Anand Mahindra Praises Srinagar Maths Teacher For Making Solar Car, Tweet Viral - Sakshi
Sakshi News home page

లెక్కల మాస్టర్‌ తెలివి.. వైరల్‌గా మారిన ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌!

Published Thu, Jul 21 2022 8:00 PM | Last Updated on Thu, Jul 21 2022 9:00 PM

Anand Mahindra Responds Srinagar From Maths Teacher Makes Solar Car - Sakshi

మన దేశంలో వాహనాలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. యువతకు బైకులంటే వైపు మొగ్గుచూపుతున్న వారి తల్లిదండ్రులకి కాస్త పైసలుంటే కార్ల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. తాజగా శ్రీ నగర్‌ నుంచి ఓ లెక్కల టీచర్‌ ఆ మాటని పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ విన్నూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు.

మహీంద్రా ఏమని ట్వీట్‌ చేశారంటే.. "బిలాల్ అభిరుచి ప్రశంసనీయం. తను ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే. ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలి. ఈ డిజైన్‌ మరింత అభివృద్ధి చేసేందుకు మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్‌ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందిస్తూ.. "ఇలాంటివి మార్కెట్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేయగా, మరొకరు ‘టెస్లా ఇలాంటి కారు ఎందుకు చేయదని’ కామెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement