anandh mahindhra
-
‘అక్కడికి వెళ్లే ధైర్యం చేయలేను’.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆనంద్ మహీంద్రా పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ వినపడుతూనే ఉంటుంది. బిజినెస్ మ్యాన్‌గా ఆయన ఎంత బిజీగా ఉన్న నెట్టింట సమయాన్ని గడుపుతుంటారు. వింతలు, వినోదం, టెక్నాలజీ తదితర అంశాలతో పాటు సామాజిక అవగాహన కల్పించే అంశాలను, వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ నెటిజన్లను పలకరిస్తుంటారు. సోషల్ మీడియాలో అంతగా చురుకుగా ఉంటారు కాబట్టే ఇటీవలే ట్విటర్లో ఏకంగా కోటి మంది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. తాజాగా ఆనంద్ మహీంద్రా నెట్టింట ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోలో ఏముందంటే! అందులో.. అది వాహనాలు ప్రయాణిస్తున్న ఒక రోడ్ ఫోటో. ఆ రోడ్ చూసేందుకు ఎంత అద్భుతంగా ఉందో అంతే ప్రమాదకరంగా ఉంది. ఎత్తైన ప్రాంతానికి వెళ్లే రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు కదా. మలుపులు ఎక్కువగా ఉంటాయి. చుట్టూ లోయలు ఉంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్రత్తగా వ్యవహరించినా క్షణాల్లో ప్రమాదాన్ని పలకరించాల్సి వస్తుంది. అటువంటి రోడ్డు మీద ప్రయాణం అంటే సాహసం అనే చెప్పాలి. తన ట్వీట్లో ఆనంద్ మహీంద్రా పర్వత ప్రాంతమైన లడఖ్ రోడ్ని షేర్ చేసి ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘ఇంతటి అద్భుతమైన ఫోటోని షేర్ చేసినందుకు @TravelingBharat ధన్యవాదాలు. మీరు పంపిన జాబితా నా లిస్ట్‌లో ఉంచుతాను. కానీ ఆ రహదారిలో వెళ్లే ప్రసక్తే లేదు. ఒప్పకుంటున్నా, నేనంత ధైర్యం చేయలేనని’ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారడంతో నెటిజన్లు పర్వత ప్రాంతంలో వారి వారి ప్రయాణ అనుభవాలను పంచుతూ కామెంట్లు పెడుతున్నారు. Thank you @TravelingBharat for your amazing shares, many of which I RT & put on my bucket list…But there’s no way I’m visiting THIS road…I confess I don’t have the courage! https://t.co/Ujx4AAnK4j — anand mahindra (@anandmahindra) November 11, 2022 చదవండి: ఐటీలో ఫేక్ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే! -
‘ఇదే నా టాలెంట్, ప్లీజ్ సార్ జాబ్ ఇవ్వండి’.. ఆనంద్ మహీంద్రా రిప్లై ఇదే!
ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టాల్సిందే. కొత్తగా ఆలోచించాల్సిందే. అలా చేస్తేనే జాబ్స్ వస్తున్నాయ్ మరీ. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా అనే ఓ యువకుడు ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో పడ్డాడు. ఆనంద్ మహీంద్రా సైతం ఆ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా? గౌతమ్ అనే యువకుడు జాబ్ కోసం ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. తాను రూపొందించిన జీప్ ప్రత్యేకంగా కనిపించాలనుకున్నాడు గౌతమ్. ఆందుకే ముందు వెనుక చక్రాలను వేర్వేరుగా కంట్రోల్ చేసేలా ఆ జీప్‌ను తయారు చేశాడు. ఆ వాహనం ఎలా పని చేస్తుందో చూపించడంతో పాటు ఓ రైడ్ కూడా చేశాడు. ఇదంతా వీడియో తీసి ట్విటర్లో ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇందుకే ఈవీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. వినూత్న ప్రయోగాల వల్లే ఆటోమొబైల్‌లో అమెరికా ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తో పాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే ఈ వీడియోని వేలు మహీంద్రాకు ట్యాగ్ చేసి గౌతమ్‌ని కలవాలని సూచించారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. మీరు గ్రేట్ సార్, టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him. https://t.co/xkFg3SX509 — anand mahindra (@anandmahindra) August 20, 2022 చదవండి: ప్రమాదంలో గూగుల్ క్రోమ్ యూజర్లు..కేంద్రం హెచ్చరిక, వెంటనే ఇలా చేస్తే మేలు! -
లెక్కల సార్ క్రియేటివిటీ అదిరిందబ్బా.. వైరల్‌గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్!
మన దేశంలో వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. యువతకు బైకులంటే వైపు మొగ్గుచూపుతున్న వారి తల్లిదండ్రులకి కాస్త పైసలుంటే కార్ల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఇంధన ధరలు పెరగడంతో వాహనాలు కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇంధనం మాత్రమే కాకుండా ఉన్న వనరులపై కూడా ఆధారపడమని నిపుణులు ఎప్పటినుంచో చెప్తున్నారు. తాజగా శ్రీ నగర్ నుంచి ఓ లెక్కల టీచర్ ఆ మాటని పాటించి చూపించారు. ఆయన ఇంధన అవసరం లేకుండా పని చేసే ఓ విన్నూత్న కారు తయారు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక టాలెంట్‌ని మెచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మహీంద్రా ఏమని ట్వీట్ చేశారంటే.. "బిలాల్ అభిరుచి ప్రశంసనీయం. తను ఒక్కరే ఈ ప్రోటోటైప్ తయారుచేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే. ఈ డిజైన్‌కి మరింత ఫ్రెండ్లీ వెర్షన్ రావాలి. ఈ డిజైన్ మరింత అభివృద్ధి చేసేందుకు మా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీమ్ ఆయనను కలుస్తారని @వేలు మహీంద్రాకు ట్యాగ్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ కారును చూసిన నెటిజన్లు అతని ఐడియాని మెచ్చుకుంటున్నారు. దీనిపై స్పందిస్తూ.. "ఇలాంటివి మార్కెట్ లోకి రావాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేయగా, మరొకరు ‘టెస్లా ఇలాంటి కారు ఎందుకు చేయదని’ కామెంట్ చేశారు. Bilal’s passion is commendable. I applaud his single-handedly developing this prototype. Clearly the design needs to evolve into a production-friendly version. Perhaps our team at Mahindra Research Valley can work alongside him to develop it further. @Velu_Mahindra ? https://t.co/p6WRgQmcXo — anand mahindra (@anandmahindra) July 20, 2022 -
'గ్రీన్ పవర్ 'పేరుతో ఓలా, మహేంద్ర కంపెనీల్లో మొత్తం మహిళా బృందాలే
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రముఖ దిగ్గజ కంపెనీలు అయిన ఓలా, మహేంద్ర ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ముందుంజలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు కంపెనీలు ఒక ఉమ్మడి అంశంపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇంతకీ ఆ ఉమ్మడి అంశం ఏమిటంటే ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో మొత్తం మహిళా కార్మకులే నిర్వహిస్తారని ఓలా సీఈవో భవేశ్ అగర్వాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: కోవిడ్ పేరు చెప్పి రుణం తీసుకున్నాడు...కటకటాల పాలయ్యాడు) ఈ మేరకు 2022 కల్లా దాదాపు 10 మిలయన్ల స్కూటర్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తరుణంలో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో 'గర్ల్ పవర్' వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వినియోగదారులతో పంచుకున్నారు. అలానే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర నేపాల్‌లోని మహేంద్ర కంపెనీ కూడా మొత్తం మహిళా శక్తి బృందంతోనే ట్రియో ఎలక్ట్రిక్ ఆటోను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆనంద్ మహేంద్ర మొత్తం మహిళా బృందాన్ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఓలా సీఈవో భవిశ్ ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తిగా మహిళ సామర్థ్యంతో పనిచేయడమే కాక దాదపు 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించి ప్రపంచవ్యాప్తంగా మహిళలతో కూడిన ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా ఉంటుందని ముందుగానే ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు భవిశ్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉన్న మహిళల వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు రెండు దిగ్గజ కంపెనీలు 'గ్రీన్ పవర్' పేరుతో మహిళా శక్తి పైనే దృష్టి కేంద్రీకరించారంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఒక గంట వ్యవధిలో ఐదువేల కిలోగ్రాములు బరువుని ఎత్తి రికార్డు సృష్టించాడు) Sneak peak of the scooters in production. The women at our Futurefactory are ramping up production fast! #JoinTheRevolution @OlaElectric pic.twitter.com/Z0eanudV8X — Bhavish Aggarwal (@bhash) October 27, 2021 -
భారత ఎకానమీపై ఆనంద్ మహీంద్రా వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఫండమెంటల్స్‌ని పక్కన పెట్టి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల గురించి మరీ అతిగా ప్రచారం జరిగిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆందోళన నెలకొన్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి హేతుబద్ధ స్థాయికి వస్తోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. 1991 తరహాలో భారత్ మరోసారి చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొనవచ్చన్న ఆందోళనలను మహీంద్రా కొట్టిపారేశారు. అప్పట్లో భారత్‌వద్ద విదేశీ మారక నిల్వలు నెలరోజులకు కూడా సరిపడేంతగా లేవని, ప్రస్తుతం 280 బిలియన్ డాలర్ల మేర పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశం కొంత అస్తవ్యస్త పరిస్థితి ఎదుర్కొన్న సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మళ్లీ క్రమంగా వృద్ధిబాట పడుతోందని మహీంద్రా తెలిపారు. ఇందులో భాగంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మన జనాభాలో 50 శాతం మంది పాతికేళ్ల వయస్సు లోపువారే ఉన్నారని, తయారీ రంగమే పెద్ద యెత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలదని మహీంద్రా చెప్పారు.