సత్తా ట్విటర్ ప్లాట్ఫామ్కున్నట్లు మస్క్ అభిప్రాయపడ్డారు. దీంతో ట్విట్టర్లో ఇన్వెస్ట్ చేసినట్లు నియంత్రణ సంస్థలకు తెలియజేశారు. ప్రజాస్వామ్యం మనగలిగేందుకు సామాజికపరంగా ఫ్రీ స్పీచ్ దన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. అయితే ట్విట్టర్లో ఇన్వెస్ట్ చేసినప్పటినుంచీ కంపెనీ ఈ సామాజిక ఆవశ్యకతకు ప్రస్తుత విధానంలో మద్దతివ్వలేకపోవడం లేదా కొనసాగించలేకపోవచ్చని తెలుసుకున్నట్లు వివరించారు. దీంతో ట్విటర్ ప్రయివేట్ కంపెనీగా మారవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జనవరి 31 మొదలు ట్విటర్ షేర్లను రోజువారీగా కొనుగోలు చేస్తున్నట్లు ఇటీవల నియంత్రణ సంస్థలకు మస్క్ వెల్లడించిన విషయం విదితమే. అప్పటికి వ్యాన్‌గార్డ్ గ్రూప్‌నకు చెందిన వివిధ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు మాత్రమే అధిక సంఖ్యలో ట్విటర్ షేర్ల ను కలిగి ఉన్నా యి. కాగా, మస్క్ ఆఫర్‌పై కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఉద్యోగులతో చర్చిం చనుందని సమాచారం. 14.9 శాతానికే... సోషల్ మీడియా దిగ్గజంలో 9.1 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు మస్క్ వెల్లడించాక బోర్డులో సీటును ట్విటర్ ఆఫర్ చేసింది. అయితే 14.9 శాతానికి మించి వాటాను కొనుగోలు చేసేందుకు వీలులేకుండా షరతులు పెట్టింది. దీంతో మస్క్ ఈ డీల్ నుంచి వెనక్కి తగ్గారు. ట్విటర్ ప్లాట్ఫామ్లో 8.1 కోట్లమంది ఫాలోవర్స్‌తో మస్క్ సుప్రసిద్ధులయ్యారు. పాప్ స్టార్స్ అరియానా గ్రాండే, లేడీ గాగా తరహాలో ఫాలోవర్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ విభిన్నతరహాగా చేస్తున్న ట్వీట్ల కారణంగా కొన్ని సందర్భాలలో ఎస్ఈసీ తదితరాల నుంచి సమస్యలను సైతం మస్క్ ఎదుర్కొన్నారు. 2018లో మస్క్‌తోపాటు, ఈవీ కంపెనీ టెస్లా పౌర జరిమానాలకింద 4 కోట్ల డాలర్లు చెల్లించేందుకు అంగీకరించడం గమనార్హం! షేరుకి 420 డాలర్ల ధరలో టెస్లాను ప్రయవేట్ చేసేందుకు సొమ్మును కలిగి ఉన్నట్లు మస్క్ ట్వీట్ చేశారు. ఇది జరగనప్పటికీ టెస్లా షేరు విలువ జోరందుకుంది. వెరసి మస్క్ చిక్కుల్లోపడగా.. ఇటీవల ట్విటర్ షేర్ల కొనుగోలు వివరాలను ఆలస్యంగా వెల్లడించడంతో ఎస్ఈసీ ఆగ్రహానికి సైతం గురయ్యారు. ఫ్రీ స్పీచ్‌కు బలమైన మద్దతుదారుగా మస్క్ తనను తాను అభివర్ణించుకుంటారు. అంతేకాకుండా ఫ్రీ స్పీచ్ మనుగడ విషయంలో ట్విటర్ ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. గతంలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వెల్లడించగా.. ట్విటర్ కంటెంట్ నిబంధనల ఉల్లంఘనలతో ఇతర మితవాద రాజకీయ నేతల అకౌంట్లు సైతం నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. కాగా.. మస్క్ వాటాసహా ట్విటర్ ఆఫర్ 43 బిలియన్ డాలర్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. షేరు జోరు... మస్క్ చేసిన తాజా ప్రతిపాదన కారణంగా ట్విటర్ షేరుకి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో బుధవారం ముగింపు ధర 45.85 డాలర్లతో పోలిస్తే గురువారం 48.37 డాలర్ల వద్ద ప్రారంభమైంది. తదుపరి 3.2 శాతం లాభంతో 47.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బుధవారం ముగింపుతో పోలిస్తే మస్క్ ఆఫర్ ధర 18% పైగా ప్రీమియంకావడం గమనార్హం! కాగా.. మస్క్ ఈవీ కంపెనీ టెస్లా ఇంక్ షేరు 3.3 శాతం పతనమై 989 డాలర్ల వద్ద కదులుతోంది. I made an offer https://t.co/VvreuPMeLu — Elon Musk (@elonmusk) April 14, 2022 చదవండి: ఎలన్ మస్క్ మాయ.. అడుగుపెట్టాడో లేదో ట్విటర్‌పై కాసులవర్షం..! -
గెయిల్ బైబ్యాక్ బాట
న్యూఢిల్లీ: యుటిలిటీ పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా బోర్డు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గురువారం(31న) సమావేశమైన బోర్డు పెయిడప్ ఈక్విటీలో 2.5 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు ఆమోదముద్ర వేసినట్లు గెయిల్ పేర్కొంది. షేరుకి రూ. 190 ధర మించకుండా 5.7 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,083 కోట్లవరకూ వెచ్చించనుంది. ప్రస్తుత బైబ్యాక్ ధర ఎన్ఎస్ఈలో బుధవారం(30న) ముగింపు ధరతో పోలిస్తే 24% అధికంకావడం గమనార్హం! గతంలోనూ..: గెయిల్ 2020–21 లోనూ షేరుకి రూ. 150 ధరలో రూ. 1,046 కోట్లతో షేర్ల బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 51.8% వాటా ఉంది. దీంతో ప్రభుత్వం సైతం బైబ్యాక్‌లో పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది. గత బైబ్యాక్‌లో ప్రభుత్వ వాటాకు రూ. 747 కోట్లు లభించిన సంగతి తెలిసిందే. కాగా.. 2021–22లో కంపెనీ మధ్యంతర డివిడెండ్ కింద రికార్డ్ సృష్టిస్తూ రూ. 3,996 కోట్లు(90 శాతం) చెల్లించింది. ఇక 2009, 2017, 2018 లతోపాటు 2020లోనూ వాటాదారులకు బోనస్ షేర్లను సైతం జారీ చేసింది. ఎన్ఎస్ఈలో గెయిల్ షేరు 2 శాతం పుంజుకుని రూ. 156 వద్ద ముగిసింది. -
ఎయిరిండియా విక్రయ ఒప్పందం ఖరారు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా విక్రయానికి సంబంధించి టాటా సన్స్, కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సంతకాలు చేశాయి. ఎయిరిండియా డైరెక్టర్ (ఫైనాన్స్) వినోద్ హెజ్మాదీ, పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి సత్యేంద్ర మిశ్రా, టాటా గ్రూప్‌నకు చెందిన సుప్రకాష్ ముఖోపాధ్యాయ్.. షేర్ల కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేశారు. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ... మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఈ విషయం ట్వీట్ చేశారు. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. ఎయిరిండియాలో 100 శాతం వాటాలను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ సుమారు రూ. 18,000 కోట్లు. ఇందులో రూ. 2,700 కోట్ల మొత్తాన్ని టాలేస్ నగదు రూపంలో చెల్లించనుండగా, మిగతా రూ. 15,300 కోట్ల రుణభారం కంపెనీకి బదిలీ కానుంది. ఎయిరిండియా విక్రయాన్ని నిర్ధారిస్తూ అక్టోబర్ 11న టాటా గ్రూప్‌నకు కేంద్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోఐ) జారీ చేసింది. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణ భారం రూ. 61,562 కోట్లుగా ఉంది. ఇందులో 75 శాతం భారాన్ని (రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు ప్రభుత్వం బదలాయిస్తోంది. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను రూ. 12,906 కోట్ల రిజర్వ్ ధరతో వేలం వేయగా, అత్యధికంగా కోట్ చేసి టాటా గ్రూప్ విజేతగా నిల్చింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ రూ. 15,100 కోట్లకు బిడ్ వేశారు. -
కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై సెబీ రూ. 10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ: రీగాలియా రియాలిటీ లిమిటెడ్ సంస్థలో షేర్లను కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించే విషయంలో జాప్యం చేసినందుకు గాను కార్వీ ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 10 లక్షల జరిమానా విధించింది. నిర్దేశిత వ్యవధిలోగా తప్పనిసరిగా ప్రకటించకపోవడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే జరిమానా విధించామని సెబీ పేర్కొంది. వివరాల్లోకి వెడితే రీగాలియా ప్రమోటర్లు 55.56 శాతం వాటాలను తనఖా పెట్టి కార్వీ నుంచి రూ. 7 కోట్లు రుణం తీసుకున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో తనఖా పెట్టిన షేర్లను కార్వీ స్వాధీనం చేసుకుంది. దీంతో రీగాలియాలో కార్వీ వాటాలు సెబీ నిర్దేశిత స్థాయికి మించి 55.56 శాతానికి చేరాయి. ఫలితంగా పబ్లిక్ షేర్‌హోల్డర్ల నుంచి షేర్ల కొనుగోలుకు 45 రోజుల్లోగా ఓపెన్ ఆఫర్ ప్రకటించాలని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ని ఆశ్రయించినప్పటికీ కార్వీకి చుక్కెదురైంది. సెబీని సమర్థిస్తూ 2018 ఏప్రిల్‌లో శాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా కార్వీ బహిరంగ ప్రకటన చేయాల్సింది. కానీ 81 రోజుల తర్వాత 2018 ఆగస్టులో కార్వీ ఓపెన్ ఆఫర్ ప్రకటన చేసింది. ఇది నిబంధనల ఉల్లంఘన కింద భావిస్తూ సెబీ తాజాగా జరిమానా విధించింది. -
అదానీ గ్రీన్‌లో టోటల్‌కు వాటా
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌నకు చెందిన పునరుత్పాదక ఇంధన కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీలో వాటా కొనుగోలుకి ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా అదానీ గ్రీన్‌లో 20% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు దాదాపు రూ.18,200 కోట్లు (2.5 బిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఒప్పందం ద్వారా సోలార్ ఎనర్జీ అభివృద్ధిలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న అదానీ గ్రీన్ బోర్డులో టోటల్‌కు సీటు లభించనుంది. అంతేకాకుండా 2.35 గిగావాట్స్ సోలార్ ఆస్తుల పోర్ట్‌ఫోలియోలోనూ 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు రెండు కంపెనీలూ సంయుక్తంగా వెల్లడించాయి. కంపెనీలో ప్రమోటర్లకు 74.92 శాతం వాటా ఉంది. దీనిలో 20 శాతం వాటాను టోటల్‌కు విక్రయించనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు చెందిన 16.4 శాతం వాటాకు సమానమైన 25.65 కోట్ల షేర్లను టోటల్ కొనుగోలు చేసినట్లు అదానీ గ్రీన్ తాజాగా వెల్లడించింది. ఇందుకు రూ. 14,600 కోట్లు(2 బిలియన్ డాలర్లు) చెల్లించినట్లు తెలియజేసింది. తదుపరి మరో 50 కోట్ల డాలర్ల(రూ. 3,600 కోట్లు)తో మిగిలిన వాటాను సైతం సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇతర కంపెనీలలో..: చమురు, ఇంధన రంగ ఫ్రాన్స్ దిగ్గజం టోటల్ 2018లో గౌతమ్ అదానీ గ్రూప్‌లోని ఇతర కంపెనీలలోనూ వాటాల కొనుగోలుకి ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటా, ఒడిషాలో నిర్మాణంలో ఉన్న ధమ్రా ఎల్ఎన్జీ ప్రాజెక్ట్‌లో 50 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు అంగీకరించింది. కాగా.. అదానీ ఎనర్జీలో 20 శాతం వాటా కొనుగోలు ద్వారా అదానీ గ్రూప్‌తో భాగస్వామ్యాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు టోటల్ పేర్కొంది. తద్వారా దేశీయంగా శుద్ధ ఇంధన రంగంలో రెండు కంపెనీలూ మార్పులకు కృషి చేయనున్నట్లు తెలియజేసింది. చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ విద్యుత్, పునరుత్పాదక ఇంధనాలవైపు మళ్లనున్నట్లు వివరించింది. 2025కల్లా స్థూలంగా 35 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ ప్రస్తుత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 7 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాదిలో 10 గిగావాట్స్‌కు చేరాలని భావిస్తోంది. ఇక మరోపక్క ఇదే సమయంలో అదానీ గ్రీన్ 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని చేరుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం సంస్థ కాంట్రాక్టెడ్ సామర్థ్యం 14.6 గిగావాట్లుగా నమోదైంది. 3 గిగావాట్ల నిర్వహణలో ఉండగా.. మరో 3 జీడబ్ల్యూ నిర్మాణంలో ఉంది. అంతేకాకుండా 8.6 జీడబ్ల్యూ అభివృద్ధి దశలో ఉంది. 2015లో ఆరంభం... అదానీ గ్రీన్ తమిళనాడులో 648 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులతో 2015లో ప్రారంభమైంది. ఇది అంతర్జాతీయంగా ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్‌కాగా.. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ విద్యుదుత్పాదక ఆస్తులు కలిగిన సంస్థగా ఆవిర్భవించింది. అదానీ గ్రీన్‌లో ప్రవేశించడం తమ వ్యూహాలలో మైలురాయివంటిదని టోటల్ సీఈవో, చైర్మన్ ప్యాట్రిక్ పయానే పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, సహజవాయు విభాగాలలో విస్తరించేందుకు భారత మార్కెట్ కీలకమన్నారు. చౌక పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తికి వ్యూహాలను పంచుకోనున్నట్లు అదానీ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. 2030కల్లా 450 గిగావాట్ల పునరు త్పాదక ఇంధనాన్ని సాధించేందుకు ఇరు కంపెనీలూ కలసి పనిచేస్తాయని వివరించారు.