Mahindra XUV700: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' మార్కెట్లో థార్, ఎక్స్‌యువి700 వంటి కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందిన మహీంద్రా ఎక్స్‌యువి700 SUV మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వెలుగులోకి వచ్చిన సన్‌రూఫ్ లీక్ ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మహీంద్రా ఎక్స్‌యువి700 సన్‌రూఫ్ లీక్ ఘటన మళ్ళీ వెలుగులోకి రావడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. రాఫ్తార్ 7811 యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో పైకప్పు నుంచి క్యాబిన్‌లోకి నీరు లీక్ అవుతుండటం చూడవచ్చు. వీడియోలో మీరు గమనించినట్లతే కారు వర్షంలో వెళుతున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో వర్షం నీరు మెల్ల మెల్లగా లోపలి రావడం గమనించవచ్చు. సన్‌రూఫ్ ఏ మాత్రం ఓపెన్ చేయలేదు, కానీ నీరు లోపలి వస్తోంది. దీని పైన కంపెనీ వెంటనే చర్యలు తీసుకోవాలని కస్టమర్ కోరాడు, ప్రస్తుతానికి సంస్థ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు.
వీడియోలో కనిపించే మహీంద్రా ఎక్స్‌యువి700 ఎన్ని రోజులు నుంచి ఉపయోగిస్తున్నారనే సమాచారం స్పష్టంగా తెలియదు, అంతే కాకుండా సన్‌రూఫ్ లీక్ కావడానికి ప్రధాన కారణం తెలియాల్సి ఉంది. బహుశా సన్‌రూఫ్ గ్లాస్ అంచులలో ఏమైనా ఆకులు లేదా దుమ్ము చేరుకోవడం వల్ల లీక్ జరిగి ఉండవచ్చని కొంత మంది ఊహిస్తున్నారు. సన్‌రూఫ్ అంచులలో ఏమైనా చేరి ఉంటే నీరు లోపలి వచ్చే అవకాశం ఉంటుంది.
(ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!)
గతంలోనూ ఇలా..
గతంలో వెల్లడైన ఒక వీడియోలో ఎక్స్‌యువి700 వినియోగదారుడు కారుని నేరుగా జలపాతం కిందికి తీసుకెళ్లాడు, ఆ సమయంలో నీరు లోపలి వచ్చిన సంఘటనకు సంబందించిన వీడియోలు వైరల్ అయ్యాయి, ఆ సమస్యను కంపెనీ పరిష్కరించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన సమస్యను మహీంద్రా అండ్ మహీంద్రా ఎలా పరిష్కరించబోతోందో వేచి చూడాలి.
(ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!)
ఖరీదైన కార్లు ఇలాంటి సమస్యలకు లోనైతే కస్టమర్లు తప్పకుండా ఇబ్బంది పడతారు. గతంలో ఇలాంటి కంప్లైంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. మహీంద్రా ఎక్స్‌యువి700 ధర భారతీయ మార్కెట్లో 1రూ. 4.01 లక్షల నుంచి రూ. 26.18 లక్షల మధ్య ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.
Comments
Please login to add a commentAdd a comment