సాక్షి, పనాజి : ఇండిగో విమానానికి మరోసారి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానంలో అకస్మాత్తుగా మంటలు వ్యాంపించాయి. దీంతో ప్రయాణీకుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే వెంటనే అప్రమత్తమైన పైలట్, విమానాన్ని తిరిగి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో గోవా పర్యావరణ మంత్రి నీలేశ్ కాబ్రాల్ కూడా ఉన్నారు. గోవా దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
గోవా నుంచి ఢిల్లీ బయలుదేరిన పదిహేను నిమిషాల తరువాత ఇంజీన్‌లో మంటలంటుకున్నాయని మంత్రి నీలేశ్ తెలిపారు. పైలట్ వెంటనే ఎడమ ఇంజీన్ ఆపివేసి తమను తిరిగి గోవాకు ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. తనతో సహా మిగిలిన 180 మంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించారు. అధికారిక సమావేశానికి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment