solar technology
-
సౌర పడవలతో చేపలవేట
సాక్షి, హైదరాబాద్: చేపల వేటలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య ప్రయత్నాలను ఆరంభించింది. రాష్ట్రంలోని భారీ జలాశయాల్లో చేపలు పట్టేందుకు మత్స్యకారులకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూర్చేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా తెప్పలతో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులకు సౌరశక్తితో నడిచే పడవలు అందజేయాలని నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఉనికిలో ఉన్న సుమారు వందకుపైగా జలాశయాల్లో.. దాదాపు లక్ష మందికి పైగా మత్య్సకారులకు తెప్పలతో చేపల వేట జీవనాధారంగా ఉంది. లోతైన నీటిలో తెప్పలపై అనేక మంది మత్స్యకారులు ప్రమాదాలకు గురవుతుంటే.. మరికొందరు మృతి చెందుతున్నారు. తెప్పపై నుంచి వల వేయడం, తెడ్డు సాయంతో పడవ ముందుకు నడపడంలో అనేక ఇబ్బందులొస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. వీటిన్నింటిని గుర్తించి మత్స్యకారుల మేలు కోసం ఇకపై సౌరశక్తి పడవలు సమకూర్చాలని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య నిర్ణయించింది. మరబోట్లతో అధిక వ్యయం: చేపల వేటకు ఉపయోగించే డీజిల్, పెట్రోల్ మరబోట్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నదని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ చెప్పారు. ఇంధన ఖర్చులు లేని పర్యావరణహితమైన మార్గాలను పరిశీలించినట్టు తెలిపారు. కేరళలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీష్ టెక్నాలజీతో తెలంగాణకు సౌరశక్తి పడవులను తీసుకొస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని ‘బిట్స్ పిలాని’సంస్థ నిపుణులతో శనివారం చర్చలు జరిపామని పేర్కొన్నారు. సహకారం అందించేందుకు బిట్స్ పిలాని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ మోరపాకల శ్రీనివాస్, ప్రొఫెసర్ సంతాను కోలే తదితరులు హామీ ఇచ్చారని రవీందర్ తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర జలాశయాలన్నింటిలోనూ సౌరశక్తితో నడిచే పడవులను ప్రవేశపెడతామని రవీందర్ వెల్లడించారు. -
ఈ టెంట్ ఉంటే అడవిలోనైనా హాయే! ప్రత్యేకతలు ఏంటంటే..
అడవుల్లోకి వెళ్లి అక్కడే టెంట్లు వేసుకుని గడపాలనే సరదా చాలామందికే ఉంటుంది. అడవుల్లో టెంట్లు వేసుకోవడం చాలా కష్టమైన పని. అడవుల్లో విద్యుత్తు సరఫరా ఉండదు. మరి టెంట్లలో మకాం చేసేవారి పరిస్థితి ఊహించుకోవాల్సిందే! ఇదివరకటి కాలంలో లాంతర్లు, విసనకర్రలు తీసుకువెళ్లేవారు. ఇటీవలి కాలంలో పోర్టబుల్ బ్యాటరీలు, రీచార్జబుల్ లైట్లు, ఫ్యాన్లు వంటివి తీసుకువెళుతున్నారు. ఇంత ఇబ్బంది లేకుండా, టెంట్లకు నేరుగా విద్యుత్తు సరఫరా ఉంటే పరిస్థితి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కదూ! ఇదే ఆలోచనతో అమెరికాకు చెందిన సోలార్ పరికరాల తయారీ సంస్థ ‘జాకెరీ’ ఏకంగా సోలార్ టెంట్‌ను రూపొందించింది. టెంట్ పైభాగంలో ఉన్న సోలార్ ప్యానెల్స్ సౌరశక్తిని గ్రహించి, ఇందులోని ‘ఫొటో వోల్టాయిక్ సోలార్ సెల్స్’లో 1200 వాట్ల విద్యుత్తును నిక్షిప్తం చేస్తాయి. ఈ విద్యుత్తుతో టెంట్లో లైట్లు, ఫ్యాన్లు వంటివి ఇంట్లో మాదిరిగానే వాడుకోవచ్చు. ఈ సోలార్ టెంట్లు నలుగురైదుగురు వరకు బస చేయడానికి అనువుగా రూపొందించారు. ఇటీవల జరిగిన కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)–2023 ప్రదర్శనలో దీనిని ప్రదర్శించారు. ఇది ఇంకా మార్కెట్లోకి రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: వెచ్చదనమే కాదు.. వేసవిలో చల్లగానూ ఉంచే దుప్పటి గురించి తెలుసా?) -
సోలార్ టెక్ సంస్థతో ఆర్ఐఎల్ జత
న్యూఢిల్లీ: సోలార్ టెక్ సంస్థ కేలక్స్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) పేర్కొంది. ఇందుకు 1.2 కోట్ల డాలర్లు(రూ. 97 కోట్లు) వెచ్చించినట్లు వెల్లడించింది. పెరోవ్‌స్కైట్ ఆధారిత సోలార్ సాంకేతికతగల కేలక్స్‌లో వాటాను సొంతం చేసుకోవడం ద్వారా నూతన ఇంధన తయారీ సామర్థ్యాలను పటిష్ట పరచుకోనుంది. పూర్తి అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ ఎనర్జీ ద్వారా కేలక్స్ కార్పొరేషన్‌తో వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆర్ఐఎల్ తెలియజేసింది. ఈ కాలిఫోర్నియా సంస్థ భాగస్వామ్యంతో అధిక సామర్థ్యంగల చౌక వ్యయాల సోలార్ మాడ్యూల్స్‌ను తయారు చేయగలమని వివరించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఆర్ఐఎల్ సమీకృత ఫొటోవోల్టాయిక్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. -
లెక్కల సార్ క్రియేటివిటీ అదిరిందబ్బా.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
మన దేశంలో వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. యువతకు బైకులంటే వైపు మొగ్గుచూపుతున్న వారి తల్లిదండ్రులకి కాస్త పైసలుంటే కార్ల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. తాజగా శ్రీ నగర్ నుంచి ఓ లెక్కల టీచర్ ఆ మాటని పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ విన్నూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మహీంద్రా ఏమని ట్వీట్ చేశారంటే.. "బిలాల్ అభిరుచి ప్రశంసనీయం. తను ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే. ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలి. ఈ డిజైన్ మరింత అభివృద్ధి చేసేందుకు మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందిస్తూ.. "ఇలాంటివి మార్కెట్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేయగా, మరొకరు ‘టెస్లా ఇలాంటి కారు ఎందుకు చేయదని’ కామెంట్ చేశారు. Bilal’s passion is commendable. I applaud his single-handedly developing this prototype. Clearly the design needs to evolve into a production-friendly version. Perhaps our team at Mahindra Research Valley can work alongside him to develop it further. @Velu_Mahindra ? https://t.co/p6WRgQmcXo — anand mahindra (@anandmahindra) July 20, 2022 -
Space Solar Plant: ఆకాశం నుంచి కరెంట్!
ఒక్క నిమిషం కరెంటు పోతే.. ఆగమాగం అయిపోతాం. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం విద్యుత్ కావాల్సిందే. ఓ వైపు బొగ్గు వంటి సహజ వనరులు తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మరెన్నో కష్టాలు.. ఇలాంటి సమయంలోనే ఆకాశం నుంచే కరెంటు తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ భూమ్మీద బొగ్గు తరిగిపోతోంది.. జల విద్యుత్ సరిపోదు.. సౌర విద్యుత్ ఉన్నా.. పగలు మాత్రమే కరెంటు ఉత్ప త్తి అవుతుంది. మబ్బు పట్టినా, ఫలకాలపై దు మ్ముపడినా ఉత్పత్తి తగ్గిపోతుంది. పవన విద్యు త్ వంటి ఇతర మార్గాలు ఉన్నా ఖర్చెక్కువ. నిరంతరంగా ఉత్పత్తి సాధ్యంకాదు. మరె లా అన్న ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు.. అంతరిక్షం లో ఉపగ్రహాల తరహాలో భారీ సోలార్ ప్యానె ల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయవచ్చని ప్రతిపాదించారు. జపాన్, యూరోపియన్ యూ నియన్ ఆ దిశగా పరిశోధనలు చేస్తుండగా.. చైనా నేరుగా రంగంలోకి దిగింది. అంతరిక్షంలో అత్యంత భారీ సోలార్ ప్రాజెక్టు చేపట్టే పనిలో పడింది. మరో 14 ఏళ్లలో అంటే 2035 కల్లా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. చదవండి: తాలిబన్ల దమనకాండ అంతరిక్షంలో సోలార్ ప్రాజెక్టు పనిచేసేదిలా.. చైనా ప్రాజెక్టు ఇదీ.. ►భూమికి 23 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ ఏర్పాటుకు చైనా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. అంటే ఆ ప్లాంట్ భూమి తిరిగే వేగంతోనే కదులుతూ.. ఎప్పుడూ ఒకే ప్రాంతంపై ఉంటుంది. ►ప్రాజెక్టులో భాగంగా 2035 సంవత్సరం నా టికి సుమారు 1.6 కిలోమీటర్ల మేరసోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ముందు ఒక మెగావాట్ సామర్థ్యంతో మొదలుపెట్టి.. తర్వాత మరింతగా విస్తరిస్తూ వెళతారు. ►2050నాటికి ఒక అణువిద్యుత్ ప్లాంటు స్థాయిలో ఏకంగావెయ్యి మెగావాట్లు ఉత్పత్తి చేసేలా ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ను అభివృద్ధి చేస్తారు. ►ప్రస్తుతం చైనాలోని చోంగ్‌కింగ్ పట్టణం శి వార్లలో ‘బిషన్ స్పేస్ సోలార్ ఎనర్జీ స్టేషన్’ను నిర్మిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్రయోగాన్ని మొదలుపెట్టాలని భావిస్తోంది. ►అయితే ఈ భారీ ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలేమీ వెల్లడించలేదు. చదవండి: అఫ్గన్ పౌరులకు ఇప్పుడు అదే ఆశాదీపం..! ఖర్చు తక్కువే.. 2039 నాటికి ‘స్పేస్ ప్లాంట్’ ఏర్పాటు చేయాలని బ్రిటన్ను ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సాధ్యాసాధ్యాలు, ఖర్చుపై ఓ నివేదికను రూపొందించింది. అంతరిక్షంలో ఒక కిలోమీటర్ వెడల్పున ప్లాంట్ ఏర్పాటుకు.. 2 వేల టన్నుల పరికరాలు అవసరమని లెక్కించింది. భూమిపై రిసీవింగ్ స్టేషన్‌ను 95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని అంచనా వేసింది. ళీ ప్రస్తుతం వెయ్యి యూనిట్ల కరెంటు ఉత్పత్తి కోసం.. అణువిద్యుత్ ప్లాంట్లలో రూ.5 వేలకుపైగా.. భూమ్మీది సౌర, పవన విద్యుత్ ప్లాంట్లలో రూ.3,750 వరకు ఖర్చవుతోందని తెలిపింది. అదే ‘స్పేస్ సోలార్ ప్లాంట్’ కేవలం రూ.385 మాత్రమే ఖర్చవుతాయని అంచనా వేసింది. ఓ ఫిక్షన్ నవల నుంచి.. ఐజాక్ అసిమోవ్ రష్యన్ రచయిత 1941లో రాసిన సైన్స్ ఫిక్షన్ నవలలో ‘స్పేస్ సోలార్ పవర్ స్టేషన్ల’ గురించి రాశారు. ఆ ప్లాంట్లు సూర్యరశ్మిని మైక్రోవేవ్‌ల రూపంలో వివిధ గ్రహాలపైకి పంపుకొంటారని పేర్కొన్నారు. సోలార్ పవర్ వినియోగం కొత్తగా మొదలైన 1970 దశకంలో కొందరు శాస్త్రవేత్తలు ‘స్పేస్ సోలార్ పవర్’ ప్రతిపాదనలు చేశారు. కానీ అప్పటి పరిస్థితి, భారీ ఖర్చుతో ఏదీ ముందుకుపడలేదు. ఇటీవలి కాలంలో పలు కొత్త టెక్నాలజీలు రావడంతో మళ్లీ పరిశోధనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్, జపాన్, రష్యా, అమెరికా, చైనా దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. లాభాలు ఎన్నో? ►సూర్యుడి కిరణాల తీవ్రత, రేడియేషన్ ఎ క్కువగా ఉంటాయి.పైగా దుమ్ముపడి సోలార్ ప్యానెళ్ల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఉండవు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►భూమ్మీద రోజూ 9–10 గంటల పాటు మాత్రమే సౌర విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అది కూడా సోలార్ ప్యానెళ్లపై సూర్యరశ్మి నేరుగా పడే ఐదారు గంటలు మాత్రమే పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అదే అంతరిక్షంలో సోలార్ ప్యానెళ్లు పూర్తిగా సూర్యుడివైపే ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దీనితో రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ►ఈ ప్రత్యామ్నాయ విద్యుత్ కారణంగా.. బొగ్గు, పెట్రోలియం, ఇతర శిలాజ ఇంధనాల వినియోగం నిలిచిపోయి భూమ్మీద కాలుష్యం తగ్గుతుంది. ఆయుధంగా మారుతుందా? జేమ్స్‌బాండ్ సినిమాలో ఓ ప్రైవేటు సంస్థ అంతరిక్షంలో సోలార్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. రాత్రిపూట అవసరమైన చోట వెలుగు ఇవ్వొచ్చని చెప్తుంది. కానీ ఆ వ్యవస్థతో సౌరశక్తిని లేజర్ కిరణాల తరహాలో ఒక దగ్గర కేంద్రీకరించి.. విధ్వంసం సృష్టిస్తుంది. ఇది సినిమాని సీన్ అయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లతో అలాంటి ప్రమాదమూ ఉండొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతుండటం గమనార్హం. ►కావాలని చేయకపోయినా.. స్పేస్ సోలార్ స్టేషన్లో సమస్య వచ్చి.. అది భూమిపైకి పంపే మైక్రోవేవ్‌లు/లేజర్ కిరణాలు ప్రజలు ఉండే ప్రాంతాలపై పడితే ఎలాగన్న ప్రశ్నలూ వస్తున్నాయి. మైక్రోవేవ్‌ల వల్ల రేడియేషన్ ఉంటుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ►అయితే ఇలాంటి ప్రమాదాలు ఉండకుండా.. కచ్చితమైన వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కిరణాలు రిసీవింగ్ స్టేషన్ పరిధి దాటి బయట ప్రసరించే పరిస్థితి ఉంటే.. ప్లాంట్ ఆటోమేటిగ్గా ఆగిపోయే ఏర్పాట్లు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్
జెరూసలెం: ప్రపంచమంతా సౌర విద్యుత్‌పై దృష్టిని కేంద్రీకరించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చేపట్టిన అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పది లక్షల చదరపు మీటర్లలో 55 వేల సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇంజనీర్లు, కార్మికులు ఇప్పుడు తలమునకలై ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 240 మీటర్ల ఎత్తుగల సోలార్ టవర్‌ను నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తుగల సోలార్ టవర్‌ను నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారని ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ‘జీఈ రెన్యువబుల్ ఎనర్జీ’ సంస్థ తెలియజేసింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని అషేలిమ్ ప్రాంతానికి సమీపంలో నెగేవ్ ఎడారిలో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అతి పెద్ద సోలార్ ప్యానెళ్లను ఉపయోగించడమే కాకుండా కేబుళ్లకు బదులుగా వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్‌లో మరో విశేషం. భారీ క్రేన్ల సహాయంతో సోలార్ ప్యానెళ్లను అమరుస్తున్నారు. 2017 సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, 320 జీడబ్లూహెచ్ సామర్ధ్యంగల ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,20,000 గృహాలకు సౌర విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు తెలిపారు. -
సౌర విద్యుత్, రక్షణ రంగాలపై భెల్ దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తక్కువ వ్యయంతో అధిక విద్యుత్ ఉత్పత్తి అయ్యే కాన్సన్ట్రేడెట్ సోలార్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వరంగ బీహెచ్ఈఎల్ ప్రకటించింది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన కంపెనీ అబెన్గోవా సోలార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీహెచ్ఈఎల్ హైదరాబాద్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎన్.రవిచందర్ తెలిపారు. ఈ విధానంలో మిర్రర్ రిఫ్లెక్టర్ ద్వారా స్టీమ్ టర్బైన్ బాయిలర్లు పనిచేస్తాయన్నారు. ఈ రిఫ్లెక్టర్లను అబెన్గోవా సరఫరా చేస్తే బాయిలర్లను బీహెచ్ఈఎల్ అందిస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫొటో వోల్టాయిక్ కంటే ఈ విధానంలో యూనిట్ విద్యుత్‌ను రూ.6-7కే ఉత్పత్తి చేయెచ్చని, కానీ దీనికి అధిక భూమి అవసరం అవుతుందన్నారు. తయారీ రంగంపై సీఐఐ శుక్రవారం నిర్వహించిన ‘మానెక్స్ -2013’ కార్యక్రమంలో పాల్గొన్న రవిచందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రధానంగా రక్షణ, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం చాలా కీలకమైనదని, ప్రస్తుతం జీడీపీలో 15%గా ఉన్న తయారీ రంగ వాటాను 25%కు పెంచితే అదనంగా 92 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం సేవల రంగం పై అధికంగా దృష్టిసారిస్తోందని, 1990 దశకాల్లో లాగా తయారీ రంగంపై దృష్టిసారించాలన్నారు.