6 month-old Mahindra XUV700 catches fire on Jaipur highway while driving - Sakshi
Sakshi News home page

ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో

Published Tue, May 23 2023 12:10 PM | Last Updated on Tue, May 23 2023 12:51 PM

6 month old Mahindra XUV700 catches fire while driving - Sakshi

Mahindra XUV700 Catches Fire: దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఈ కారు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ కారు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, కులదీప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అతని ఎక్స్‌యూవీ 700లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడానికి ముందు పొగలు రావడంతో కారులోని వారందరూ కిందికి దిగేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని ప్రాధమిక పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ కారు కాలిపోయినప్పటికీ ఎక్స్‌యూవీ 700 ఓనర్ మాత్రం మహీంద్రా సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు.

మంటల్లో కాలిపోయిన కారు కొనుగోలు చేసి కేవలం ఆరు నెలలు మాత్రమే అయినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపైనా మహీంద్రా కంపెనీ స్పందిస్తూ మా కస్టమర్ల సేఫ్టీ ప్రధమ లక్ష్యమని చెబుతూ ప్రమాదానికి కారణం ఫ్యూయెల్ లీక్ లేదా ఇంజిన్లో ఏర్పడిన ఒత్తిడి అయి ఉండవచ్చని వెల్లడించింది. అయితే ఆ కారు ఓనర్‌కి మళ్ళీ కొత్త కారు ఇస్తుందా? లేదా? అనేదానిపై ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు.

సేఫ్టీ ఫీచర్స్..
మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికి వస్తే, మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి.

(ఇదీ చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు నాకొద్దు.. మీరే తీసుకోండి - వైరల్ అవుతున్న పోస్ట్!)

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మల్టిపుల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 14.01 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 26.18 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మంటల్లో కాలిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇల్లన్తి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement