Indian oil companies
-
రష్యాలో చిక్కుకుపోయిన దేశీ ఆయిల్ కంపెనీల ఆదాయం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిగా రష్యాపై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలు ప్రస్తుతం భారత ఆయిల్ కంపెనీలకు తలనొప్పిగా మారాయి. ఆర్థిక ఆంక్షల నుంచి గట్టెక్కడంలో భాగంగా రష్యా తన దగ్గరున్న డాలర్లను భద్రపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. విదేశాలకు డాలర్లను పంపడంపై ఆంక్షలు విధించింది. దీంతో రష్యాలో ఇన్వెస్ట్ చేసిన దేశీ ఆయిల్ కంపెనీలకు రావాల్సిన 8 బిలియన్ రూబుళ్ల (రూ. 1,000 కోట్ల) మేర డివిడెండ్ ఆదాయం చిక్కుబడిపోయింది. ‘ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్టుల నుంచి మాకు తరచుగా డివిడెండ్ వచ్చేసేది. కానీ, ఉక్రెయిన్‌తో యుద్ధంతో విదేశీ మారకం రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ దేశం నుంచి డాలర్లను ఇతర దేశాలకు పంపడంపై రష్యా ఆంక్షలు విధించింది. ఫలితంగా భారత కన్సార్షియంకు రావాల్సిన దాదాపు 8 బిలియన్ రూబుళ్ల డివిడెండ్ ఆదాయం రష్యాలో ఆగిపోయింది‘ అని ఆయిల్ ఇండియా డైరెక్టర్ హరీష్ మాధవ్ తెలిపారు. యుద్ధం మొదలు కావడానికి ముందు డివిడెండ్ ఆదాయం అంతా వచ్చేసిందని, కానీ ఆ తర్వాత నుంచి ఆగిపోయిందని పేర్కొన్నారు. అయితే, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిస్థితి చక్కబడిన తర్వాత నిధులు తిరిగి రాగలవని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, తమ పెట్టుబడులపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావమేమీ లేదని ఓఐఎల్ (ఆయిల్ ఇండియా) చైర్మన్ ఎస్సీ మిశ్రా తెలిపారు. ఓఐఎల్, ఐవోసీ, ఓఎన్జీసీ విదేశ్ తదితర దేశీ చమురు కంపెనీలు రష్యాలో నాలుగు వేర్వేరు అసెట్లలో 5.46 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసాయి. వాంకోర్‌నెఫ్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ క్షేత్రం లో 49.9 శాతం, టీఏఏఎస్–యూర్యాఖ్ క్షేత్రంలో 29.9 శాతం వాటాలు కొనుగోలు చేశాయి. ఆయా క్షేత్రాల గ్యాస్, చమురు విక్రయాల ద్వారా వచ్చే లాభాలపై డివిడెండ్లు అందుకుంటున్నాయి. -
Petrol Prices: పెట్రో పరుగు, చెన్నైలో కూడా సెంచరీ
సాక్షి, ముంబై: రెండు రోజులు విరామం తరువాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోల్‌పై 35పైసలు పెరగ్గా, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. జూలై నెలలో మొదటి పెరుగుదల. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్‌ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72 పలుకుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు 12 రాష్ట్రాలున్నాయి. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఢిల్లీలో పెట్రోల్ రూ. 99.16, డీజిల్ రూ. 89.18 ముంబైలో పెట్రోల్ రూ.105.24; డీజిల్ రూ. 96.72 కోల్‌కతాలో పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ. 92.03 బెంగళూరులో పెట్రోల్ రూ.102.48; డీజిల్ రూ.94.54 హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.05; డీజిల్ రూ.97.20 చదవండి: Stockmarkets: ఆటో జోరు, ఐటీ బేజారు -
Petrol, Diesel Price: మళ్లీ పెట్రో షాక్!
సాక్షి, ముంబై: పలు నగరాల్లో సెంచరీ మార్క్‌ను దాటి పరుగులు పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహనదారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపులో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర 101 మార్క్‌ను తాకింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు,డీజిల్ 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర. 94.76, డీజిల్ ధర. 85.66గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో లీటరు పెట్రోలు ధర 100 మార్కును ఇప్పటికే అధిగమించిన సంగతి తెలిసిందే. పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్ ధర రూ. 100.98 , డీజిల్ 92.99 చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 96.23, డీజిల్ ధర. 90.38 కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 94.76, డీజిల్ రూ. 88.51 హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.98.48, డీజిల్ రూ. 93.38 అమరావతిలో పెట్రోల్ ధర రూ. 100.93, డీజిల్ రూ. 95.23 వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ. 99.69, డీజిల్ రూ. 94.03 చదవండి: దీర్ఘాయుష్షు: మనిషి 120 సంవత్సరాలు జీవించవచ్చు! -
12 వ రోజూ పెట్రో సెగ
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోలు , డీజిలు ధరలు రోజు రోజుకు పెను భారంగా మారుతున్నాయి. దేశీయంగా పెరుగుతూ వస్తున్న ధరలు వరుసగా 12వ రోజు గురువారం కూడా అదే బాటలో సాగాయి. తాజాగా పెట్రోలుపై 46-53 పైసలు, డీజిల్‌పై 54-64 పైసలు పెరిగింది. దీంతో ఇప్పటివరకు పెట్రోలు ధర లీటరుకు 6 రూపాయల 55 పైసలు, డీజిలు ధర 7 రూపాయల 4 పైసలు చొప్పున పెరిగింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిలు ధరలు లీటరుకు న్యూఢిల్లీ : పెట్రోలు ధర రూ. 77.81 డీజిల్ రూ.76.43 ముంబై : పెట్రోలు ధర రూ. 84.66, డీజిల్ రూ.74.93 చెన్నై: పెట్రోలు ధర రూ. 81.32 డీజిల్ రూ.74.23 హైదరాబాద్ : పెట్రోలు ధర రూ.80.77, డీజిల్ రూ.74.70 అమరావతి : పెట్రోలు ధర రూ. 81.99 డీజిల్ రూ.75.14 ముడి చమురు అంతర్జాతీయంగా భారీగా పడిపోతున్నా..దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయి వైపు పరుగులు పెడుతున్నాయి. జూన్ 6 న మొదలైన పెట్రో ధరల పెంపు ప్రతీ రోజు కొనసాగుతూనే ఉంది. ఇదే తీరు కొనసాగితే కొద్ది రోజుల్లోనే కొన్ని రాష్ట్రాల్లో రేటు రూ. 100 కూడా దాటేస్తుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. -
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు ఆవిరి!
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. గతంలో గుజరాత్, కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సమయంలో ప్రభుత్వం ధరల పెరుగుదలను నిలిపివేసిన మాదిరిగా ఈసారి కూడా తాత్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్–మే సమయంలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ఉండగా.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈకాలంలో ధరల పెంపు నిర్ణయం తీసుకోవద్దని ఆదేశించే అవకాశం ఉందని అంచనావేస్తోంది. ఈ నిర్ణయం వెలువడితే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల లాభాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషించింది. -
ఇది కూడా తగ్గింపేనా..?
-
పెట్రోల్ ధరల తగ్గింపు.. జనం సంబరాలు
న్యూఢిల్లీ : గత 16 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వాహనదారులకు చుక్కలు చూపించిన ఆయిల్ కంపెనీలు నేడు జనానికి సర్ప్రైజ్ ఇచ్చాయి. వాహనదారులకు ఊరట కల్పిస్తున్నామని.. పెట్రోల్ ధరలను 60 పైసలు, డీజిల్ ధరలపై 56 పైసలు తగ్గించామంటూ ప్రకటనలు ఇచ్చాయి. హమ్మయ్య.. కాస్తో కూస్తో ధరలు తగ్గాయి కదా..! అని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనూహ్యంగా మరో ప్రకటన చేసింది. రెండు మూడు గంటల వ్యవధిలోనే తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే తగ్గించామంటూ సవరణ ప్రకటన వెలువరించి జనంతో జోకులు చేసింది. పెట్రోల్, డీజిల్ విక్రయించే ధరలను పోస్టు చేసే తమ వెబ్సైట్లో సాంకేతిక సమస్య నెలకొందని, పెట్రోల్, డీజిల్ ధరలను పునఃసమీక్షిస్తున్నామంటూ ప్రకటించింది. ఇంధన ధరల తగ్గింపు స్వల్పమేనని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. Indian Oil Corporation corrects earlier figures, Petrol prices went down not by 60 paise in Delhi & 59 paise in Mumbai but by just 1 paise. Diesel prices also went down by just 1 paise instead of 56 paise in Delhi & 59 paise in Mumbai pic.twitter.com/OXqR2QEIBP — ANI (@ANI) 30 May 2018 ఈ పైసా తగ్గింపుతో తామేదో గొప్ప మనసును చాటుకున్నట్టు ప్రకటనలు ఇస్తూ.. ఆయిల్ కంపెనీలు జనాన్ని వేళాకోళం చేస్తున్నాయి. పెంచేటప్పుడు రూపాయల్లో బాదేసి, తగ్గించేటప్పుడు ఒక్క పైసా రెండు పైసలు తగ్గించి జనం సంబురాలు చేసుకోండంటూ విడ్డూరపు ప్రకటనలు ఇవ్వడమేంటని ప్రజలు మండిపడుతున్నారు. పైసా తగ్గింపుతో తామేమీ పండుగ చేసుకోవాలంటూ ఆయిల్ కంపెనీలను దుమ్మెత్తి పోస్తున్నారు. పైసా తగ్గింపు ఎందుకని? అది ఎవరికి లాభమని? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఆయిల్ కంపెనీలు ఎంతమేర ధరలను అమలు చేస్తున్నాయి, వాటిని డీలర్లు ఏ మేరకు పాటిస్తున్నారు? అన్నది ప్రశ్నార్థకమే. ఇండియన్ ఆయిల్ కంపెనీలే ఒక్క పైసా తగ్గిస్తే, ఇంక డీలర్లేమీ అమలు చేస్తారంటూ మండిపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో 19 రోజుల పాటు ఎలాంటి చడీచప్పుడు లేకుండా.. ధరలను యథావిధిగా ఉంచిన కంపెనీలు, ఆ ఎన్నికలు అయిపోవడమే తమదే రాజ్యం అన్నంటూ వాహనదారులకు చుక్కలు చూపిస్తూ వస్తున్నాయి. ఆ రోజు నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిందే కానీ, తగ్గింది లేదు. రికార్డు స్థాయిలో వాహనదారులను బాదేస్తూ.. తమ రెవెన్యూలను దండీగా లాగేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పులు చేపడతామని, ఆ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామంటూ రోజువారీ సమీక్షను చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రయోజనం అంటే.. ఎంతో అనుకుని సంబుర పడిపోతారని ముందే ఊహించిన ఆయిల్ కంపెనీలు, తాము తగ్గించేది ఒక్క పైసా, రెండు పైసలే అంటూ ఈ ప్రకటనలు చేస్తూ.. వాహనదారులను మరింత ఉడికిస్తున్నాయి. చదవండి... (శుభవార్త : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి) -
స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్
ముంబై : పెట్రోల్ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు పెట్రోల్ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్ సైతం ఆల్-టైమ్ హైలో రూ.65.46గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం 2013 సెప్టెంబర్ నుంచి ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల దూకుడు కొనసాగుతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ప్రకారం శనివారం పెట్రోల్ ధరలు న్యూఢిల్లీలో రూ.74.21గా, కోల్‌కత్తాలో రూ.76.91గా, ముంబైలో రూ.82.06గా, చెన్నైలో రూ.76.99గా ఉన్నాయి. అదేవిధంగా డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.65.46గా, కోల్‌కత్తాలో రూ.68.16గా, ముంబైలో రూ.69.7గా, చెన్నైలో రూ.69.06గా నమోదయ్యాయి. గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నాటి నుంచి చమురు ధరలు పెరుగుతూ వచ్చి ప్రస్తుతం అత్యధిక స్థాయిలకు చేరుకుంటున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయిలను చేరుకుంటున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఎక్సైజ్ డ్యూటీ కోతలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. 2017 అక్టోబర్‌లో మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. -
18% పెరిగిన ఐవోసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు రిటైలింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రిఫైనరీ మార్జిన్లు మెరుగుపడడంతో కంపెనీ లాభం 18.4 శాతం పెరిగి రూ.3,696 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,121 కోట్లుగానే ఉంది. ఆదాయం రూ.1,10,637 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,00,260 కోట్లు. ప్రతి బ్యారెల్ ముడి చమురు శుద్ధిపై స్థూల మార్జిన్ సెప్టెంబర్ క్వార్టర్లో 7.98 డాలర్లుగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో మార్జిన్ 4.32 డాలర్లతోపోలిస్తే దాదాపు రెట్టింపైంది. దీనికి తోడు ఇన్వెంటరీ లాభాలు (కొన్న రేటు నుంచి మార్కెట్లో విక్రయించిన రేటుకు మధ్య వ్యత్యాసం) రూపంలో కంపెనీకి కలిసొచ్చింది. రూ.1,056 కోట్లను కంపెనీ ఈ రూపంలో ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఇన్వెంటరీ రూపంలో రూ.686 కోట్లను నష్టపోవడం గమనార్హం. దేశీయంగా ఇంధన విక్రయాలు 18.4 మిలియన్ టన్నుల నుంచి 19 మిలియన్ టన్నులకు పెరగ్గా, ఎగుమతులు మాత్రం 52 శాతం అధికంగా 1.877 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ 16.1 మిలియన్ టన్నుల ముడి చమురును ఇంధనంగా మార్చింది. అంతకుముందు ఏడాది కాలంలో ఇది 15.6 మిలియన్ టన్నులుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో ఆదాయం రూ.2,07,458 కోట్ల నుంచి రూ.2,38,828 కోట్లకు పెరిగింది. నికర లాభం మాత్రం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే 11,391 కోట్ల నుంచి రూ.8,245 కోట్లకు తగ్గిపోయింది. దీనికి ఇన్వెంటరీ రూపంలో ఎదురైన నష్టాలే కారణమని కంపెనీ తెలిపింది. ఏప్రిల్–సెస్టెంబర్ మధ్య స్థూల రిఫైనరీ మార్జిన్ బ్యారెల్‌కు 6.08 డాలర్లుగా ఉండగా, గతేడాది ఇదే కాలంలో 9.19 డాలర్లుగా ఉండడం గమనార్హం. వడ్డీరహిత రుణంపై ఒడిషా ప్రభుత్వంతో వివాదం పరిష్కరించుకున్నట్టు ఐవోసీ తెలిపింది. అలాగే, హర్యానా రాష్ట్రంలో ప్రవేశ పన్ను చెల్లించాల్సిన అంశం కూడా పరిష్కారమైందని, దీంతో రూ.2,808 కోట్లు వెనక్కి వచ్చాయని వెల్లడించింది. -
రష్యా రాస్ నెఫ్ట్ వాటాపై భారత చమురు కంపెనీల కన్ను
♦ 19.5% వాటా విక్రయించనున్న రాస్‌నెఫ్ట్ ♦ కొంత వాటా కొనుగోలుపై భారత కంపెనీల కన్ను న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజం రాస్‌నెఫ్ట్‌లో వాటా కొనుగోలు కోసం భారత చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. రష్యా ప్రభుత్వ రంగ సంస్థ, రాస్‌నెఫ్ట్ ఓజేఎస్సీలో 19.5% వాటాను రష్యా విక్రయిం చనున్నదని భారత పెట్రోలియమ్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. 1,100 కోట్ల డాలర్ల విలువైన ఈ వాటాను భారత, చైనా కంపెనీలకు విక్రయించడానికి రష్యా ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ వాటాలో కొంత కొనుగోలు చేయాలని మన చమురు కంపెనీలు యోచిస్తున్నాయని వివరించారు.ఈ నెల మొదట్లో ధర్మేంద్ర ప్రధాన్ రష్యా రాజధాని మాస్కోను సందర్శించారు. ఓవీఎల్ చర్చలు: ప్రస్తుతం ఓఎన్జీసీ కంపెనీ విదేశీ విభాగం ఓఎన్జీసీ విదేశ్ వాటా కొనుగోలు నిమిత్తం చర్చలు జరపుతోందని, త్వరలోనే మిగిలిన చమురు కంపెనీలు చర్చల్లో భాగం పంచుకోనున్నాయని ప్రధాన్ పేర్కొన్నారు. బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి రష్యా ప్రభుత్వం ఈ వాటాను విక్రయిస్తోందని, ఈ వాటాను ప్రజలకు విక్రయించడం కంటే వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించడానికే రష్యా మొగ్గు చూపుతోందని వివరించారు. భారత కంపెనీలకు వాంకోర్‌లో 50% వాటా కాగా గత నెలలోనే రాస్‌నెఫ్ట్ సంస్థ, రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రమైన వాంకోర్‌లో 15 శాతం వాటాను 126.8 కోట్ల డాలర్లకు ఓవీఎల్‌కు విక్రయించింది. ఈ చమురు క్షేత్రంలో మరో 23.9% వాటాను ఆయిల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొ, భారత పెట్రోలియం కార్పొలతో కూడిన కన్సార్షియమ్కు 200 కోట్ల డాలర్లకు విక్రయించడానికి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటనలో ఒక ఒప్పందం కుదిరింది. ఇదే చమురు క్షేత్రంలో మరో 11% వాటాను ఓవీఎల్‌కు విక్రయించడానికి ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలన్నీ పూర్తయితే ఈ చమురు క్షేత్రంలో భారత కంపెనీల వాటా దాదాపు 50%కి చేరుతుందని ప్రధాన్ పేర్కొన్నారు.