catches fire
-
నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..
నెయిల్ రిమూవర్ గురించి మనందరికీ తెలుసు. మన వేలి గోళ్లపై నెయిల్ పాలిష్ సరిగ్గా లేకున్నా లేదా తొలగించాలనుకున్నా నెయిల్ రిమూవర్‌ని ఉపయోగిస్తాం. అలానే ఓ చిన్నారి తన వేలి గోళ్లకు నెయిల్ పాలిష్ సరిగా లేదని తొలగించేందుకు నెయిల్ రిమూవర్‌ని ఉపయోగించింది. అంతే అనూహ్యంగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల బారినపడింది ఆ చిన్నారి. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఓహియోకు చెందిన 14 ఏళ్ల కెన్నడి అనే బాలిక కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ని తొలగిస్తుంది. తన వేళ్లకు నెయిల్ పాలిష్ సంక్రమమైన రీతీలో లేదని తొలగించాలనుకుంటుంది. అయితే ఆ టైంలో తన మంచానికి సమీపంలో కొవ్వొత్తి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ నెయిల్ రిమూవర్ ఆవిరికి సమీపంలోనే కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచిపోయాయి. దీంతో ఆ చిన్నారి చేతిలోని నెయిల్ పాలిష్ బాటిల్ డబ్ మని పగిలి మంటలు మరింతగా మంటలు వ్యాపించాయి. ఆమెతో సహా అక్కడ ఉన్న వస్తువులన్నీ అంటుకుపోతున్నాయి. ఈ హఠాత్పరిణామానికి బిగ్గరగా కేకలు పెట్టింది. అయితే ఆ టైంలో చిన్నారి తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నారు. కెన్నడీ అరుపుతో ఉలిక్కిపడ్డ తలిదండ్రులు ఆమె బెడ్ రూంలోకి హుటాహుటీనా వెళ్లి చూడగా..గదిఅంతా పొగలు కమ్మి చిన్నారి మంటల్లో చిక్కుకుని ఉంది. వెంటనే వారు స్పందించి..కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేసి హుటాహుటీనా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనతో తల్లిందండ్రలు గట్టి షాక్‌లోకి వెళ్లిపోయారు. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు నుంచి, రెండు తొడలు, ఆమె కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా భాగాల్లో ఎక్సిషన్ అనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా భాగాలకు అయ్యిన గాయాలు తగ్గి కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదిపైన పడుతుందని వైద్యులు తెలిపారు. అంతేగాదు అవి తగ్గేందుకు కొద్దిపాటి చికిత్స కూడా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏదీఏమైనా పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడూ మధ్యమధ్యలో కాస్త గమనించండి. ఎల్లవేళల వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే తెలిసి తెలియన పనులతో ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
ఫైన్ మాత్రమే కాదు.. కొత్త కారు కూడా! కస్టమర్ దెబ్బకు ఖంగుతిన్న డీలర్
కార్లను కొనుగోలు చేసినప్పుడు డీలర్షిప్ వర్గాలు కొన్ని సందర్భాల్లో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి మోసాలకు బలైన బాధితులు కన్స్యూమర్ కోర్టు ద్వారా పరిష్కారం లేదా నష్టపరిహారం పొందుతారు. ఇటీవల కర్ణాటకలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన వ్యక్తి 2019 జూన్ 11న 'అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్' నుంచి 'హ్యుందాయ్ శాంట్రో ఎమ్‌టి స్పోర్ట్జ్' (Hyundai Santro M.T Sportz) కారును రూ. 6,25,663కు కొనుగోలు చేశాడు. ఆ తరువాత ఇందులో లోపాలు ఉన్నట్లు, రెండు సర్వీసింగ్ సెషన్లకు లోనయ్యిందని డీలర్‌షిప్‌కు విన్నవించాడు. కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్షిప్ రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ చేసిన తరువాత 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు బయటపడ్డారు, అదృష్టవశాత్తు ఎవరికీ పెద్ద గాయాలు కాలేదు. సంఘటన జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్‌కు తెలియజేశాడు, డీలర్షిప్ యాజమాన్యం స్పందిస్తూ.. కారును రీప్లేస్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు ఎదురు చూసినా కస్టమర్‌కు కారుని అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్ బాణవర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. కారు తయారీలో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్‌కు తెలియజేశాడు. కాలిపోయిన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ వాగ్దానాలను వెల్లడించాడు. ఈ సంఘటన మానసిక ఒత్తిడికి దారితీసినట్లు, ఎక్కువ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్లు ప్రస్తావించాడు. ఇదీ చదవండి: గంటకు 23 మంది.. ఏడాదికి వేలల్లో.. ఆందోళనలో టెకీలు! విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్.. తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించి, దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త హ్యుందాయ్ శాంత్రోను అందించాలని, కస్టమర్‌కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని కంపెనీని ఆదేశించింది. -
ఖరీదైన కారు కాలిపోతే కంపెనీకి థ్యాంక్స్ చెప్పిన ఓనర్ - వైరల్ పోస్ట్ & వీడియో
Mahindra XUV700 Catches Fire: దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతీయ మార్కెట్లో విడుదల చేసిన XUV700 ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. ఆధునిక డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగి ఈ కారు అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఇటీవల ఈ కారు హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ప్రమాదానికి గురైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కులదీప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్ హైవేపై ప్రయాణిస్తుండగా అతని ఎక్స్‌యూవీ 700లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో మంటలు రావడానికి ముందు పొగలు రావడంతో కారులోని వారందరూ కిందికి దిగేసారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉంటుందని ప్రాధమిక పరిశోధనలో వెల్లడైంది. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. కానీ కారు కాలిపోయినప్పటికీ ఎక్స్‌యూవీ 700 ఓనర్ మాత్రం మహీంద్రా సంస్థకు కృతజ్ఞతలు చెప్పారు. Thank You Mahindra For Risking My Family's Life With Your Most Premium Product (XUV700). The Car Catches Fire While Driving On Jaipur Highway. The car did not overheat, smoke came in the moving car, then it caught fire.@anandmahindra @MahindraRise @tech_mahindra @ElvishYadav pic.twitter.com/H5HXzdmwvS — Kuldeep Singh (@ThKuldeep31) May 21, 2023 మంటల్లో కాలిపోయిన కారు కొనుగోలు చేసి కేవలం ఆరు నెలలు మాత్రమే అయినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. దీనిపైనా మహీంద్రా కంపెనీ స్పందిస్తూ మా కస్టమర్ల సేఫ్టీ ప్రధమ లక్ష్యమని చెబుతూ ప్రమాదానికి కారణం ఫ్యూయెల్ లీక్ లేదా ఇంజిన్‌లో ఏర్పడిన ఒత్తిడి అయి ఉండవచ్చని వెల్లడించింది. అయితే ఆ కారు ఓనర్‌కి మళ్ళీ కొత్త కారు ఇస్తుందా? లేదా? అనేదానిపై ఎటువంటి అధికారిక ప్రకటన ప్రస్తుతానికి వెలువడలేదు. Our customers' safety is always our top most priority. Here is our official statement with reference to an incident on Jaipur National Highway involving the XUV700. pic.twitter.com/hOHEQWhVyC — Mahindra Automotive (@Mahindra_Auto) May 22, 2023 సేఫ్టీ ఫీచర్స్.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 విషయానికి వస్తే, మార్కెట్లో ఎక్కువ మంది ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటి సేఫ్టీ ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ కూడా ఉంది. ఇవన్నీ ప్రయాణికుల భద్రతను కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. (ఇదీ చదవండి: ఈ ఎలక్ట్రిక్ కారు నాకొద్దు.. మీరే తీసుకోండి - వైరల్ అవుతున్న పోస్ట్!) మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మల్టిపుల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ SUV ప్రారంభ ధర రూ. 14.01 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 26.18 లక్షలు (ధరలు ఎక్స్-షోరూమ్). మంటల్లో కాలిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా వెల్లడి కాలేదు. ఇల్లన్తి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం..ప్రయాణికురాలు సజీవదహనం
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాలో మంటలు చెలరేగడంతో ఓ మహిళ ప్రయాణికురాలు అక్కడికక్కడే సజీవ దహనమైంది. ఈ ఘటన థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులోని గైముఖ్ ప్రాంతంలో జరిగిందని అధికారులు తెలిపారు. ఆటో రిక్షా డివైడర్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన మహిళను గుర్తించాల్సి ఉందన్నారు. ఆమె వాహనంలో ఇరుక్కుపోవడంతోనే సజీవ దహనమైనట్లు తెలిపారు. ఆ ఆటో రిక్షి థానే నగరం నుంచి భయందర్ వైపు వెళ్తుండగా నియంత్రణ కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్ రాజేష్ కుమార్‌కు(45) తీవ్ర గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు) -
గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్‌ని ప్రకటించి కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్పోర్ట్ తెరిచే ఉందని జాన్‌గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు. Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7 — CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023 (చదవండి: నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు) -
గాల్లో ఉండగానే హాట్ ఎయిర్ బెలూన్‌లో ఎగిసిపడ్డ మంటలు..ప్రయాణికులు..
హాట్ ఎయిర్ బెలూన్లలో పయనిస్తూ ఆకాశపు వీధిని చూడటం అనేది ఒక త్రిల్. సాహస క్రీడలంటే ఇష్టపడే వారు ఈ బెలుస్లలో పయనించడానికి ఎంతో ఇష్టపడతారు. అచ్చం అలానే కొందరు పర్యాటకులు ఒక హాట్ ఎయిర్ బెలూన్‌లో పయనిస్తుండగా విషాదం చోటు చేసుకుంది. ఏమోందో ఏమో! ఒక్కసారి మంటలు చుట్టుముట్టాయి. దీంతో బెలూన్ గోండోలాలో ఉన్న ప్రయాణికులు భయంతో దూకేయగా..మరికొందరూ ఆ మంటల్లో చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక చిన్నారి ముఖానికి తీవ్ర గాయాలు కాగా, దూకేయడంతో తొడ ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. భాదితులను 39 ఏళ్ల మహిళ, 50 ఏళ్ల వృద్ధురాలిగా గుర్తించారు. ఇంకా ఇతర ప్రయాణకులెవరైనా ఆ బెలున్ గోండోలాలో ఉన్నారనే తెలియాల్సి ఉంది. మెక్సికో నగరానికి ఈశాన్యంగా ఉన్న టియోటిహుకాన్ అనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రం వద్ద ఈ హాట్ హెయిర్ బెలూన్లను టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. Mexico 🇲🇽 ! Breaking news!🚨🚨 Saturday, April 01, 2023, in the morning hours. a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead. The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH — Lenar (@Lerpc75) April 1, 2023 (చదవండి: అమెరికాలో టోర్నడో బీభత్సం) -
పుణెలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం.. గ్రౌండ్ ఫ్లోర్లో జహీర్ ఖాన్ రెస్టారెంట్
పుణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లుల్లా నగర్ చౌక్ ప్రాంతంలోని మార్వెల్ విస్టా భవనం టాప్ ఫ్లోర్‌లోని వెజిటా రెస్టారెంట్లో ఉదయం 8.45 నిమిషాలకు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేశాయి. మూడు ఫైరింజన్లు, వాటర్ ట్యాంకర్లను రంగంలోకి దింపినట్లు పుణె అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు పేర్కొన్నారు. Fire breaks out at the top floor of Marvel Vista building in Lulla Nagar Chowk in Pune, Maharashtra pic.twitter.com/y2Y9YQTVFu — The Jamia Times (@thejamiatimes) November 1, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో మంటల ధాటికి కాలిపోతున రెస్టారెంట్ రూఫ్, కీటికీలు కూలి కిందపడిపోవటం కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాద సమమంలో రెస్టారెంట్ మూసివేసి ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇదే బిల్డింగ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉన్నట్లు తెలిసింది. చదవండి: ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం.. ఉవ్వెత్తున ఎగిసిన మంటలు #Pune: Massive fire breaks out inside a home at Marvel Vista, a G+7 storey building in Lullanagar, Kondhwa Two water tankers and three fire brigades responded immediately and reached the spot#PuneFire #Fire pic.twitter.com/81x5aVnaGd — Free Press Journal (@fpjindia) November 1, 2022 -
7 ఎలక్ట్రిక్ బైక్స్ అగ్నికి ఆహుతి, ఓవర్ చార్జింగే కారణమా?
సాక్షి,ముంబై: మహారాష్ట్ర, పూణెలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షాపులో ఏడు ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన ఉదంతం కలకలం రేపింది. రాత్రి పూట వాహనాలు చార్జ్ అవుతుండగా, షార్ట్ సర్క్యూట్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం మంటలను ఆర్పాల్సి వచ్చింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణాన్ని తోసిపుచ్చిన ఫైర్ అధికారి బ్యాటరీ ఓవర్ చార్జ్ కావడంతో మంటలంటుకుని ఉండవచ్చన్నారు. సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడ లేదు. షోరూంలో మొత్తం 16 స్కూటర్లు ఉన్నందున ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అంచనా. సమగ్ర విచారణ తర్వాతే కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. షోరూమ్‌లో ఒక బైక్‌లో పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయనీ, తరువాత ఆరు స్కూటర్లను చుట్టుముట్టాయని యాజమాన్యం వెల్లడించింది. ఇతర ఆస్తులకు కూడా నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. మొత్తం స్కూటర్ల అంచనా ఖరీదు దాదాపు రూ.7 లక్షలుగా భావిస్తున్నారు. విచారణ తరువాత వివరాలు అందిస్తామని కొమాకి దేవల్ రైడర్స్ షోరూమ్ యజమాని ధనేష్ ఓస్వాల్ తెలిపారు. కాగా ఈ వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది మార్చిలో పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాత తనిఖీ కోసం 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లోపాలే ఈ ప్రమాదానికి కారణమన్న ఆందోళనల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక తరువాత కేంద్రం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. నాసిరకం బ్యాటరీ ప్యాక్‌లకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఆయా కంపెనీలకు పంపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం నిబంధనలను పాటించడంలో విఫలమైతే డిఫాల్టర్ కంపెనీలకు భారీ జరిమానాలు తప్పవని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
షాకింగ్ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, టాటా ఏమందంటే?
సాక్షి,ముంబై: కాలుష్య భూతాన్ని నిలువరించే లక్ష్యంతో దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బైక్స్ మంటల్లో చిక్కుకోవడంతో ఈ వాహనాల భద్రతపై అనుమానాలు వెల్లువెత్తాయి. తాజాగా ముంబై నగరంలో టాటా నెక్సాన్ ఈవీ కారు అగ్ని ప్రమాదానికి గురి కావడం టాటా నెక్సాన్ లవర్స్‌ని షాక్‌కు గురిచేసింది. ఇపుడిక ఫోర్ వీలర్ల (ఈవీ) భద్రతపై చర్చకు తెర లేచింది. ఇప్పటివరకు ఈవాహనాల అగ్నిప్రమాదాలు టూవీలర్లకే పరిమితమైనా, టాప్ సెల్లర్ కారు టాటా నెక్సాన్‌కు సంబంధిం తొలి సంఘటన నమోదు కావడంతో మరింత ఆందోళన నెలకొంది. టాటా గ్రూపు కంపెనీ టాటా మోటార్స్ ప్రజాదరణ పొందిన కారు నెక్సాన్ ఈవీ ప్రమాదానికి గురైంది. ఈ కారులో ఉన్నట్టుండి మంటలంటు కున్నాయి. ఒక్కసారిగా ఎగిసిన మంటలతో కారు దాదాపు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు మంటలు చెలరేగిన నెక్సాన్ఈవీ యజమాని ఇప్పటికే టాటా మోటార్స్‌తో సహకరించడానికి అంగీకరించారు. కారును ఇప్పటికే కంపెనీకి అప్పగించగా, దీన్ని పూణేలోని టాటా ఆర్ అండ్ డీ కేంద్రానికి తరలించనున్నారు. మరోవైపు దీనిపై టాటా గ్రూపు స్పందించింది. నెక్సాన్ అగ్నిప్రమాదం ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించింది టాటా మోటార్స్. ప్రస్తుతం వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందనీ ప్రమాదానికి దారితీసిన అంశాలను గుర్తించిన తర్వాత పూర్తి ప్రకటన చేస్తామని టాటా ప్రతినిధి తెలిపారు. 2020లో లాంచ్ చేసిన టాటా నెక్సాన్ఈవీ విక్రయాలు 30 వేలకు పైగా నమోదయ్యాయి. కాగా ఓలా, ప్యూర్ఈవీ తదితర ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీల కారణంగా అగ్నిప్రమాదాలకు గురయ్యాయి. బ్యాటరీ నాణ్యత విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. Tata Nexon EV catches massive fire in Vasai West (near Panchvati hotel), a Mumbai Suburb, Maharashtra. @TataMotors pic.twitter.com/KuWhUCWJbB — Kamal Joshi (@KamalJoshi108) June 22, 2022 -
చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో
బీజింగ్: చైనాలోని సౌత్‌వెస్ట్ నగరం చాంగ్కింగ్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ప్రాణ నష్టం జరగలేదు. వివరాల ప్రకారం.. టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం చైనాలోని సౌత్‌వెస్ట్ చాంగ్కింగ్ ఎయిర్పోర్ట్ నుంచి గురువారం ఉదయం టిబెట్‌లోని న్యింగ్చికి వెళ్లాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అందులో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలెట్ గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సంబంధిత అధికారుల వద్ద అనుమతి తీసుకుని వెంటనే ల్యాండ్ చేశారు. కానీ విమానం ల్యాండింగ్ చేసిన తరువాత అది కంట్రోల్ తప్పి రన్‌వే దాటి వెళ్లిపోయింది. దీంతో పాటు విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్పటికే అప్రమత్తంగా ఉన్న విమానాశ్రయ సిబ్బంది అందులోని ప్రయాణికులని, సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడగా అస్పత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు. కాగా, రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటివరకు విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA — BST2022 (@baoshitie1) May 12, 2022 చదవండి: Russia-Ukraine War: రష్యా సైన్యాన్ని తరిమికొడుతున్నాం -
కిచెన్‌లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
-
షాకింగ్: కిచెన్‌లో మహిళ నెత్తిన మంటలు.. వీడియో వైరల్
కిచెన్‌లో పని చేస్తుండగా పొరపాటున గిన్నెలు, వంటకాలు జారి కింద పడిపోవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు గ్యాస్ పేలడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే వంటగదిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాజాగా కిచెన్‌లో వంట చేస్తున్న ఓ మహిళ నెత్తిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటన సెప్టెంబర్ 16 చోటుచేసుకుంది. చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. వివాదాస్పదంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు వీడియోలో.. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తోంది. ఓ వంటకం కోసం కొన్ని పదార్థాలను తీసుకోవడానికి కిందకు వంగి ఓ ప్లేట్ తీసుకుంది. ఆ సమయంలోనే స్టవ్ మంట వద్ద మహిళ జుట్టు తాకడంతో ఆకస్మాత్తుగా ఆమె జుట్టులో మొదట పొగ రావడం కనిపించింది. కానీ దానిని మహిళ గుర్తించలేదు. అప్పుడే కొన్ని వస్తువులు కిందపడదడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగారు. అప్పటికీ మంటను గమనించకుండా కిచెన్ అంతా తిరుగుతూ తన పని చేసుకుంటూ పోయారు. చదవండి: అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.! ఇలా 45 సెకన్ల తరువాత ఆమె తలపై వేడిగా అనిపించడంతో మహిళ జుట్టపై మంటలు అంటుకున్నాయిని గుర్తించారు. వెంటనే ఆమె మంటలను ఆర్పి వేసి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రశాంత్ సాహూ అనే వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వంటగదిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట! -
హైదరాబాద్: కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
-
నీళ్లలో మంటలా.. ఇదెలా సాధ్యం!
బీజింగ్ : సాధారణంగా ఎప్పుడైనా మంటలు అంటుకుంటే నీళ్లు పోసి ఆర్పడం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం నీళ్లతో మంటలు వస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కుళాయి తిప్పగానే ఒక వ్యక్తి నీళ్ల దగ్గర ఒక లైటర్‌ను వెలిగించాడు. దీంతో ఒక్కసారిగా నీటికి మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మాములు స్థితికి చేరుకుంది. కాగా వీడియోను పీపుల్స్ డెయిలీ తన ట్విటర్లో షేర్ చేయడంతో చూసినవారు కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు. నీళ్లలో మంటలా ఇదెలా సాధ్యం అని కామెంట్లు పెడుతున్నారు. చైనాకు చెందిన వెన్ అనే మహిళ ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయని వెన్ తెలిపింది. కేవలం మా ఇంట్లో మాత్రమే కాదు.. ఇక్కడున్న దాదాపు వంద ఇళ్లలో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నాం అని పేర్కొంది. కాగా వీడియోపై అక్కడి జలవనరులశాఖ అధికారులు స్పందించారు. 'వాస్తవానికి గ్రామాన్ని మొత్తం అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కనెక్టివిటీ చేశాం. ఆ సందర్భంలో ఒక దగ్గర నేచురల్ గ్యాస్‌కు సంబంధించిన పైప్‌లైన్ పగిలి కొద్దిపాటి గ్యాస్ లీకై అండర్‌గ్రౌండ్ వాటర్‌తో కలిసిపోయింది. దీంతో ఇలా తరచుగా నీళ్లకు మంటలు అంటుకుంటున్నాయని అసలు విషయం బయటపెట్టారు. కాగా ప్రస్తుతం నీళ్ల సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి మరమత్తులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. Videos of flammable tap water in Panjin, NE China's Liaoning have gone viral. The odd scene is caused by natural gas infiltration due to temporary underground water supply system error, which is now shut down. Normal supply has resumed. Further probe will be conducted: local govt pic.twitter.com/a5EOA5SATU — People's Daily, China (@PDChina) November 24, 2020 -
బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయపుర నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలో హిరియూర్ తాలూకాలోని కెఆర్ హళ్లి వద్ద జాతీయ రహదారిపై అకస్మాత్తుగా బస్సులో మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. 32 మంది ప్రయాణికులతో వస్తున్న ఈ బస్సులో ఇంజీన్ సమస్య కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హిరియూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న హిరియూర్ ఎస్పీ రాధిక సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. Karnataka: Five people, including a baby, charred to death and 27 injured, last night in Hiriyur near Chitradurga district, after their bus caught fire on National Highway 4. The injured have been shifted to hospital. pic.twitter.com/Je1PxEbTv4 — ANI (@ANI) August 12, 2020 -
ట్రాన్స్పోర్ట్ కంటైనర్‌లో మంటలు
-
గడ్డిలారీకి మంటలు..తప్పిన పెను ముప్పు
-
బ్రిడ్జి పైన మినీ వ్యాన్ దగ్ధం
-
నడిరోడ్డుపై తగలబడిన కారు
-
పేలిన రెడ్మి నోట్ స్మార్ట్‌ఫోన్
సాక్షి,ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో ఒకటి, భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్నషావోమికి మరోసారి పేలుడు షాక్ తగిలింది. షావోమి పాపులర్ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్మి నోట్ 7ఎస్’ ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. అంతేకాదు చార్జింగ్‌లో లేకుండానే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది. అయితే షావోమి మాత్రం ఎలాంటి సాంకేతిక లోపం లేదని, కస్టమర్ తప్పిదం వల్లే ఇలా జరిగివుంటుందని పేర్కొనడం చర్చకు దారి తీసింది. ముంబైకి చెందిన ఈశ్వర్ చావన్ తనకెదురైన చేదు అనుభవాన్నిసోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్మి నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసినట్లు చావన్ ట్వీట్లో వివరించారు. ‘కొత్త ఫోన్ ఆఫీసు టేబుల్ మీద పెట్టాను. సడన్‌గా ఏదో కాలుతున్న వాసన గమనించాను. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఫోన్ ఛార్జింగ్‌లో లేదు’ అని తెలిపారు. అంతేకాదు.. తన ఫోన్ ఎపుడూ కింద కూడా పడలేదని గుర్తు చేసుకున్నారు. వెంటనే ఆయన థానేలోని షావోమి అధీకృత దుకాణాన్ని సంప్రదించారు. ఐదు రోజుల తరువాత, బ్యాటరీలో కొంత సమస్య ఉందని కంపెనీ చెప్పిందని చావన్ పేర్కొన్నారు. బ్యాటరీ లోపం, తయారీ లోపం వల్లే ఇలా జరిగి వుంటుందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే షావోమీ స్పందిస్తూ..నాణ్యతకు, భద్రతకు అధిక ప్రాధాన్యత యిస్తామని, గత అయిదేళ్లుగా అభిమానులుతమ బ్రాండ్‌పై చూసిన అభిమానానికి ఇది నిదర్శనమని తెలిపింది. తాజా ఘటనను పరిశీలించిన తరువాత, బాహ్య పరిస్తితుల కారణంగానే నష్టం జరిగిందని తేల్చి పారేసింది. 'కస్టమర్ ప్రేరిత నష్టం' గా భావిస్తున్నట్టుగా పేర్కొంది. -
మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు : తప్పిన ప్రమాదం
సాక్షి, పనాజి : ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్ తెలిపారు. పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి చెప్పారు. -
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
-
కరెంట్ వైర్లు తెగిపడి పూరిళ్లు దగ్ధం
-
నడిచే కారులో అకస్మాత్తుగా మంటలు
సాక్షి, పెద్దపల్లిరూరల్: నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. వివరాలు.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం మందంపల్లికి చెందిన సిద్ధం నానయ్యకు కాలు విరగడంతో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేయించేందుకు అతని భార్య మల్లక్క, కొడుకు మల్లేశ్‌తో కలసి వారి సొంత కారు ఏపీ 30ఏ3880లో వెళ్లారు. చికిత్స అనంతరం గురువారం హైదరాబాద్ నుంచి ఇంటికి బయల్దేరారు. మల్లేశ్ నడుపుతున్న కారులో నానయ్య, మల్లక్క ప్రయాణం చేస్తున్నారు. పెద్దపల్లి సమీపంలోని కల్వల క్యాంపు దాటుతున్న సమయంలో కారు ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన మల్లేశ్.. వెంటనే కారును రోడ్డుపై నిలిపి తల్లి మల్లక్క సహయంతో తండ్రి నానయ్యను కిందకు దించారు. కారును రోడ్డు పక్కన ఆపేందుకు మల్లేశ్ ప్రయత్నిస్తున్న సమయంలోనే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. దీంతో కారును వదిలేసి మల్లేశ్ చాకచక్యంగా వ్యవహరించడం వల్లే అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. రాజీవ్‌రహదారిపై మంటల్లో కారు కాలిపోతుండటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. -
ఫ్లైఓవర్‌పై మంటల్లో చిక్కుకున్న పెట్రోల్ ట్యాంకర్