సాక్షి, ముంబై: పలు నగరాల్లో సెంచరీ మార్క్‌ను దాటి పరుగులు పెడుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు వాహనదారులకు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత శుక్రవారం మళ్లీ ఇంధన ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. తాజా పెంపులో పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోలు ధర 101 మార్క్‌ను తాకింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరను లీటరుకు 27 పైసలు,డీజిల్ 28 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీ లీటరు పెట్రోల్ ధర. 94.76, డీజిల్ ధర. 85.66గా ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో లీటరు పెట్రోలు ధర 100 మార్కును ఇప్పటికే అధిగమించిన సంగతి తెలిసిందే.
పలు నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు
ముంబైలో పెట్రోల్ ధర రూ. 100.98 , డీజిల్ 92.99
చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధర రూ. 96.23, డీజిల్ ధర. 90.38
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 94.76, డీజిల్ రూ. 88.51
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.98.48, డీజిల్ రూ. 93.38
అమరావతిలో పెట్రోల్ ధర రూ. 100.93, డీజిల్ రూ. 95.23
వైజాగ్‌లో పెట్రోల్ ధర రూ. 99.69, డీజిల్ రూ. 94.03
Comments
Please login to add a commentAdd a comment