రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను | Led by ONGC Videsh, Indian oil companies mull buying stake in Rosneft | Sakshi
Sakshi News home page

రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను

Published Fri, Jun 24 2016 1:12 AM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను

రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను

19.5% వాటా విక్రయించనున్న రాస్‌నెఫ్ట్
కొంత వాటా కొనుగోలుపై భారత కంపెనీల కన్ను

 న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్‌సీలో  19.5% వాటాను రష్యా విక్రయిం చనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ వాటాలో కొంత కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలు యోచిస్తున్నాయని వివరించారు.ఈ నెల మొదట్లో ధర్మేంద్ర ప్రధాన్ రష్యా రాజధాని మాస్కోను సందర్శించారు.

 ఓవీఎల్ చర్చలు: ప్రస్తుతం ఓఎన్‌జీసీ కంపెనీ విదేశీ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్ వాటా కొనుగోలు నిమిత్తం చర్చలు జరపుతోందని, త్వరలోనే మిగిలిన చమురు కంపెనీలు చర్చల్లో భాగం పంచుకోనున్నాయని ప్రధాన్ పేర్కొన్నారు. బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి రష్యా ప్రభుత్వం ఈ వాటాను విక్రయిస్తోందని,  ఈ వాటాను ప్రజలకు విక్రయించడం కంటే వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించడానికే రష్యా మొగ్గు చూపుతోందని వివరించారు.

 భారత కంపెనీలకు వాంకోర్‌లో 50% వాటా
కాగా గత నెలలోనే రాస్‌నెఫ్ట్ సంస్థ, రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రమైన వాంకోర్‌లో 15 శాతం వాటాను 126.8 కోట్ల డాలర్లకు ఓవీఎల్‌కు విక్రయించింది. ఈ చమురు క్షేత్రంలో మరో 23.9% వాటాను ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొ, భారత పెట్రోలియం కార్పొలతో కూడిన కన్సార్షియమ్‌కు 200 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనలో ఒక ఒప్పందం కుదిరింది. ఇదే చమురు క్షేత్రంలో మరో 11% వాటాను ఓవీఎల్‌కు విక్రయించడానికి ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ పూర్తయితే ఈ చమురు క్షేత్రంలో భారత కంపెనీల వాటా దాదాపు 50%కి చేరుతుందని ప్రధాన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement