
న్యూఢిల్లీ: సోలార్ టెక్ సంస్థ కేలక్స్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) పేర్కొంది. ఇందుకు 1.2 కోట్ల డాలర్లు(రూ. 97 కోట్లు) వెచ్చించినట్లు వెల్లడించింది. పెరోవ్‌స్కైట్ ఆధారిత సోలార్ సాంకేతికతగల కేలక్స్‌లో వాటాను సొంతం చేసుకోవడం ద్వారా నూతన ఇంధన తయారీ సామర్థ్యాలను పటిష్ట పరచుకోనుంది.
పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ ద్వారా కేలక్స్ కార్పొరేషన్‌తో వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్‌ఐఎల్ తెలియజేసింది. ఈ కాలిఫోర్నియా సంస్థ భాగస్వామ్యంతో అధిక సామర్థ్యంగల చౌక వ్యయాల సోలార్ మాడ్యూల్స్‌ను తయారు చేయగలమని వివరించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆర్‌ఐఎల్ సమీకృత ఫొటోవోల్టాయిక్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment