ట్రెండ్ మారింది గురూ! అసలే మార్కెట్‌లో కాంపిటీషన్ ఎక్కువైంది. కోరుకున్న జాబ్ దొరకాలంటే కొన్ని ఫార్మాలిటీస్‌ను పక్కన పెట్టాల్సిందే. కొత్తగా ఆలోచించాల్సిందే. అలా చేస్తేనే జాబ్స్ వస్తున్నాయ్ మరీ. లేదంటే కాళ్లరిగేలా ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అలా అనే ఓ యువకుడు ఉద్యోగం కోసం వినూత్నంగా ఆలోచించాడు. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్ర అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా కళ్లలో పడ్డాడు. ఆనంద్ మహీంద్రా సైతం ఆ కుర్రాడి టాలెంట్‌కు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేశాడో తెలుసా?
గౌతమ్ అనే యువకుడు జాబ్ కోసం ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఏముందంటే.. తాను రూపొందించిన జీప్ ప్రత్యేకంగా కనిపించాలనుకున్నాడు గౌతమ్. ఆందుకే ముందు వెనుక చక్రాలను వేర్వేరుగా కంట్రోల్ చేసేలా ఆ జీప్‌ను తయారు చేశాడు. ఆ వాహనం ఎలా పని చేస్తుందో చూపించడంతో పాటు ఓ రైడ్ కూడా చేశాడు. ఇదంతా వీడియో తీసి ట్విటర్‌లో ఆనంద్ మహీంద్రాకు ట్యాగ్ చేస్తూ తనకు ఉద్యోగం ఇవ్వాలని కోరాడు.
దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ.. ‘ఇందుకే ఈవీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని నమ్ముతున్నా. వినూత్న ప్రయోగాల వల్లే ఆటోమొబైల్‌లో అమెరికా ఆధిపత్యాన్ని చాటింది. గౌతమ్‌తో పాటు అలాంటి వ్యక్తులు మరింత ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు బదులిచ్చారు. అలాగే ఈ వీడియోని వేలు మహీంద్రాకు ట్యాగ్ చేసి గౌతమ్‌ని కలవాలని సూచించారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు.. మీరు గ్రేట్ సార్, టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
This is why I’m convinced India will be a leader in EVs. I believe America gained dominance in autos because of people’s passion for cars & technology & their innovation through garage ‘tinkering.’ May Gowtham & his ‘tribe’ flourish. @Velu_Mahindra please do reach out to him. https://t.co/xkFg3SX509
— anand mahindra (@anandmahindra) August 20, 2022
చదవండి: ప్రమాదంలో గూగుల్ క్రోమ్ యూజర్లు..కేంద్రం హెచ్చరిక, వెంటనే ఇలా చేస్తే మేలు!
Comments
Please login to add a commentAdd a comment