ఆస్ట్రేలియాలో విడుదలకానున్న ఇండియన్ బ్రాండ్ కారు ఇదే | Mahindra XUV700 launching australia on june 15 and details | Sakshi
Sakshi News home page

Mahindra XUV700: ఆస్ట్రేలియాలో విడుదలకానున్న ఎక్స్‌యువి700.. అట్లుంటది మహీంద్రా అంటే?

Published Sun, Jun 4 2023 7:07 PM | Last Updated on Sun, Jun 4 2023 7:08 PM

Mahindra XUV700 launching australia on june 15 and details - Sakshi

Mahindra XUV700 Australia Launch: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra and Mahindra) కంపెనీకి చెందిన XUV700 త్వరలో ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఈ SUV ఆస్ట్రేలియన్ మార్కెట్లో కూడా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము.

మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యువి700 ఎస్‌యువిని జూన్ 15 న అధికారికంగా విడుదలచేయనున్నట్లు ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ కారు ఆస్ట్రేలియాలో మిత్సుబిషి అవుట్ ల్యాండర్, హోండా సిఆర్-వి, నిస్సాన్ ఎక్స్-ట్రైల్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

(ఇదీ చదవండి: పాకిస్థాన్‌లో అత్యంత ధనవంతురాలైన హిందూ మహిళ.. సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?)

ఆస్ట్రేలియా మార్కెట్లో విడుదయ్యే మోడల్ 7 సీటర్ మాత్రమే అని నివేదికల ద్వారా తెలుస్తోంది. కావున ఎక్స్‌యువి700 5 సీటర్ రూపంలో విడుదలయ్యే అవకాశం లేదనిపిస్తోంది. డిజైన్, ఫీచర్స్ దాదాపు ఇండియన్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంటుంది. ఇంజిన్ ఎంపికలు కూడా ఇవే ఉంటాయని తెలుస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక సమాచారం జాన్ 15న లాంచ్ సమయంలో వెల్లడవుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement