60 % కొనుగోలుకు కసరత్తు
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి.
తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్‌లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment