అత్యవసర మళ్లింపు.. ఫలితం లేకపోయింది: ఇండిగో | IndiGo Flight Diverted To Karachi Due to Medical Emergency | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌కు అస్వస్థత, కరాచీకి ఎమర్జెన్సీ మళ్లింపు

Published Tue, Mar 2 2021 11:02 AM | Last Updated on Tue, Mar 2 2021 11:17 AM

IndiGo Flight Diverted To Karachi Due to Medical Emergency - Sakshi

న్యూఢిల్లీ: షార్జా నుంచి లక్నోకు వెళుతున్న ఇండిగో ఎయిర్‌లైన్ విమానాన్ని అత్యవసర పరిస్థితుల నిమిత్తం కరాచీకి మళ్లీంచారు. ఫైట్‌ 6E 1412 మంగళవారం షార్జా నుంచి లక్కోకు బయలుదేరింది. ఈ క్రమంలో ఓ ప్యాసింజర్‌ అస్వస్థతకు గురికావడంతో అత్యవసర వైద్య పరీక్షల నిమిత్తం ప్లైట్‌ను కరాచీకి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికి ఫలితం లేకపోయిందని, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు ఎయిర్‌పోర్టు వైద్యులు ధృవీకరించారని ఇండిగో ఎయిర్‌లైన్‌ సంస్థ వెల్లడిచింది. అయితే ప్యాసింజర్‌ వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement