ప్రయాణికులతో బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. విమానంలోని సిబ్బంది ఆ విషయాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై.... ఆ మంటలను ఆర్పివేశారు. ఆ ఘటన మసాచూసెట్స్లోని బెడ్ఫోర్డ్ హన్స్కామ్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి గత రాత్రి న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరానికి బయలుదేరే సమయంలో ఆ ప్రమాదం చోటు చేసుకుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
విమానం రన్వేపైకి వెళ్లేందుకు బయలుదేరుతున్న క్రమంలో విమానంలో మంటలు వ్యాపించాయన్నారు. ఆ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని తెలిపారు. ఆ విమానం ఘటనపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు, వారి వివరాలు మాత్రం తెలియలేదని వెల్లడించారు.