Mahindra XUV700
-
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో సురక్షితమైన కార్లు (ఫోటోలు)
-
మహీంద్రా XUV700 కొత్త వేరియంట్.. ప్రత్యేకతలివే..
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా XUV700లో కొత్త AX5 సెలెక్ట్ (AX5 S) వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 16.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). స్కైరూఫ్, డ్యూయల్ 26.03cm హెచ్డీ సూపర్‌స్క్రీన్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, రూమి 7-సీటర్ కాన్ఫిగరేషన్ వంటి ఆకట్టుకునే ఫీచర్ల లైనప్‌ను AX5 సెలెక్ట్ వేరియంట్ అందిస్తుంది.సాధారణంగా హై-ఎండ్ మోడల్‌లతో ఇలాంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లు బడ్జెట్ ధరలో హై-ఎండ్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు AX5 మంచి ఎంపికగా నిలుపుతున్నాయి. 2022లో విడుదలైన మహీంద్రా XUV700 దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నేపాల్, న్యూజిలాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొంది గ్లోబల్ ఎస్‌యూవీగా మారింది.మహీంద్రా ఇటీవలే MX వేరియంట్లో 7-సీటర్‌ను విడుదల చేసింది. బ్లేజ్ రెడ్ కలర్, డ్యూయల్-టోన్ బ్లాక్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్స్, రెడ్ యాక్సెంట్లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో లిమిటెడ్ బ్లేజ్ ఎడిషన్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. కస్టమర్లకు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది. వేరియంట్‌ను బట్టి నాలుగు నుంచి ఎనిమిది వారాలలోపు కస్టమర్లకు డెలివరీ ఇచ్చేలా చర్యలు చేపట్టింది. -
టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి
టెక్నాలజీ పెరగడంతో కార్లలో ADAS వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారులను ప్రమాదం నుంచి తప్పించడానికి, ప్రమాదం జరిగే ముందు అలర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఫీచర్లను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వెనుక సీటును బెడ్‌గా మార్చి ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూడవచ్చు. అయితే ఈ కారులో డ్రైవర్ లేకపోవడం గమనించవచ్చు. కారు ఎంత వేగంగా వెళ్తోంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు అందుబాటులో లేదు, కానీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కారు హైవే మీద ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగించినట్లు అర్థమవుతోంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ డ్రైవర్ ప్రమేయం లేకుండా ఒక స్థిరమైన వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అత్యవసర సమయంలో డ్రైవర్ కారుని కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కారు ఆగిపోతుంది. వెంటనే కారు ఆగిపోతే.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఈ కారుని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కారులో ప్రయాణించే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
ఆస్ట్రేలియాలో విడుదలకానున్న ఇండియన్ బ్రాండ్ కారు ఇదే
Mahindra XUV700 Australia Launch: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra and Mahindra) కంపెనీకి చెందిన XUV700 త్వరలో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ SUV ఆస్ట్రేలియన్ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. మహీంద్రా కంపెనీ తన ఎక్స్యువి700 ఎస్‌యువిని జూన్ 15 న అధికారికంగా విడుదలచేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ కారు ఆస్ట్రేలియాలో మిత్సుబిషి అవుట్ ల్యాండర్, హోండా సిఆర్-వి, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. (ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?) ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదయ్యే మోడల్ 7 సీటర్ మాత్రమే అని నివేదికల ద్వారా తెలుస్తోంది. కావున ఎక్స్యువి700 5 సీటర్ రూపంలో విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. డిజైన్, ఫీచర్స్ దాదాపు ఇండియన్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంజిన్ ఎంపికలు కూడా ఇవే ఉంటాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక సమాచారం జాన్ 15న లాంచ్ సమయంలో వెల్లడవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. Its Official! The ALL-NEW Mahindra XUV700 is launching in Australia on the 15th of June!#HELLOXUV700 Make sure you are registered to be first to receive the Price & Specification announcement on the 15th June via this link> https://t.co/EGmTvHuE3h pic.twitter.com/bpIQ4IPSbp — Mahindra Australia (@MahindraAus) June 1, 2023 -
దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోండి.. ఎక్స్యువి700 కస్టమర్ కంప్లైంట్!
Mahindra XUV700: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' మార్కెట్లో థార్, ఎక్స్యువి700 వంటి కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అతి తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ పొందిన మహీంద్రా ఎక్స్యువి700 SUV మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో వెలుగులోకి వచ్చిన సన్‌రూఫ్ లీక్ ఘటన మరువక ముందే మళ్ళీ అలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ లీక్ ఘటన మళ్ళీ వెలుగులోకి రావడంతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. రాఫ్తార్ 7811 యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన వీడియోలో పైకప్పు నుంచి క్యాబిన్లోకి నీరు లీక్ అవుతుండటం చూడవచ్చు. వీడియోలో మీరు గమనించినట్లతే కారు వర్షంలో వెళుతున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో వర్షం నీరు మెల్ల మెల్లగా లోపలి రావడం గమనించవచ్చు. సన్‌రూఫ్ ఏ మాత్రం ఓపెన్ చేయలేదు, కానీ నీరు లోపలి వస్తోంది. దీని పైన కంపెనీ వెంటనే చర్యలు తీసుకోవాలని కస్టమర్ కోరాడు, ప్రస్తుతానికి సంస్థ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. వీడియోలో కనిపించే మహీంద్రా ఎక్స్యువి700 ఎన్ని రోజులు నుంచి ఉపయోగిస్తున్నారనే సమాచారం స్పష్టంగా తెలియదు, అంతే కాకుండా సన్‌రూఫ్ లీక్ కావడానికి ప్రధాన కారణం తెలియాల్సి ఉంది. బహుశా సన్‌రూఫ్ గ్లాస్ అంచులలో ఏమైనా ఆకులు లేదా దుమ్ము చేరుకోవడం వల్ల లీక్ జరిగి ఉండవచ్చని కొంత మంది ఊహిస్తున్నారు. సన్‌రూఫ్ అంచులలో ఏమైనా చేరి ఉంటే నీరు లోపలి వచ్చే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ సింపుల్‌గా చెక్ చేసుకోవాలా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!) గతంలోనూ ఇలా.. గతంలో వెల్లడైన ఒక వీడియోలో ఎక్స్యువి700 వినియోగదారుడు కారుని నేరుగా జలపాతం కిందికి తీసుకెళ్లాడు, ఆ సమయంలో నీరు లోపలి వచ్చిన సంఘటనకు సంబందించిన వీడియోలు వైరల్ అయ్యాయి, ఆ సమస్యను కంపెనీ పరిష్కరించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన సమస్యను మహీంద్రా అండ్ మహీంద్రా ఎలా పరిష్కరించబోతోందో వేచి చూడాలి. (ఇదీ చదవండి: ఐఏఎస్ వదిలి ఇండియాలో అతిపెద్ద తయారీదారుగా.. ఎవరీ బాలగోపాల్ చంద్రశేఖర్!) ఖరీదైన కార్లు ఇలాంటి సమస్యలకు లోనైతే కస్టమర్లు తప్పకుండా ఇబ్బంది పడతారు. గతంలో ఇలాంటి కంప్లైంట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో వైరల్ అవుతోంది. మహీంద్రా ఎక్స్యువి700 ధర భారతీయ మార్కెట్లో 1రూ. 4.01 లక్షల నుంచి రూ. 26.18 లక్షల మధ్య ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో
Mahindra XUV700 Catches Fire: దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఈ కారు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ కారు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కులదీప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అతని ఎక్స్‌యూవీ 700లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడానికి ముందు పొగలు రావడంతో కారులోని వారందరూ కిందికి దిగేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని ప్రాధమిక పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ కారు కాలిపోయినప్పటికీ ఎక్స్‌యూవీ 700 ఓనర్ మాత్రం మహీంద్రా సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 మంటల్లో కాలిపోయిన కారు కొనుగోలు చేసి కేవలం ఆరు నెలలు మాత్రమే అయినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపైనా మహీంద్రా కంపెనీ స్పందిస్తూ మా కస్టమర్ల సేఫ్టీ ప్రధమ లక్ష్యమని చెబుతూ ప్రమాదానికి కారణం ఫ్యూయెల్ లీక్ లేదా ఇంజిన్‌లో ఏర్పడిన ఒత్తిడి అయి ఉండవచ్చని వెల్లడించింది. అయితే ఆ కారు ఓనర్‌కి మళ్ళీ కొత్త కారు ఇస్తుందా? లేదా? అనేదానిపై ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు. Our customers' safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC — Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023 సేఫ్టీ ఫీచర్స్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికి వస్తే, మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. (ఇదీ చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు నాకొద్దు.. మీరే తీసుకోండి - వైరల్ అవుతున్న పోస్ట్!) మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మల్టిపుల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 14.01 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 26.18 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మంటల్లో కాలిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇల్లన్తి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఈ కార్లకు యమ క్రేజ్, ‘మరో రెండేళ్లైనా వెయిట్ చేస్తాం..అదే కారు కావాల్సిందే’
దేశంలో కార్ల వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. చిరు ఉద్యోగి నుంచి బడా వ్యాపార వేత్తల వరకు మార్కెట్లో విడుదలై, తమకు నచ్చిన డిజైన్, ఫీచర్లు ఉంటే చాలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు కొనుగోలు దారులు లేక వెలవెబోయిన కార్ల షోరూంలు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. అందుకే కొనుగోలు దారుల డిమాండ్లకు అనుగుణంగా వాహన తయారీ సంస్థలు వెహికల్స్‌ను మ్యాన్సిఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో మోడల్‌ను అప్ డేట్ చేస్తూ మహీంద్రా స్కార్పియో-ఎన్, మహీంద్రా ఎక్స్ యూవీ-700 లేటెస్ట్ వెర్షన్లను పరిచయం చేశాయి. అయితే పైన పేర్కొన్న మహీంద్రా వెహికల్ కార్లను బుక్ చేసుకుంటే సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిప్‌ల కొరత, సప్లయ్ చైన్‌లో అవరోధాలతో పాటు విపరీతమైన డిమాండ్ నెలకొంది. దీంతో మహీంద్రా ఎక్స్‌యూవీ700, మహీంద్రా స్కార్పియో-ఎన్ వెయిటింగ్ పీరియడ్ 18- 20 నెలల మధ్య ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బుకింగ్‌లో రికార్డులు నవంబర్ 2022 నాటికి మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మహీంద్రా స్కార్పియో-ఎన్ల కోసం నెలకు 8,000-9,000 బుకింగ్‌లు అవుతండగా.. ఈ నెలలో 2.60 లక్షల కంటే ఎక్కువ ఓపెనింగ్ బుకింగ్స్ ఉన్నాయి. వీటిలో ఈ రెండు ఎస్‌యూవీల బుకింగ్స్ 1.30 లక్షలుగా ఉన్నాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ (క్లాసిక్‌తో సహా) 1,30,000 మొత్తం ఓపెన్ బుకింగ్‌లతో అగ్రస్థానంలో ఉంది. కొత్త మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తున్న ఈ కారు ప్రారంభ ధర రూ. 15.45 లక్షలుగా ఉంది. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
ఈ కార్ని ఇప్పుడు బుక్ చేసుకుంటే..డెలివరీ అయ్యేది రెండేళ్ల తర్వాతే!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా సంస్థకు చెందిన ఎక్స్‌యూవీ 700 అమ్మకాల్లో దుమ్ము లేపుతోంది. గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన బుకింగ్స్‌లో కొనుగోలు దారులు కేవలం రెండు రోజుల్లో 70వేల వెహిక్సల్ను బుక్ చేసుకోగా.. ఇప్పుడా వెహికల్ బుక్ చేసుకుంటే డెలివరీ అయ్యేందుకు మరో రెండేళ్ల వరకు ఎదురు చూడాల్సి ఉంది. ఎస్. మీరు చదివేది నిజమే. మహీంద్రా ఎక్స్‌యూవీ 700ను ఈరోజు బుక్ చేసుకుంటే డెలివరీ 2024కి అవుతుంది. నివేదిక ప్రకారం..ఏఎక్స్7ఎల్ వేరియంట్ వెహికల్ వేటింగ్ పిరియడ్ రెండేళ్లు. ►ఏఎక్స్ 7 ట్రిమ్ వెహికల్ బుక్ చేసుకుంటే 20నెలల తర్వాత డెలివరీ అవుతుంది. ►ఏక్స్5 వేరియంట్ పెట్రోల్ వెహికల్ డెలివరీ అయ్యేందుకు 5నెలల సమయం పట్టనుంది. అదే డీజిల్ వెహికల్ అయితే 11నెలల సమయం పట్టనుంది. ►ఏఎక్స్3 ట్రిమ్‌తో పాటు ఏఎక్స్ 5 వేరియంట్ పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ఒకేసారి డెలివరీ కానున్నాయి. ►చిప్షార్టేజ్, సప్లయ్ చైన్ క్రైసిస్, ప్రపంచ దేశాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కోవిడ్, మార్కెట్లో ఈకారుకున్న డిమాండ్ వంటి ఇతర కారణాల ఎక్స్‌యూవీ 700ను డెలివరీ అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్, హోందాయ్ క్రెటా కోసం ఎదురు చూడాల్సి ఉంది. చదవండి👉 నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా -
నా భార్య కోసం ఆర్డర్ చేశా.. Qలో ఉన్నా: ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యమ చురుగ్గా ఉంటారు. ఆయన పెట్టే పోస్ట్‌లు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా ఆయన పెట్టిన ట్వీట్ అందరిని దృష్టిని ఆకర్షిస్తోంది. భారత జట్టు ఇటీవల థామస్ కప్‌ని గెలిచి బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి డబుల్స్ జోడీ జట్టు విజయంతో కీలకపాత్ర పోషించింది. చారిత్రక విక్టరీని లిఖించిన భారత జట్టును ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్ర ట్విటర్లో పోస్ట్ పెట్టారు. దీనికి చిరాగ్ శెట్టి స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలిపాడు. అంతేకాదు తాను ఇటీవల మహీంద్రా కంపెనీకి చెందిన ఎస్యూవీ 700 కారు బుక్ చేశానని, కాస్త తొందరగా డెలివరీ చేయాలని అభ్యర్థించాడు. దీనికి ఆనంద్ మహీంద్రా తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ‘ఛాంపియన్ల ఎంపికగా మారిన ఎస్యూవీ 700ని వీలైనంత త్వరగా మీకు అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. నా భార్య కోసం నేను కూడా ఒకటి ఆర్డర్ చేసాను. నేను ఇప్పటికే క్యూలోనే ఉన్నాను’ అంటూ సరదాగా సమాధానం ఇచ్చారు. (క్లిక్: ఎంట్రి లెవల్ కార్ల అమ్మకాలు ఢమాల్.. ఎందుకంటే?) కరోనా సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా చిప్సెట్ల కొరత ఏర్పడటంతో కార్ల తయారీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొత్త కార్లు తయారు చేయడానికి కంపెనీలకు చాలా సమయం పడుతోంది. దీంతో బుకింగ్‌లు ఉన్నప్పటికీ కార్లను డెలివరీ చేయలేక కంపెనీలు సతమతమవుతున్నాయి. అటు వినియోగదారులు కూడా కొత్త కార్ల కోసం సుదీర్ఘ సమయం ఎదురు చూడాల్సి వస్తోంది. (క్లిక్: ఆర్డర్లు ఉన్నాయి.. కానీ టైమ్‌కి డెలివరీ చేయలేం!)