సాక్షి, ముంబై: రెండు రోజులు విరామం తరువాత ఇంధన ధరలు శుక్రవారం మళ్లీ పరుగందుకున్నాయి. పెట్రోల్‌పై 35పైసలు పెరగ్గా, డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. జూలై నెలలో మొదటి పెరుగుదల. తాజా పెంపుతో ఎనిమిది రాష్ట్ర రాజధానులలో పెట్రోలు ధర సెంచరీ మార్క్‌ను దాటి వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. పెట్రోలు ధర 100 రూపాయలు దాటి నగరాల్లో ఇపుడు చెన్నై చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ.100.13 డీజిల్ రూ.93.72 పలుకుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లడఖ్, బీహార్, కేరళ, తమిళనాడు 12 రాష్ట్రాలున్నాయి.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు
ఢిల్లీలో పెట్రోల్ రూ. 99.16, డీజిల్ రూ. 89.18
ముంబైలో పెట్రోల్ రూ.105.24; డీజిల్ రూ. 96.72
కోల్‌కతాలో పెట్రోల్ రూ.99.04, డీజిల్ రూ. 92.03
బెంగళూరులో పెట్రోల్ రూ.102.48; డీజిల్ రూ.94.54
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ103.05; డీజిల్ రూ.97.20
Comments
Please login to add a commentAdd a comment